
హాలీవుడ్ చిత్రాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ తాజా ఉదాహరణ. ఇప్పుడు అందరి కళ్లూ సెన్సేషనల్ మూవీ ‘జురాసిక్ పార్క్’ సిరీస్ ‘జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్‌డమ్’ మీద ఉంది.
జె.ఏ. బయోనా దర్శకత్వం వహించారు. క్రిస్ ప్రాట్, హోవర్డ్, లెడ్ లెనిన్, రఫీ స్పాల్ జోన్స్, స్మిత్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను చైనా, అమెరికాలో కంటే ముందు ఇండియాలోనే రిలీజ్ చేయనున్నారు. జూన్ 15న చైనాలో, జూన్ 22న అమెరికాలో విడుదల కానున్న ఈ హాలీవుడ్ సినిమా ఇండియాలో జూన్ 8న రిలీజ్ కానుంది.