jurassic world
-
జురాసిక్.. ఫుల్ కిక్
ప్రస్తుతం హాలీవుడ్లో నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో టాపిక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచినవాటిలో ‘జురాసిక్ వరల్డ్ 3’ ఒకటి. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి చిత్రం ‘జురాసిక్’ (1993)లో వెండితెరపై రాక్షస బల్లులు చేసిన వీర విహారానికి పిల్లలూ పెద్దలూ ఫిదా అయిపోయారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ఈ ‘జురాసిక్ పార్క్’ ఎంత క్రేజ్ తెచ్చుకుందంటే.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్‌ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ఇప్పుడు ‘జురాసిక్ వరల్డ్ 3’పైనే అందరి దృష్టి ఉంది. కొందరు రచయితలతో కలిసి చిత్రదర్శకుడు కోలిన్ ట్రెవరో ఈ భాగానికి రాసిన స్క్రిప్ట్ అదిరిపోయే రేంజ్లో ఉందని కీలక పాత్రధారి క్రిస్ ప్రాట్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది విడుదలై, ఘనవిజయం సాధించిన ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’కి దీటుగా తాజా జురాసిక్ చిత్రం ఉంటుంది. జురాసిక్ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాలకన్నా ఈ చిత్రకథ మరింత కిక్ ఇచ్చే విధంగా ఉంది. తొలి భాగంలో నటించిన స్యామ్ నీల్, లారా డెర్న్, జెఫ్ గోల్డ్‌బ్లమ్ కూడా ఈ చిత్రంలో నటిస్తారు. భారీ స్థాయిలో రాబోతున్న చిత్రం ఇది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు క్రిస్ ప్రాట్. వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. -
ముందు ఇండియాలోనే
హాలీవుడ్ చిత్రాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకున్నాయి. రీసెంట్గా విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ తాజా ఉదాహరణ. ఇప్పుడు అందరి కళ్లూ సెన్సేషనల్ మూవీ ‘జురాసిక్ పార్క్’ సిరీస్ ‘జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్’ మీద ఉంది. జె.ఏ. బయోనా దర్శకత్వం వహించారు. క్రిస్ ప్రాట్, హోవర్డ్, లెడ్ లెనిన్, రఫీ స్పాల్ జోన్స్, స్మిత్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను చైనా, అమెరికాలో కంటే ముందు ఇండియాలోనే రిలీజ్ చేయనున్నారు. జూన్ 15న చైనాలో, జూన్ 22న అమెరికాలో విడుదల కానున్న ఈ హాలీవుడ్ సినిమా ఇండియాలో జూన్ 8న రిలీజ్ కానుంది. -
డేంజరస్ డైనోసర్...
‘‘ఈ భూమ్మీద జీవించిన అతి భయంకరమైన జంతువు ఇది’. ఆ జంతువును బంధించి పెట్టారు. ఒక పెద్ద గదంత పెద్దగా ఉంది ఆ జంతువు. హీరో అందులో ఉన్నాడు. అతని భార్యా పక్కనే ఉంది. ఆ జంతువు వాళ్లను చూసింది. గట్టిగా అరిచింది. పట్టుకునేందుకు గాండ్రిస్తూ తిరిగింది. అంతే తిరుగులేని యాక్షన్ అడ్వెంచర్‌కు మూలం దొరికేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? అంతకుముందు ఏం జరిగింది? ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! ఆ జంతువు పేరు డైనోసర్. దశాబ్దాలుగా అడ్వెంచర్ సినిమాలను ఇష్టపడుతూ వస్తున్న వారికి డైనోసర్ గురించి, జురాసిక్ పార్క్ గురించీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జురాసిక్ పార్క్‌కు రీబూట్లాగా జురాసిక్ వరల్డ్ సిరీస్ ప్రస్తుతం నడుస్తోంది. ఇందులో కొత్త సినిమా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’. జూన్ 7న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు, మూడు ట్రైలర్లతో ఆసక్తి పెంచిన ఈ సినిమా, తాజాగా ఫైనల్ ట్రైలర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చింది. సినిమా ఎలా ఎలా ఉండబోతోందో ఈ ట్రైలర్ స్పష్టంగా తెలియజేస్తోంది. దర్శకుడు జె.ఎ.బయోనా, జురాసిక్ పార్క్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని, వాళ్లను ఆకర్షించే సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కోరుకునే వారికి ఈ సినిమా పండగే అని తెలుస్తోంది. పిల్లలు, అడ్వెంచర్స్ ఇష్టపడే పెద్దలూ జురాసిక్ వరల్డ్ కోసం, ఈ ట్రైలర్ విడుదలయ్యాక ఇంకా పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ డేంజరస్ డైనోసర్ మనల్ని ఎలా భయపెడుతుందో, ఆకట్టుకుంటుందో చూడాలి!! -
జురాసిక్ వరల్డ్ తుది ట్రైలర్ వచ్చేసింది
సాక్షి, సినిమా : ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న జురాసిక్ వరల్డ్-ఫాలెన్ కింగ్డమ్ తుది ట్రైలర్ వచ్చేసింది. ఊహించినట్లుగానే ట్విస్ట్‌లతో, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్‌కు ఈ చిత్రం సీక్వెల్. ఈ ట్రైలర్ భయం గొలిపేదిగా ఉందని సోషల్‌మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. జేఏ బయోనా దర్శకత్వం వహిస్తున్న చిత్రం జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా వెండితెర మీదకు రానుంది. -
జురాసిక్ వరల్డ్ ట్రైలర్ వచ్చేసింది
-
ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ
సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయ్.. పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చక్కగా సినిమాలు చూసే టైమ్. సాయంకాలాలు అలా థియేటర్లలో వాలిపోయి సినిమాలను ఎంజాయ్ చేసే టైమ్. మరి మనకు సమ్మర్ అప్పుడే వచ్చేసింది కానీ యూఎస్‌లో ఇంకో రెండు నెలలు వెయిట్ చెయ్యాలి సమ్మర్‌కు. మనకైతే సమ్మర్ వేడిని పుట్టించేందుకు వాళ్ల స్ప్రింగ్ సీజ్న్లోనే భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ మొదలుకొని ‘డెడ్‌పూల్ 2’ వరకు ఇండియన్ అభిమానులను అలరించేందుకు హాలీవుడ్ రెడీ అయిపోయింది. ఆ సినిమాలను ఒకసారి పలకరించుకొద్దాం.. అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’.. సమ్మర్లో ఈ ఒక్క సినిమా కోసం యాక్షన్ సినిమా అభిమానులందరూ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు కాబట్టి ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది. సూపర్‌మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్.. ఇలా మనల్ని మెప్పించిన సూపర్ హీరోలంతా ఒక దగ్గర చేరి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే? అంతమంది సూపర్‌హీరోలు ఒకేసారి ఫైట్స్ చేస్తూ ఉంటే? అవెంజర్స్ అందుకు స్పెషల్. మార్వెల్ కామిక్స్ క్రియేట్ చేసిన సూపర్హీరోలంతా ఉంటారు ఈ సినిమాలో. వాళ్లు చేసే యాక్షన్, అడ్వెంచర్సే ఈ సినిమాకు హైలైట్. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది అవెంజర్స్. ఈ సమ్మర్లో ఇదే అతిపెద్ద సినిమా. డెడ్‌పూల్ 2 అవెంజర్స్ రిలీజైన సరిగ్గా మూడు వారాలకు వస్తుంది ‘డెడ్‌పూల్ 2’. 2016లో వచ్చిన ‘డెడ్‌పూల్’కు సీక్వెల్ ఇది. అవెంజర్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన డెడ్‌పూల్‌ను ఫుల్‌లెంగ్త్ రోల్లో ఎంజాయ్ చేయడానికి ‘డెడ్‌పూల్ 2’ చూడాల్సిందే మరి! సూపర్‌హీరో జానర్లో ఒక కొత్త ప్రయోగమైన డెడ్‌పూల్ తరహాలోనే సీక్వెల్ కూడా ఉంటుందట. ట్రైలర్ అయితే సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని స్పష్టం చేసేసింది. మే 18న విడుదలవుతోన్న ఈ సినిమాకు ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉండడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ మనకు సమ్మర్ అప్పుడప్పుడే పూర్తవుతూ, చిరుజల్లులు పలకరించే సమయానికి సీజన్‌ను గ్రాండ్‌గా ఎండ్ చేసేందుకు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా వచ్చేస్తోంది. జురాసిక్ పార్క్ నుంచి మొదలుపెడితే జురాసిక్ వరల్డ్ వరకూ ఈ సిరీస్ గురించి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద చరిత్ర. సాధారణంగానే జురాసిక్ పార్క్ సిరీస్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు ఏమాత్రం తక్కువ లేకుండా ఈ కొత్త సినిమా వస్తోంది. 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్‌తో పోల్చితే ఎన్నోరెట్లు ఎక్కువ అడ్వెంచర్లు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ ఇప్పటికే అభిమానులకు ఇవ్వాల్సిన కిక్ అంతా ఇచ్చేస్తోంది. జూన్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. హాలీవుడ్ రికార్డులను తిరగరాసే సినిమాగా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’కు ప్రచారం కల్పిస్తోంది యూనివర్సల్ పిక్చర్స్. పసిఫిక్ రిమ్ అప్రైజింగ్ మొన్నీమధ్యే బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్న గెలెర్మో డెల్తోరో గుర్తున్నాడు కదా? ఆయన దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘పసిఫిక్ రిమ్’ సినిమాకు సీక్వెలే ఈ ‘పసిఫిక్ రిమ్ అప్రైజింగ్’. గెలెర్మో ఈసారి నిర్మాతగానే వ్యవహరించగా, స్టీవెన్ ఎస్ డెనైట్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఆన్ అడ్వెంచర్లు, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గత వారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తునే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా దర్శకుడికి ఇది డెబ్యూట్. డెబ్యూట్‌తోనే ఇంత భారీ బడ్జెట్ సినిమాతో స్టీవెన్మెప్పించడం విశేషం. రెడీ ప్లేయర్ వన్ సూపర్‌స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కొత్త సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2045లో జరిగే సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మాస్టర్ స్టోరీటెల్లర్ అన్న తన స్థాయికి తగ్గట్టే స్పీల్బర్గ్ చేసిన ఈ ప్రయోగానికి ఇండియాలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్‌ను సూపర్ కూల్ గా మొదలుపెట్టిన సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ అనే చెప్పుకోవాలి. ర్యాంపేజ్ ర్యాంపేజ్ కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ కథే! ఒక విచిత్రమైన ప్రయోగంతో చిన్నపాటి గొరిల్లా భయంకరమైన మృగంలా మారిపోతుంది. ఆ తర్వాత అది చేసే విధ్వంసం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దాన్నుంచి ఈ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడన్నదే సినిమా. భారీ యాక్షన్ అడ్వెంచర్స్‌తో సినిమా నడుస్తుంది. ట్రైలర్ ఇప్పటికే అడ్వెంచర్ సినిమా అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది. డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు బ్రాడ్ పేటోన్ దర్శకత్వం వహించారు.ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. పిల్లలే టార్గెట్‌గా సమ్మర్లో ఈ సినిమామంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో మనకు సమ్మర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఏదో, ఏ సినిమా ఎంతెంత వసూళ్లు రాబడుతుందో ఎదురుచూడాలి. -
హాలీవుడ్ మాస్ బొమ్మ@2018
ఎక్కణ్నుంచో ఏదో వెంట పడుతున్నట్లు ఉంటుంది. అందరూ పరిగెడుతూ ఉంటారు. అడవి. ఎటుపోవాలో తెలీదు. తప్పించుకోవాలి. పోరాటాలు చేస్తూనే ఉంటారు. హీరోలు వాళ్లు. భయపెట్టే జంతువులు అవి. ఎన్నేళ్లుగా చూస్తున్నాం ఈ కథలు, ఆ జంతువులకు డైనోసర్ అన్న పేరు పెట్టుకొని. సగటు ఇండియన్ సినిమా అభిమానికి హాలీవుడ్ అంటే ఇదీ! విజిల్స్ వేయించే మాస్ బొమ్మ. అలాంటి ‘జురాసిక్ పార్క్’ వింతలు కావాలి మనకు. ‘స్పైడర్‌మేన్’ సాహసాలు కావాలి. ఎప్పుడు ఏ కారు గాల్లోకి ఎగురుతుందో తెలియని యాక్షన్ కావాలి. నోరెళ్లబెట్టి కూర్చునేలా చేసే బొమ్మ కావాలి. హాలీవుడ్లో ఎన్నెన్ని సినిమాలు వచ్చినా, ఇలాంటి పక్కా బాక్సాఫీస్‌నే టార్గెట్ చేసుకొని వచ్చే మాస్ బొమ్మలకు ఉండే క్రేజ్ వేరు. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు అన్ని హంగులతో కొన్ని మాస్ సినిమాలు వస్తున్నాయి. ఈ వారం ఆ సినిమాలేంటో చూసొద్దాం.. జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ ‘జురాసిక్ పార్క్’ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. డైనోసర్లు ఈసారి మరింత విజృంభించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమైపోతోంది. 2015లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’.. అభిమానుల్లో ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. ఇక ఇప్పుడొస్తున్న కొత్త సినిమా బాక్సాఫీస్ వద్ద డైనోసర్ మోత మోగిస్తుందన్న టాక్ అప్పుడే వినిపిస్తోంది. నిజంగా మాస్ ఆడియన్స్‌కు పండగ అంటే ఈ సినిమా అనే చెప్పుకోవాలి. జూన్ 22న జురాసిక్ వరల్డ్ విడుదల కానుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఈ ఏడాది అన్నింటికంటే ఎక్కువ హైప్ ఈ సినిమాకే ఉందని చెప్పాలి. అవెంజర్స్‌కి ఉన్న క్రేజ్ అనుకోవచ్చు, ట్రైలర్‌తో అదరగొట్టడం కావొచ్చు.. అవెంజర్స్ కోసం అభిమానులంతా పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ సినిమా అభిమానులకు ట్రీట్‌లా ఉంటుందట ఈ సినిమా. కమర్షియల్ సినిమా అభిమానులూ.. సమ్మర్లో.. ఏప్రిల్ 27న వస్తోందీ సినిమా!! మిషన్ ఇంపాజిబుల్ 6 యాక్షన్ సినిమా అభిమానుల ఫేవరెట్స్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ తప్పక ఉంటుంది. ఈసారి ఆ యాక్షన్ ఇంకెక్కువే ఉంటుందట. ఒక్కో సీక్వెల్‌కు స్టైల్‌ను, యాక్షన్‌ను పెంచుతూ పోతోన్న ఈ సిరీస్, ఈసారి కమర్షియల్ సినిమా అభిమానిని అలా కూర్చొబెట్టి కట్టిపడేస్తుందట. జూలై 27కు విడుదలవుతుంది ఈ సినిమా. స్పైడర్‌మేన్ ఇన్టు ది స్పైడర్ వర్స్ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కట్టిపడేసే సూపర్‌హీరో స్పైడర్‌మేన్ కూడా ఈ ఏడాది చివర్లో సందడి చేయడానికి వస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 14న విడుదల కానుందీ సినిమా. విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉండడంతో పక్కా కమర్షియల్, సూపర్‌హిట్ అవుట్‌పుట్‌నే బయటకు తీసుకొస్తున్నారట. బ్లాక్ప్యాంథర్ మార్వెల్ స్టూడియోస్ సృష్టించిన బ్లాక్ప్యాంథర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూపర్‌హీరో క్యారెక్టర్లో ఇదొక డిఫరెంట్ స్టైల్. 2016లో వచ్చిన ‘కెప్టెన్ అమెరికా : సివిల్ వార్’ (2016)లో బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్‌కు రెట్టింపు ఎనర్జీతో ఇప్పుడు కొత్తగా వస్తోన్న క్యారెక్టర్ ఉంటుందట. ఫిబ్రవరి 16న వస్తోన్న ఈ సినిమా విజువల్ ట్రీట్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ ఇస్తుందని హాలీవుడ్ టాక్. ఇవే కాకుండా ‘ఎక్స్–మెన్ డార్క్ ఫియొనిక్స్’, ‘అక్వామేన్’, ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్’, ‘ది ప్రిడేటర్’, ‘యాంట్‌మేన్’ లాంటి సూపర్ డూపర్ కమర్షియల్ సినిమాలు కూడా ఈ ఏడాదే సందడి చేయనున్నాయి. హాలీవుడ్ మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ ఏడాది కావాల్సినన్ని సినిమాలున్నాయి మరి, చూడడానికి!! -
జురాసిక్ వరల్డ్‌కు జూన్ సెంటిమెంట్
‘జురాసిక్ పార్క్’.. ఇండియన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను కూడా హాలీవుడ్‌కు విపరీతంగా అట్రాక్ట్ అయ్యేలా చేసిన సినిమా. 1993లో స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా తర్వాతే ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు మార్కెట్ పెరిగింది. ఈ సినిమాతోనే స్పీల్బర్గ్ ఇండియన్ సినీ అభిమానికి ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ఒకడుగా చేరిపోయాడు. అలాంటి సినిమా కాబట్టే ‘జురాసిక్ పార్క్’ విడుదలై 25 సంవత్సరాలు కావొస్తున్నా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఈ సినిమాకు సీక్వెల్‌గా నాలుగు సినిమాలొచ్చినా, ఐదో సినిమా వస్తోందంటే అభిమానుల ఉత్సాహం అదే స్థాయిలో ఉంది. జురాసిక్ పార్క్(1993), జురాసిక్ పార్క్: ది లాస్ట్ వరల్డ్ (1997), జురాసిక్ పార్క్ 3 (2001), జురాసిక్ వరల్డ్ (2015) లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్డమ్ (2018) వస్తోంది. జె.ఎ.బయోనా దర్శకుడు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్కంతా ఇచ్చేస్తోంది. భారీ డైనోసర్స్తో ఫుల్ ఆన్ అడ్వెంచర్స్‌తో సినిమా సాగిపోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పట్నుంచే జురాసిక్ వరల్డ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టేశారు. ‘జురాసిక్ పార్క్’ విడుదలైన 25 ఏళ్లకు ‘జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్డమ్’ విడుదలవుతోంది. అది కూడా జురాసిక్ పార్క్ విడుదలైన జూన్‌లోనే! దీంతో జురాసిక్ పార్క్ అభిమానులకు వచ్చే ఏడాది జూన్ డబుల్ పండగ కిందే లెక్క. -
బుజ్జి బల్లి.. భలే ముద్దుగా ఉంది!
రాకాసి బల్లి ముద్దొస్తుందా? రాదు కదా! చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, బుల్లి రాకాసి బల్లి అయితే ముద్దుగా ఉంటుంది. కావాలంటే ఇక్కడున్న ఫొటోని మీరే చూడండి. మరి.. పెద్దయ్యాక ఈ బుజ్జిది మనుషులను ఏ రేంజ్లో రఫ్ఫాడేస్తుందో కానీ, ఇప్పుడు మాత్రం అమాయకంగా కనిపిస్తోంది. ‘జురాసిక్ పార్క్’ సిరీస్‌లో ఐదో చిత్రం ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్డమ్’కి సంబంధించిన ఫొటో ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఆరు సెకన్ల టీజర్‌ను రచయితల్లో ఒకరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొలిన్ ట్రెవెర్రో విడుదల చేశారు. ‘‘ఫ్రమ్ అవర్ జురాసిక్ ఫ్యామిలీ టు యు’ అని పేర్కొన్నారాయన. క్రిస్ ప్రాట్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ చిత్రానికి జె. బయోనా దర్శకుడు. 6 సెకన్ల టీజర్ చూపించారు సరే.. ఫుల్ సినిమా ఎప్పుడు చూపిస్తారు? అంటే.. వచ్చే ఏడాది జూన్ 22న. అన్నట్లు... ఫస్ట్ పార్ట్ ‘జురాసిక్ పార్క్’ 1993లో వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. గ్రాఫిక్స్‌లో డైనోసార్లను సృష్టించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ వచ్చిన నాలుగు భాగాలకన్నా ఐదో భాగం టెక్నికల్‌గా ఇంకా హై లెవెల్లో ఉంటుందనీ, ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందని హాలీవుడ్ టాక్. -
భారీ రాక్షస బల్లులతో సీక్వెల్
బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన జురాసిక్ వరల్డ్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన కొలిన్ ట్రివోరో సీక్వెల్‌ను మరింత భారీగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన దర్శకుడు, సీక్వెల్‌తో జురాసిక్ వరల్డ్ ఇమేజ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. తొలి భాగానికి ఘనవిజయం అందించిన ఆడియన్స్, ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి మాకు పర్మిషన్ ఇచ్చినట్టుగానే భావిస్తున్నాం అన్నాడు దర్శకుడు కొలిన్. తొలి భాగంతో పొలిస్తే రెండో భాగంలో మరింత భారీ రాక్షస బల్లులను తెర మీద చూపించడానికి రెడీ అవుతున్నామని, అయితే ఇప్పటివరకు కథ రెడీ అవ్వలేదు కనుక మరింత వివరంగా చెప్పలేమని తెలిపాడు. వీలైనంత త్వరగా కథా కథనాలను సిద్ధం చేసి జురాసిక్ వరల్డ్ 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను 2018 జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఆ చిత్రం తొమ్మిది వేల కోట్లకు పైగానే..
లాస్ ఎంజెల్స్: ఇటీవల విడుదలై చిన్నా పెద్దలను అబ్బురపరిచిన ప్రముఖ హాలీవుడ్ చిత్రం జురాసిక్ వరల్డ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు రాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద మూడో చిత్రంగా నిలిచింది. జేమ్స్ కెమరాన్ రూపొందించిన అవతార్, టైటానిక్ చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన యూనివర్సల్ స్టూడియో ఒక్క ఏడాదిలో రెండు పెద్ద చిత్రాలు రూపొందించిన సంస్థగా కూడా రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో మొత్తం ఐదు చిత్రాలు రికార్డు వసూళ్లు సాధించగా అందులోని రెండు చిత్రాలు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7, జురాసిక్ వరల్డ్ ఈ సంస్థ నుంచి వచ్చినవే కావడం విశేషం. మరోపక్క, జపాన్‌లో ఈ చిత్రం ఆగస్టు 5 న విడుదల కానుంది. ఇదిలా ఉండగా, జురాసిక్ వరల్డ్ చిత్రానికి అత్యధిక వసూళ్లు అమెరికా, చైనా నుంచే వచ్చాయి. ఇంతకీ ఈ చిత్రం ఎన్నికోట్లు సాధించిందో తెలుసా.. అక్షరాల తొమ్మిది వేల కోట్లకు పైగానే. -
‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడికి స్టార్‌వార్స్ చాన్స్?
స్టార్ వార్స్ సిరీస్ అంటే ఫ్యాన్స్‌కు పండగే. ఈ సిరీస్‌లో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘ఫోర్స్ ఎవే కెన్స్’. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ 7 ప్రచార చిత్రం ఆక ట్టుకుంటోంది. మరోపక్క ఎపిసోడ్-8 కూడా సెట్స్‌పైనే ఉంది. అలా రెండు భాగాలు సెట్స్ మీద ఉండగానే, ఎపిసోడ్ 9కు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదలైన ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కాలిన్ ట్రెవరో ఆ ఎపి సోడ్‌కు న్యాయం చేకూరుస్తారని వారు భావిస్తున్నారు. ఆయనతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. -
నిరాశపరిచిన... నీరసపరిచిన...హాలీవుడ్ సీక్వెల్స్
2015 జూన్ 11... వరల్డ్ మొత్తం ‘జురాసిక్ వరల్డ్’ కోసం వెయిటింగ్. తీరా చూస్తే - సినిమా రిజల్ట్ జస్ట్ ఓకే! ఈ నెల 2న విడుదలైన ‘టెర్మినేటర్ జెనిసిస్’ సినిమా విషయంలోనూ ఇంతే. సేమ్ రిజల్ట్. ఈ రెండు సినిమాల స్పెషాల్టీ ఏంటంటే - రెండూ కూడా ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన సినిమా సిరీస్‌లకు సీక్వెల్సే. ‘‘22 ఏళ్ల క్రితం వచ్చిన ‘జురాసిక్ పార్క్’కు అసలు సీక్వెల్ ‘జురాసిక్ వరల్డ్’’అని ‘జురాసిక్ పార్క్’ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ప్రకటించారు. ఇక, జేమ్స్ కామెరూన్ కూడా తాను తెరకెక్కించిన ‘టెర్మినేటర్’ మూడు భాగాలకు ఈ ‘టెర్మినేటర్ జెనిసిస్’ కరెక్ట్ సీక్వెల్ అని పొగడ్తలు కురిపించారు. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. ఈ సీక్వెల్స్ మునుపటి స్థాయిలో ఎందుకు విజయం సాధించలేకపోయాయి? ఓ చిన్న విశ్లేషణ... జురాసిక్ వరల్డ్ ఈ చిత్రానికి కొలిన్ ట్రవెర్రో దర్శకుడైనా కూడా, మొత్తం ప్రచారంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్టీవెన్ స్పీల్బర్గ్ పేరే వినిపించింది. కామన్ ఆడియన్స్‌ని ఎవర్నడిగినా ‘ఇది స్పీల్బర్గ్ సినిమా’ అనే చెప్పుకున్నారు. నిజం చెప్పాలంటే ఇదే ప్రేక్షకులను థియేటర్లకు వెళ్లేలా చేసిందని చెప్పొచ్చు. ‘‘డైనోసార్లను కొత్తగా చూపించారే తప్ప... కథను కొత్తగా తెరకెక్కించలేదని చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకుండే ఎమోషనల్ కాంటాక్ట్ మిస్ అయింది. మొదటి రెండు భాగాల్లో ఉండే విభిన్నమైన కథ, పటిష్టమైన కథనం ఇందులో కొరవడింది. పైగా ముందు భాగాల తరహాలోనే ఒకటే కథ. పిల్లలు పార్క్‌లో తప్పిపోతారు. వారి కోసం ప్రధాన పాత్రధారుల అన్వేషణ . దీంతో పాత కథే చూసిన ఫీలింగ్ కలిగిందని చాలామంది అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా అద్భుతంగా ఉండి, పిల్లలను ఆకట్టుకున్నా, విమర్శకులను మాత్రం మెప్పించలేకపోయిందీ చిత్రం. టె ర్మినేటర్ జెనిసిస్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ‘ఐ విల్ బి బ్యాక్’ అని ప్రచారం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 2న విడుదల అయింది. అలన్ టేలర్ తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఒక యువతిని కాపాడే కథాంశంతో పాత చిత్రాల తరహాలోనే తెరకెక్కిన ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అదనపు బలం. దురదృష్టవశాత్తు బలహీనత కూడా. చాలా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో, గ్రాఫిక్స్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ కూడా కొంత ఉంటే బాగుండేదని చూసిన వాళ్ల ఫీలింగ్. ముఖ్యంగా ఆర్నాల్డ్ గురించి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఆయన పాత్ర తీరుతెన్నులు చూసి పెదవి విరుస్తున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - జూరాసిక్ వరల్డ్
-
డైనోసార్లు మనుషులను తినేస్తాయా?
వాషింగ్ఘన్: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన 'జురాసిక్ పార్క్-4' హాలివుడ్ చిత్రంపై పురాజీవ శాస్త్రవేత్తలు (నశించిపోయిన జంతువులపై ఆధ్యయనం చేసే శాస్త్రవేత్తలు) మండిపడుతున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాబోదని, జురాసిక్ కాలంనాటి డైనోసార్ల గురించి సినిమాలో చూపించిందంతా ఒట్టి బూటకమని విమర్శిస్తున్నారు. ఆకారంలో భారీగావున్నప్పటికీ సాధు జీవులైన డైనోసార్లను మనుషులను పీక్కుతినే రాక్షస జంతువులుగా చిత్రీకరించడం ఎంత మాత్రం సమంజసం కాదని, ఇది ప్రకృతి విరుద్ధంగా జంతుజాలాన్ని కాఠిన్యంగా చూపించడమే అవుతోందని వారు వాదిస్తున్నారు. సినిమాలో చూపించినంత పెద్దగా అవి ఉండవని, 40 అడుగులకు మించిన డైనోసార్ కళేబరం తమ పరిశోధనల్లో ఎక్కడా దొరకలేదని వారు చెబుతున్నారు. ఎప్పుడు చూడని మనిషిని చూస్తే అవి గుర్తించలేవని, కదలక, మెదలక నిలబడితే ఏ మనిషినైనా గుర్తించే మెదడు నైపుణ్యంగానీ దృష్టిగానీ వాటికి లేవని అన్నారు. డైనోసార్లలో శాకాహార, మాంసాహారులనే రెండు రకాలు ఉన్నప్పటికీ....మాంసాహారులు చిన్న చిన్న జంతువులను తింటాయే తప్ప, మనుషులను వెంటాడి తినే ప్రసక్తే లేదని అంటున్నారు. సహజంగా మెతక వైఖరిని ప్రదర్శించే శాకాహార డైనోసార్లకు తోకతోని మనుషులనే కాదు, తోటి జంతువులను వేటాడే లక్షణాలు కూడా ఉండవని, డైనోసార్లలో కొన్ని రకాల డైనోసార్లకు రెక్కలు ఉన్నట్టు తమ పరిశోధనల్లో తేలినప్పటికీ వాటికి ఎగిరే శక్తినిచ్చే రెక్కలు మాత్రం లేవని వారు చెబుతున్నారు. ఏ రకం డైనోసార్కైనా తలుపులను తెరిచే జ్ఞానం మాత్రం ఉండదని, పైగా సినిమాలో చూపించినట్టుగా వాటి చర్మం గట్టిగా గరకుతేలినట్టు ఉండదని, మెత్తగా ఉంటుందని వారంటున్నారు. సినిమాలో వాస్తవ లక్షణాలకు విరుద్దంగా డైనోసార్లను చూపించడం ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోప పట్టించడమే అవుతుందని ఇప్పటివరకు 20 డైనోసార్ల కళేబరాలను కనుగొన్న పురాజీవ శాస్త్రవేత్త జేమ్స్ కిర్క్లాండ్ (సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం), టెక్సాస్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జూలియా క్లేర్క్, రేమండ్ అల్ఫ్ మ్యూజియం ఆప్ పాలియోంటోలజిలో పనిచేస్తున్న నిపుణుడు, శాస్త్రవేత్త ఆండ్రివ్ ఫార్కే ఆరోపిస్తున్నారు. సినిమాల ద్వారా ఔత్సాహిక పరిశోధకుల్లో, విద్యార్థుల్లో డైనోసార్ల అధ్యయనం పట్ల ఆసక్తి కలిగిస్తున్నందుకు థాంక్స్ అని వారు చెప్పడం కొసమెరపు. వీరి వాదనలతో జురాసిక్ పార్క్ చిత్ర నిర్మాణం వెనుక నిలిచిన శాస్త్రవేత్త జాక్ హార్నర్ విభేదిస్తున్నారు. ఇవన్ని వారి అభిప్రాయాలేగాని, వాస్తవాలు కాదని, స్పీల్బర్గ్ దర్వకత్వంలో వెలువడిన తొలి జురాసిక్ పార్క్ సినిమా నుంచి వారు ఇలాంటి విమర్శలే చేస్తున్నారంటూ ఆయన ఎదురు దాడికి దిగారు. అయినా తాము తీసింది సైన్స్ ఫిక్షన్గానీ డాక్యుమెంటరీ కాదని చెప్పారు. పైగా డీఎన్ఏ ఆధారంగా డైనోసార్లను అభివృద్ధి చేసినట్టు చూపాం కనుక గతించిన డైనోసార్లకు, పునర్ సృష్టించిన డైనోసార్లకు ఎంతైనా తేడా ఉండవచ్చని ఆయన లాజిక్ తీశారు. -
అమెరికా టు అనకాపల్లి
తెల్ల తోలు కండలవీరుడు, ఎర్ర తోలు గుమ్మడు... తెలుగులో డైలాగులు సరసర కొడుతున్నారు... మన హీరోలు విలన్ని కొట్టుడుకంటే టెన్ టైమ్స్ ఎక్కువ కొడుతున్నారు... ఈ కొట్టుడుకి మన నిర్మాతల వీపు బద్దలవుతుందా? డబ్బు అంతా డబ్బింగ్ సినిమా దోచేస్తే మన సినిమాకు టికెట్టు తెగేనా? ఇలా అయితే మన సినిమాకు థియేటర్ దొరికేనా? ఓ మై గాడ్! ఇంగ్లీష్ ప్రాబ్లమ్... దిగుమతి ఫ్రమ్ అమెరికా టు అనకాపల్లి. జురాసిక్ వరల్డ్ ఇరవై రెండేళ్ళ క్రితం 1993లో వచ్చి, ప్రపంచమంతటినీ సమ్మోహితుల్ని చేసిన స్టీవెన్ స్పీల్బెర్గ్ ‘జురాసిక్ పార్క్’ సిరీస్‌లో ఇది 4వ సినిమా. ఈ యాక్షన్, ఎడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ వరల్డ్’ అనే డైనోసార్ థీమ్‌పార్క్‌లో నడుస్తుంది. సందర్శకుల్ని ఆకర్షించడానికి అందులో శాస్త్రవేత్తలు సృష్టించిన హైబ్రిడ్ డైనోసార్ తప్పించుకొని బయటకొస్తుంది. అప్పుడేం జరిగిందన్నదే ఆసక్తిగా సాగే ఈ చిత్రం. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ కూడా ఇందులో నటించడం విశేషం. తారాగణం: క్రిస్ ప్రాట్, బ్రిస్ డల్లాస్ హోవర్డ్, ఇర్ఫాన్‌ఖాన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకుడు: కోలిన్ ట్రెవొరో, రిలీజ్: జూన్ 11 టెర్మినేటర్: జెనిసిస్ పాపులర్ ‘టెర్మినేటర్’ సిరీస్‌లో 4వది. మునుపటి చిత్రాల్లో చూపించినవాటికి మించిన దృశ్యాలు ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంటాయట. ఈ నాలుగో భాగానికి మరిన్ని సీక్వెల్స్ వచ్చేలా, కండల వీరుడు ఆర్నాల్డ్‌ను మళ్ళీ మళ్ళీ చూసేలా కథను అల్లుకున్నారట. తారాగణం: ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, జేసన్ క్లార్క్, ఎమిలియా క్లార్క్ దర్శకత్వం: ఎలెన్ టేలర్, రిలీజ్: జూలై 1 మిషనింపాజిబుల్: రోగ్ నేషన్ మూడేళ్ళ క్రితం వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపించిన ‘మిషన్ ఇంపాజిబుల్ - ఘోస్ట్ప్రోటోకాల్’ తరువాత ‘ఎం.ఐ’ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం. కోవర్టు గూఢచర్యం ప్రధానాంశంగా ఈ సినిమా నడుస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు అనేకం. తారాగణం: టామ్ క్రూయిజ్, జెరెమీ రెనెర్, సైమన్ పెగ్ దర్శకత్వం: క్రిస్టఫర్ మెక్‌క్వారీ రిలీజ్: జూలై 31 ఫెంటాస్టిక్ ఫోర్ కాస్మిక్ కిరణాల తాకిడికి గురైన కొంతమంది వ్యక్తులకు ఊహించని అతీతశక్తులు వస్తాయి. మిస్టర్ ఫెంటాస్టిక్, హ్యూమన్ టార్చ్, ఇన్విజిబుల్ ఉమన్, ది థింగ్ - ఈ నలుగురి మధ్య కథ నడుస్తుంది. 1960ల నాటి క్లాసిక్ కామిక్ బుక్స్ ఆధారంగా వస్తున్న సిరీస్‌లో తాజా సినిమా ఇది. తారాగణం: మైల్స్ టెల్లర్, మైకేల్ బి. జోర్డాన్, కేట్ మారా, టోబీ కెబెల్ దర్శకుడు: జోష్ ట్రాంక్ రిలీజ్: ఆగస్టు 7 హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్... పక్క స్క్రీన్‌లోని కొత్త తెలుగు సినిమా కన్నా ఈ స్క్రీన్‌లో జనం కిటకిటలాడుతున్నారు. ఆ స్క్రీన్‌లో ఉన్నది హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్! ‘‘సినిమా బాగుందట! మన సినిమాల్లో కన్నా యాక్షన్, గ్రాఫిక్స్ అదిరాయట. పైగా డైలాగులూ తెలుగులోనే కదా అని వచ్చాం’’ అన్నాడు ప్రైవేట్‌గా సి.ఏ. చదువుతున్న ఆనంద్. ఇంగ్లీష్ సినిమాల తెలుగు డబ్బింగ్‌లకు పెరుగుతున్న క్రేజ్‌కు ఇది ఎగ్జాంపుల్. ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ దేశంలో వంద కోట్లు కలెక్ట్ చేయగలిగిందంటే ఆనంద్ లాంటి లక్షలాది ఆడియన్స్ వల్లే! పోస్టర్ డబ్బింగ్ నుంచి సినిమా డబ్బింగ్ దాకా... అది 1970ల నాటి సంగతి... థియేటర్ బయట బ్లాక్ అండ్ వైట్‌లో ‘మృత్యువీరుడు’, ‘రాకాసి తిమింగలం’ లాంటి వాల్‌పోస్టర్స్! పోస్టర్స్ మాత్రమే తెలుగు... లోపల సినిమా ఇంగ్లీషే! కట్ చేస్తే... 1990ల నాటికి... ట్రెండ్ మారింది. వాల్‌పోస్టర్‌లో టైటిల్‌తో ఆగకుండా, ఇంగ్లీష్ సినిమా మొత్తాన్నీ తెలుగులోకి డబ్ చేసి, రిలీజ్ చేయడం మొదలైంది. అలా తొలిరోజుల్లో వచ్చిన ‘జురాసిక్ పార్క్, అనకొండ’ లాంటివి ఈ ఇంగ్లీష్ డబ్బింగ్‌కు మార్కెట్ పెంచాయి. ‘‘ఆ మధ్య హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘స్పైడర్‌మ్యాన్3’ ఏకంగా 175 రోజులాడింది. ఈ ఇరవై ఏళ్ళలో హాలీవుడ్ డబ్బింగ్ మార్కెట్ బాగా పెరిగింది’’ అని ఆ చిత్రాల్ని తెలుగులో అందించిన ‘శ్రీలక్ష్మీ గణపతి ఫిలిమ్స్’ అధినేత బి. సుబ్రహ్మణ్యం వివరించారు. అందుకే, ఇండియాలోని తెలుగు, తమిళ, హిందీ ప్రాంతీయ భాషా మార్కెట్‌పై హాలీవుడ్ స్టూడియోల దృష్టీ పెరిగింది. సినిమా టు టీవీ! టీవీ టు సినిమా! ఇవాళ టీవీ చానల్స్‌కు కూడా ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ పెద్ద సాఫ్ట్వేర్. థియేటర్లలో పెద్దగా ఆడని అనేక ఇంగ్లీష్ సినిమాలను కూడా టీవీ కోసం రైట్స్ తీసుకొని, డబ్బింగ్ చేయడం పెరిగింది. టీవీల్లో ఈ డబ్బింగ్‌లు చూసి చూసి, జనం పొటెన్షియల్ ప్రేక్షకుడిగా మారుతున్నాడు. ఈ చైన్ రియాక్షన్ ఇటు హాలులో, అటు టీవీలో ఈ డబ్బింగ్‌లకు ప్రత్యేకంగా ఆడియన్స్‌ను సృష్టిస్తోంది. తెలుగు సినిమాను మించి...! ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే, పేరుకు ఇవి ఇంగ్లీష్ సినిమాలే కానీ, తెలుగు నేలపై సగటున పాతిక స్క్రీన్స్‌లోనే ఇంగ్లీష్ వెర్షన్ రిలీజవుతుంది. తెలుగు డబ్బింగ్ మటుకు కనీసం 60 మొదలు 200 పైగా స్క్రీన్స్‌లో ఆకర్షిస్తోంది. అంటే, సగటు తెలుగు సినిమాల కన్నా భారీస్థాయిలో ఈ డబ్బింగ్‌లు రిలీజవుతున్నాయన్న మాట! ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ తెలుగు నాట 250 పైగా స్క్రీన్స్‌లో రిలీజైంది. ఇంగ్లీషు, తెలుగు, తమిళ, హిందీల్లో కలిపి రూ. 100 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లొచ్చిన హాలీవుడ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ‘జురాసిక్ వరల్డ్’కు ఇప్పుడు అదే గైడైంది. ఈ సమ్మర్లో ఇవే హాట్ గురూ! ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎడ్వాంటేజ్‌ను తెలుగు సినిమాలు సొమ్ము చేసుకోలేకపోయాయి. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాకపోవడంతో ఈ ఇంగ్లీష్ డబ్బింగ్లే సమ్మర్ హీరోలయ్యాయి. సగటు తెలుగు సినిమాల బాక్సాఫీస్ లైఫ్ ఇప్పుడు మూడు రోజుల నుంచి మూడు వారాలే అయింది. ఆ పరిస్థితుల్లో, ‘ఎవెంజర్స్’ లాంటివి దిక్కయ్యాయి. తెలుగునాట ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ రూ. 4.5 కోట్ల పైగా, ‘ఎవెంజర్స్’ రూ. 3.5 కోట్ల పైగా, ‘మ్యాడ్‌మ్యాక్- ఫ్యూరీ రోడ్’, ‘శాన్ ఆండ్రియాస్’లు ఒక్కొక్కటి రూ. 1.25 కోట్ల పైగా కలెక్ట్ చేసినట్లు భోగట్టా. రానున్న కొద్ది నెలల్లో చాలానే ఇంగ్లీష్ డబ్బింగ్‌లు క్యూలో ఉన్నాయి. ‘‘తెలుగు సినిమానా, డబ్బింగ్ సినిమానా అని కాదు. బాగుంటే, ఏ సినిమా అయినా జనం చూస్తారు. లేదంటే చూడ’’రని ‘జురాసిక్ వరల్డ్’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ముఖేశ్ మెహతా అన్నారు. బయ్యర్లలోనూ క్రేజే! పైగా, ఒక సగటు పెద్ద తెలుగు సినిమాను ఒక ప్రధాన ఏరియాకు కొనుక్కోవాలంటే, రూ. 10 - 12 కోట్ల దాకా వెచ్చించాలి. కానీ, ఆ మొత్తానికి ఒక మంచి హాలీవుడ్ సినిమా ఆల్ ఓవర్ ఇండియా హక్కులు వచ్చేస్తాయి. కేవలం కొద్ది లక్షల ఖర్చుతోనే అన్ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ డబ్బింగ్ గనక ఆడితే, తక్కువ పెట్టుబడి... ఎక్కువ ఆదాయం. ఇవాళ, అందుకే బయ్యర్లలోనూ హాలీవుడ్ డబ్బింగ్లంటే క్రేజ్! ఈ పరిస్థితుల్లో హాలీవుడ్ సంస్థలు హైదరాబాద్‌లోనూ ఆఫీసులు తెరుస్తున్నాయి. భారీగా పబ్లిసిటీ చేస్తున్నాయి. మరి, ఈ తాకిడిని తట్టుకోవడానికి మన సినిమాలు ఏం చేస్తున్నట్లు? ‘పీకూ’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ లాంటి ఆసక్తికరమైన కథలు, కథనాలతో బాలీవుడ్ ఈ ఇంగ్లీష్ డబ్బింగ్‌ల దాడిని తట్టుకొంటోంది. కానీ, ముంచుకొస్తున్న ఈ ‘ఇంగ్లీషు’ ప్రళయానికి దీటుగా మన తెలుగు సినిమాలు నిలవకపోతే కష్టమే! 2020 నాటికి... ఊళ్ళో తెలుగు చిత్రాల కన్నా ఇంగ్లీష్ డబ్బింగ్లే ఎక్కువ కనిపించే ప్రమాదముంది. మన మహేశ్, ప్రభాస్‌ల సినిమాలకు హాళ్ళు కరవైనా ఆశ్చర్యం లేదు. మరి, దర్శక, రచయితలు తమ క్రియేటివిటీతో ఈ ప్రమాదాన్ని తప్పిస్తారా? అపర ‘ఎవెంజర్స్’ అవతారమెత్తుతారా? - రెంటాల జయదేవ ఊళ్ళకీ పాకిన... హాలీవుడ్ సినిమా ఇవాళ ఊరూరా మల్టీప్లెక్సులొచ్చాయి. ప్రింట్ల ఖర్చు పోయి, డిజిటల్ ప్రొజెక్షన్ వచ్చింది. ఏకకాలంలో వందల హాళ్లలో సినిమాలు రిలీజవుతున్నాయి. అమెరికాలో రిలీజైన రోజే ఇక్కడ అనకాపల్లిలోనూ అదే సినిమా వచ్చేస్తోంది. అదీ అందరికీ అర్థమయ్యే మన తెలుగులో చేరుతోంది. జిల్లా ప్రధాన కేంద్రాల్లో కనీసం రెండు వారాలు థియేటర్ల ఫీడింగ్‌కు ఈ సినిమాలు పనికొస్తున్నాయి. ‘‘తెలుగులో 3డి సినిమాలు తక్కువ కాబట్టి, డబ్బింగైనా ఈ 3డి సినిమాను అర్థమయ్యే తెలుగు డైలాగులతో చూడచ్చని జిల్లా కేంద్రాల్లోనూ జనం వస్తున్నారు’’ అని ‘శాన్ ఆండ్రియాస్’ అందించిన కె.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ జి. కమలాకరరెడ్డి చెప్పారు. -
మరింత థ్రిల్‌గా...!
1993లో ైడె నోసార్ విధ్వంసంతో మూసుకుపోయిన జురాసిక్ పార్క్ గే ట్లు మళ్లీ 2015 జూన్ 11న తెరుచుకుంటున్నాయి. అదేంటి అనుకుంటున్నారా? 1993లో స్టీవెన్ స్పీల్బర్గ్ తెరకెక్కించిన ‘జురాసిక్ పార్క్’ ఒక ప్రభంజనం. 22 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా రానున్న చిత్రం ‘జురాసిక్ వరల్డ్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేసే హక్కులను ముఖేశ్ మెహతా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘భారతదేశంలో మొత్తం 2500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. క చ్చితంగా 100 కోట్ల మార్కుని సాధిస్తుంది. ‘జురాసిక్ పార్క్’ అప్పట్లో ఓ సంచలనం. ఈ సీక్వెల్ కూడా మరింత థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. -
'గుండె జారి గల్లంతవ్వాల్సిందే.!'
లాంస్ ఎంజిల్స్: వికృత రూపంలో ఉండే ఓ భయంకరమైన భారీ ఆకారాన్ని ఊహించుకోండని చెప్తేనే అస్సలు ఇష్టపడం.. కష్టం కూడా.. అలాంటిది నిజంగానే అలాంటి జంతువు వుండి.. దాని ఎదురుగా నిల్చోవలసి వస్తే.. అది కూడా దాని శ్వాస నిట్టూర్పులు తగిలేంత దగ్గరిగా.. రెండు చేతులు పట్టినా సరిపోనంత పెద్ద కోరలతో ఆ జంతువుంటే.. అమ్మో ఒళ్లు జలదరించి పోతుందికదా.. ఇదే కాదు ఇలాంటి ఎన్నో అనుభవాలు అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. మీకే కాదు ఆ సమయంలో మీతో పాటు కూర్చున్న అందరికీ కూడా. ఇంతకీ ఏంటనీ అనుకుంటున్నారా.. జురాసిక్ చిత్రాలు మీరు చూసే ఉంటారుగా.. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆ చిత్రాలకు సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. గతంలో వచ్చిన చిత్రాలకంటే మరింత గొప్పగా తీర్చి దిద్ది 'జురాసిక్ వరల్డ్' అనే పేరుతో దర్శకుడు కోలిన్ ట్రెవర్రో గాడ్జిల్లాలతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనున్న ఈ చిత్రానికి చెందిన కొన్ని పోస్టర్లు ఆయన ఆన్లైన్లో విడుదల చేశారు. ఆ పోస్టర్లలో ఈ చిత్రంలోని హీరోయిన్ బ్రైస్ డల్లాస్ హోవార్డ్ ఓ అద్దాల భవంతిలో నిల్చుని ఉండగా.. అద్దం వెలుపల సరిగ్గా ముఖానికి దగ్గర ఓ పెద్ద గాడ్జిల్లా ఆమె కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ కనిపిస్తుంది. ఇలాంటి పోస్టర్లు ఇంకెన్నో ఇప్పుడు ఆన్లైన్లో సందడి చేస్తున్నాయి. -
ప్రేక్షకుల ముందుకు జురాసిక్ పార్క్ 4వ సీక్వెల్