Spielberg
-
Austrian Grand Prix: లెక్లెర్క్ ఖాతాలో మూడో విజయం
ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మూడో విజయం నమోదు చేశాడు. స్పీల్బర్గ్లో ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత 71 ల్యాప్‌లను లెక్లెర్క్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 24.312 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
ఆస్కార్ హంగామా మొదలైంది
‘ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సినిమా’ అన్నది ఒక సినిమాకు తిరుగులేని బ్రాండ్. ఆ బ్రాండ్‌ను దక్కించుకునేందుకు ఏటా అదిరిపోయే సినిమాలు పోటీ పడుతుంటాయి. జనవరిలో నామినేషన్స్ అనౌన్స్ అయిన రోజు నుంచే ఏ సినిమాకు ఆస్కార్ వస్తుందన్న చర్చ మొదలైపోతుంది. ఇక ఈ ఏడాదికి అయితే ఇంకా నామినేషన్స్ రాకముందే ఆస్కార్ సందడి కనిపిస్తోంది. 2017 సంవత్సరానికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 4, 2018న జరగనుంది. 2017లో చాలానే బెస్ట్ అనిపించుకునే సినిమాలు రావడంతో ఇప్పట్నుంచే అసలు నామినేషన్స్‌కి ఏ సినిమాలు ఎంపికవుతాయి? అందులో నిలిచి, గెలిచే సినిమా ఏది? అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘డన్కిర్క్’, స్పీల్బర్గ్ తీసిన ‘ది పోస్ట్’, ‘షేప్ ఆఫ్ వాటర్’, ‘వండర్ వుమన్’, ‘లేడీ బర్డ్’, ‘కాల్ మి బై యువర్ నేమ్’ తదితర సినిమాల పేర్లు రేసులో ఉంటాయని ఎక్కువమంది అంచనా! మరి ఇందులో ఎన్నింటికి నామినేషన్స్ దక్కుతాయన్నది జనవరి 23 వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇక అస్కార్‌ను ఏ సినిమా తన్నుకుపోతున్నది తెలియాలంటే మాత్రం మార్చి 4 వరకూ వెయిట్ చేయాల్సిందే!! -
జురాసిక్ వరల్డ్‌కు జూన్ సెంటిమెంట్
‘జురాసిక్ పార్క్’.. ఇండియన్ సినిమా మాస్ ఆడియన్స్‌ను కూడా హాలీవుడ్‌కు విపరీతంగా అట్రాక్ట్ అయ్యేలా చేసిన సినిమా. 1993లో స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమా తర్వాతే ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు మార్కెట్ పెరిగింది. ఈ సినిమాతోనే స్పీల్బర్గ్ ఇండియన్ సినీ అభిమానికి ఫేవరెట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ఒకడుగా చేరిపోయాడు. అలాంటి సినిమా కాబట్టే ‘జురాసిక్ పార్క్’ విడుదలై 25 సంవత్సరాలు కావొస్తున్నా ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి ఈ సినిమాకు సీక్వెల్‌గా నాలుగు సినిమాలొచ్చినా, ఐదో సినిమా వస్తోందంటే అభిమానుల ఉత్సాహం అదే స్థాయిలో ఉంది. జురాసిక్ పార్క్(1993), జురాసిక్ పార్క్: ది లాస్ట్ వరల్డ్ (1997), జురాసిక్ పార్క్ 3 (2001), జురాసిక్ వరల్డ్ (2015) లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్డమ్ (2018) వస్తోంది. జె.ఎ.బయోనా దర్శకుడు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అభిమానులకు ఇవ్వాల్సిన కిక్కంతా ఇచ్చేస్తోంది. భారీ డైనోసర్స్తో ఫుల్ ఆన్ అడ్వెంచర్స్‌తో సినిమా సాగిపోతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇక ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఇప్పట్నుంచే జురాసిక్ వరల్డ్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టేశారు. ‘జురాసిక్ పార్క్’ విడుదలైన 25 ఏళ్లకు ‘జురాసిక్ వరల్డ్ : ది ఫాలెన్ కింగ్డమ్’ విడుదలవుతోంది. అది కూడా జురాసిక్ పార్క్ విడుదలైన జూన్‌లోనే! దీంతో జురాసిక్ పార్క్ అభిమానులకు వచ్చే ఏడాది జూన్ డబుల్ పండగ కిందే లెక్క. -
స్పీల్‌బర్గ్‌కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు
భారతీయ నటులందరికి హాలీవుడ్ సినిమాలో నటించటం ఓ కల. ముఖ్యంగా స్పీల్ బర్గ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఇండియన్ టాప్ స్టార్స్ కూడా కాదనరు. అలాంటిది ఓ భారతీయ నటుడు మాత్రం కాదనేశాడు. స్టీఫెన్ స్పీల్ బర్గ్ స్వయంగా తన సినిమాలో నటించాలంటూ కోరినా.. సున్నితంగా తిరస్కరించాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇప్పటికే హాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఇర్ఫాన్ తన పాత్రకు పెద్దగా గుర్తింపు లేని కారణంగానే ఆ పాత్రను తిరస్కరించానని ప్రకటించాడు. అంతేకాదు ప్రస్తుతం 'భారతీయ నటులకు పాశ్చాత్య దేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడు మంచి కళాకారుల కోసం వెతుకుతూనే ఉంటుంది. అందుకే మంచి కథలతో భారతీయ నటులవైపు చూస్తున్నారు హాలీవుడ్ దర్శకనిర్మాతలు' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. -
వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్
జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జాన్‌వూ, క్వెంటిన్ టెరెంటినో... ఈ నలుగురూ ప్రపంచ సినిమాకి నాలుగు దిక్కులు. ఒకరు వెస్ట్ అయితే, ఇంకొకరు ఈస్ట్. ఒకాయన సౌత్ అయితే, మరొకరు నార్త్. నలుగురివీ నాలుగు మార్గాలు. ఎవరు ఏ మార్గంలో నడిచినా ప్రపంచం మొత్తం వీరి సినిమాలంటే పడి చచ్చిపోతుంది. అసలు ఈ నలుగురు జగదేక దర్శకులు ఇప్పుడేం చేస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు?... జస్ట్ లుక్. 1. జేమ్స్ కామెరూన్ అవతార్! ‘టెర్మినేటర్’లో రోబోల విధ్వంసం ఎలా ఉంటుందో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించాడు. ‘టైటానిక్’తో ప్రేక్ష కుల గుండెలు కరిగేలా చేశాడు. ‘అవతార్’ సినిమాతో అత్యున్నత సాంకేతిక అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించి, ‘అరె ఇలా కూడా సినిమా తీయొచ్చా’ అని వెండితెరకు సరికొత్త గమనాన్ని నిర్దేశించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన లేట్‌గా తీసినా లేటెస్ట్గా తీస్తాడని ప్రతీతి. ‘అవతార్’ తర్వాత ‘టైటానిక్-త్రీడీ’ వెర్షన్ కార్యకలాపాల్లో కొన్నాళ్లు నిమగ్నమైన కామెరూన్ ఇప్పుడేం చేస్తున్నట్టు? ప్రస్తుతం ఆయన ‘అవతార్’ సీక్వెల్స్ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. ‘అవతార్-2’, ‘అవతార్-3’ ఇలా వరుసగా సినిమాలు తీస్తానని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ‘అవతార్-2’ను సిద్ధం చేస్తున్నారు. ఆ ‘అవతార్ ’ను మించిన కథాకథనాలు, గ్రాఫిక్స్ ఈ సీక్వెల్లో ఉంటాయట. అండర్‌వాటర్ సీక్వెన్సెస్ ‘అవతార్-2’లో ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని కామెరూన్ పేర్కొన్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ రెండో ‘అవతార్’ని 2017 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. 2. స్పైస్ స్పీల్బర్గ్ ‘జాస్’, ఈటీ (ఎక్స్ట్రా టెరస్ట్రియల్), ‘జురాసిక్ పార్క్’, ‘ద లాస్ట్ వరల్డ్’... ఈ సినిమాల పేర్లు వింటే టక్కున గుర్తుకువచ్చే దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఈ దిగ్దర్శకుని చిత్రాల కోసం ఎన్నేళ్లయినా ఎదురుచూసే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్టీవెన్‌తో కలిసి పనిచేయాలని ఇప్పటికీ ఉవ్విళ్లూరుతుంటాయి. ఇటీవల వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ చిత్రానికి స్టీవెన్ స్పీల్బర్గ్ కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు కొలిన్ ట్రావె ర్రో దర్శకత్వం వహించారు. కానీ టైటిల్ కార్డ్ మీద స్టీవెన్ స్పీల్బర్గ్ అనే పేరు మంత్రంలా పనిచేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది. మరి... స్పీల్బర్గ్ ఇప్పుడేం చేస్తున్నారు...? ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు....? నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటూనే, ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’. టామ్ హ్యాంక్స్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. 2016 అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈలోగా మరో చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నారాయన.. అదే ‘రెడీ ప్లేయర్ వన్’. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎర్నస్ట్ క్లయిన్ రాసిన ‘రెడీ ప్లేయర్ వన్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నవలను అదే పేరుతో తెరకెక్కించనున్నారు స్పీల్బర్గ్. ఈ చిత్రం 2017 డిసెంబర్ 15న తెర మీదకు రానుంది. 3. థ్రిల్లింగ్ మ్యాన్ జాన్ వూ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్‌గా ప్రపంచ సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు జాన్ వూ. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం జాన్ వూ ప్రత్యేకత. ‘ఫేస్ ఆఫ్’, ‘మిషన్ ఇంపాజిబుల్-2’, బ్రోకెన్ యారో, పే చెక్... ఈ చిత్రాలన్నీ ఆయన ప్రతిభకు తార్కాణాలు. 2008లో విడుదలైన ‘రెడ్ క్లిఫ్’, దానికి సీక్వెల్‌గా విడుదలైన ‘రెడ్‌క్లిఫ్-2’, 1949 అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన ‘క్రాసింగ్’, దీనికి సీక్వెల్ అయిన ‘క్రాసింగ్-2’... ఇవన్నీ జాన్ వూ స్థాయిని పెంచాయి. 69 ఏళ్ల జాన్ వూ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? 1976లో విడుదలైన జపనీస్ థ్రిల్లర్ ‘మ్యాన్ హంట్’ చిత్రాన్ని రీమేక్ చే సే సన్నాహాల్లో ఉన్నారు. 4. క్వెంటిన్ టెరెంటినో న్యూ డెఫినిషన్ వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ క్వెంటిన్ టొరెంటినో. ఎంత పాత కథలనైనా ఇంత కొత్తగా కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయే స్థాయిలో స్క్రీన్‌ప్లేను కొత్త పుంతలు తొక్కించారీ దర్శకుడు. అయితే, ఆయన చిత్రాల్లో మితిమీరిన హింస, పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శకుల వాదన. అయినప్పటికీ తన శైలిని మార్చుకోలేదు. ఎందుకంటే, ప్రేక్షకులు ఇష్టపడినవి ఇవ్వడమే తన ధ్యేయమని అంటారు క్వెంటిన్. తన సక్సెస్ సీక్రెట్ అదే అంటారాయన. క్వెంటిన్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో విజయాల శాతమే ఎక్కువ. ముఖ్యంగా ‘కిల్ బిల్’ సిరీస్, ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’, ‘ద జాంగో అన్చైన్డ్’... ఇలాంటి చిత్రాల ద్వారా క్రైమ్ థ్రిల్లర్స్‌కు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. కొత్త దర్శకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ప్రస్తుతం క్వెంటిన్ ‘ద హేట్‌ఫుల్ ఎయిట్’ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదల కానుంది. -
దుమ్మురేపిన రోస్‌బర్గ్
స్పీల్బెర్గ్: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో మూడో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 30 నిమిషాల 16.930 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ తొలి మలుపు వద్ద లూయిస్ హామిల్టన్‌ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రోస్‌బర్గ్ వెనుదిరిగి చూడలేదు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోవడంతో మళ్లీ తేరుకోలేకపోయాడు. పిట్ స్టాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో హామిల్టన్‌పై ఐదు సెకన్ల పెనాల్టీ కూడా విధించారు. విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా మూడో స్థానాన్ని దక్కించుకోగా... సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని సాధించగా... పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. తొలి ల్యాప్‌లో రైకోనెన్ (ఫెరారీ), అలోన్సో (మెక్లారన్) కార్లు పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి వైదొలగగా... ఆ తర్వాత మరో నలుగురు డ్రైవర్లు సాంకేతిక కారణాలతో తప్పుకున్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటన్ గ్రాండ్‌ప్రి జులై 5న జరుగుతుంది. వర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 169 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 159 3 వెటెల్ ఫెరారీ 120 4 రైకోనెన్ ఫెరారీ 72 5 బొటాస్ విలియమ్స్ 67 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 328 2 ఫెరారీ 192 3 విలియమ్స్ 129 4 రెడ్‌బుల్ 55 5 ఫోర్స్ ఇండియా 31 -
ఒక స్పీల్బర్గ్!
ఆ లఘుచిత్రాలను చూడటానికి చుట్టుపక్కలవారిని 25 సెంట్లకు అనుమతించేవాడు. ఇక వాళ్ల చెల్లేమో ఆ వచ్చిన ‘ప్రేక్షకులకు’ పాప్‌కార్న్ అమ్మేది. మొన్న కరీంనగర్లో ‘న్యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ కాన్సెప్ట్‌తో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఒక సలహా ఇచ్చాడు, అతితక్కువ ఖర్చుతో సినిమాలు చేస్తూ, వాటిని స్థానికంగా చూపించి గిట్టుబాటు చేసుకొమ్మనీ, తద్వారా ఎదుగుదలకు బాటలు పరుచుకొమ్మనీ! అది అయ్యేపనేనా? అని ఎవరైనా అడిగివుంటే, బహుశా, స్టీవెన్ స్పీల్బర్గ్ను ఉదాహరణగా చూపించేవాడేమో! ‘అన్నింటికంటే మించి ఒక మంచి ఇమాజినేషన్ మాత్రమే ఎవరినైనా దర్శకుడిని చేయగలదు. మంచి ఊహవుండి, బాగా కథలు చెప్పే ఆసక్తివుండి, నీ ఆలోచనల్ని కొత్తవారికి చేరవేయగలిగే నేర్పు గనకవుంటే... నువ్వు రాయాలి, లేదా 8ఎంఎం సినిమా మొదలెట్టాలి,’ అంటాడు స్పీల్బర్గ్. తన కౌమారదశలో, వాళ్ల నాన్న బహూకరించిన కెమెరాతో కొన్ని 8ఎంఎం లఘుచిత్రాలు తీశాడు స్పీల్బర్గ్. వాటిని ‘అడ్వెంచర్’ సినిమాలనేవాడు. వాటిని చూడటానికి చుట్టుపక్కలవారిని 25 సెంట్లకు అనుమతించేవాడు. ఇక వాళ్ల చెల్లేమో ఆ వచ్చిన ‘ప్రేక్షకులకు’ పాప్‌కార్న్ అమ్మేది. మనసులో కళ, మెదడులో ‘వెల’! ఈ గుణాలే భవిష్యత్తుల్లో ఆయన్ని అత్యధిక వసూళ్లు రాబట్టిన మేటి హాలీవుడ్ దర్శకుడిగా నిలబెట్టాయి. తన పదహారో ఏట పూర్తి నిడివి ఇండిపెండెంట్ ఫిల్మ్ ‘ఫైర్‌లైట్’ తీశాడు. 1975లో హాలీవుడ్ హిట్‌గా ‘జాస్’ నిలిచినప్పుడు స్పీల్బర్గ్ వయసు 26 ఏళ్లు! అలాగని వసూళ్లు మాత్రమే ఆయన ఐడెంటిటీ కాదు! ఉత్తినే ఆయన సినిమాల పేర్లను తలుచుకోవడంలోనే ఒక విజువల్ ప్లెజర్ ఏదో ఉంది. ఇ.టి., జురాసిక్ పార్క్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... ఇదొక వరుస! ఇండియానా జోన్స్ సీరిస్ ఒక వరుస! క్యాచ్ మి ఇఫ్ యు కెన్, ద టెర్మినల్... మరొక వరుస! మ్యూనిక్, అమిస్టాడ్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, కలర్ పర్పుల్, లింకన్... ఇంకో వరుస! ఏ వరుసలో చూసినా, సాంకేతికత పరిజ్ఞానానికి మానవీయ స్పృహను అద్దడమే స్పీల్బర్గ్ చేసింది. ప్రతి చిత్రమూ తనను భయపెడుతుందంటాడు స్పీల్. ‘అది కచ్చితంగా భయం కూడా కాదు. తెలియనిదానికోసం ఎదురుచూడటం! ఆ భయాన్ని ఇతరుల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా నా భయాల్ని నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తాను. అయినా ఆ సినిమా పూర్తయ్యాక కూడా ఆ భయం ఛాతీలోంచి తొలగిపోదు’. అందుకే మరోటి మొదలుపెడతాడు. అయితే, ‘చిన్నప్పుడు కెమెరాతో స్నేహితుల మీద పెత్తనం చలాయించడమే సినిమాగా ఉండేది. కానీ పెద్దయ్యేకొద్దీ సినిమా అంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారి ప్రతిభను అభినందించడమేననీ, నువ్వు మాత్రమే ఈ సినిమాలు చేయగలిగేవాడివి కాదనీ తెలుసుకోవడం!’ అంటాడు. సినిమా అనేది నీ కుటుంబంతో కాకుండా ఇంకో కుటుంబంతో కూడా సంబంధం ఉండటంగా అభివర్ణిస్తాడు. ‘ఒక కుటుంబంతో కలిసివుంటావు, ఒక కుటుంబంతో పనిచేస్తావు’! అయితే, ‘సినిమా కథల్లాగా తన జీవితకథను కూడా రాసుకోగలిగితే బాగుండే’దంటాడు. తల్లిదండ్రులు విడిపోవడం ఆయన్ని కలవరపరిచింది. సినిమా కథలన్నీ, ఇంకా చెప్పాలంటే ఏ కథైనా ఏమార్చిన ఆత్మకథలే! అందువల్లేనేమో, స్పీల్బర్గ్ తొలిదశ సినిమాల్లో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినట్టుగానో, పట్టనట్టుగానో ఉన్న తండ్రి పాత్ర కనబడుతుంది. అదే వాళ్ల నాన్నను పూర్తిగా అర్థం చేసుకుని, తండ్రీకొడుకుల మధ్య తిరిగి బంధం బలపడ్డాక, కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి తపనపడే తండ్రుల పాత్రలు ప్రవేశించాయి. మతపరమైన విశ్వాసాలు గాఢంగా లేకపోయినా, ‘షిండ్లర్స్ లిస్ట్’ తీస్తున్నప్పుడు తాను కేవలం ఫిలిం మేకర్‌గా మాత్రమే ఉండలేకపోయాననీ, యూదుడిగానే మిగిలాననీ దుఃఖిస్తాడు. జర్మనీలో యూదుల మీద నాజీల దురాగతాలని కేంద్రంగా చేసుకున్న ఆ సినిమాను సినిమాగా కాకుండా, పూర్తిగా తనకోసమే... ‘ఎవరు చూడకపోయినా ఫర్లే’దన్నట్టుగా, బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించాడు. అయినా అది క్లాసిక్‌గా అందరికీ చేరువ కావడానికి కారణం, మనిషి పట్ల మనిషి మనిషిలాగా ప్రవర్తించాల్సిన అవసరం ఇంకా ఇంకా పెరుగుతూ ఉండటమే! స్పీల్బర్గ్ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తూ, రోజర్ ఎబెర్ట్ ఒక పాటను ఉటంకిస్తాడు. ‘పత్రికలవాళ్లు అత్యంత ఆసక్తికర మనుషుల్ని కలుస్తారు’ అని దాని సారాంశం. అది నిజమేనేమోగానీ స్పీల్బర్గ్ను కలిసే అవకాశం అందరికీ రాదు, కనీసం తెలుగు పాత్రికేయుడికి! - ఆర్.ఆర్.