
రాకాసి బల్లి ముద్దొస్తుందా? రాదు కదా! చూడగానే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, బుల్లి రాకాసి బల్లి అయితే ముద్దుగా ఉంటుంది. కావాలంటే ఇక్కడున్న ఫొటోని మీరే చూడండి. మరి.. పెద్దయ్యాక ఈ బుజ్జిది మనుషులను ఏ రేంజ్‌లో రఫ్ఫాడేస్తుందో కానీ, ఇప్పుడు మాత్రం అమాయకంగా కనిపిస్తోంది. ‘జురాసిక్ పార్క్’ సిరీస్‌లో ఐదో చిత్రం ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’కి సంబంధించిన ఫొటో ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఆరు సెకన్ల టీజర్‌ను రచయితల్లో ఒకరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొలిన్ ట్రెవెర్రో విడుదల చేశారు.
‘‘ఫ్రమ్ అవర్ జురాసిక్ ఫ్యామిలీ టు యు’ అని పేర్కొన్నారాయన. క్రిస్ ప్రాట్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ చిత్రానికి జె. బయోనా దర్శకుడు. 6 సెకన్ల టీజర్ చూపించారు సరే.. ఫుల్ సినిమా ఎప్పుడు చూపిస్తారు? అంటే.. వచ్చే ఏడాది జూన్ 22న. అన్నట్లు... ఫస్ట్ పార్ట్ ‘జురాసిక్ పార్క్’ 1993లో వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. గ్రాఫిక్స్‌లో డైనోసార్లను సృష్టించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ వచ్చిన నాలుగు భాగాలకన్నా ఐదో భాగం టెక్నికల్‌గా ఇంకా హై లెవెల్‌లో ఉంటుందనీ, ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుందని హాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment