‘జురాసిక్ పార్క్’.. ఇండియన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను కూడా హాలీవుడ్‌కు విపరీతంగా అట్రాక్ట్ అయ్యేలా చేసిన సినిమా. 1993లో స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా తర్వాతే ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు మార్కెట్ పెరిగింది. ఈ సినిమాతోనే స్పీల్‌బర్గ్ ఇండియన్ సినీ అభిమానికి ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ఒకడుగా చేరిపోయాడు. అలాంటి సినిమా కాబట్టే ‘జురాసిక్ పార్క్’ విడుదలై 25 సంవత్సరాలు కావొస్తున్నా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఈ సినిమాకు సీక్వెల్‌గా నాలుగు సినిమాలొచ్చినా, ఐదో సినిమా వస్తోందంటే అభిమానుల ఉత్సాహం అదే స్థాయిలో ఉంది.
జురాసిక్ పార్క్(1993), జురాసిక్ పార్క్: ది లాస్ట్ వరల్డ్ (1997), జురాసిక్ పార్క్ 3 (2001), జురాసిక్ వరల్డ్ (2015) లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్‌డమ్ (2018) వస్తోంది. జె.ఎ.బయోనా దర్శకుడు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్కంతా ఇచ్చేస్తోంది. భారీ డైనోసర్స్‌తో ఫుల్ ఆన్ అడ్వెంచర్స్‌తో సినిమా సాగిపోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పట్నుంచే జురాసిక్ వరల్డ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టేశారు. ‘జురాసిక్ పార్క్’ విడుదలైన 25 ఏళ్లకు ‘జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్‌డమ్’ విడుదలవుతోంది. అది కూడా జురాసిక్ పార్క్ విడుదలైన జూన్‌లోనే! దీంతో జురాసిక్ పార్క్ అభిమానులకు వచ్చే ఏడాది జూన్ డబుల్ పండగ కిందే లెక్క.
Comments
Please login to add a commentAdd a comment