స్పీల్బర్గ్కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు | irrfan khan said no to spielberg movie | Sakshi
Sakshi News home page

స్పీల్బర్గ్కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు

Published Wed, Feb 3 2016 2:30 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

స్పీల్బర్గ్కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు

స్పీల్బర్గ్కు నో చెప్పిన బాలీవుడ్ నటుడు

భారతీయ నటులందరికి హాలీవుడ్ సినిమాలో నటించటం ఓ కల. ముఖ్యంగా స్పీల్ బర్గ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ వస్తే ఇండియన్ టాప్ స్టార్స్ కూడా కాదనరు. అలాంటిది ఓ భారతీయ నటుడు మాత్రం కాదనేశాడు. స్టీఫెన్ స్పీల్ బర్గ్ స్వయంగా తన సినిమాలో నటించాలంటూ కోరినా.. సున్నితంగా తిరస్కరించాడు బాలీవుడ్  నటుడు ఇర్ఫాన్ ఖాన్.

ఇప్పటికే హాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఇర్ఫాన్ తన పాత్రకు పెద్దగా గుర్తింపు లేని కారణంగానే ఆ పాత్రను తిరస్కరించానని ప్రకటించాడు. అంతేకాదు ప్రస్తుతం 'భారతీయ నటులకు పాశ్చాత్య దేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హాలీవుడ్ పరిశ్రమ ఎప్పుడు మంచి కళాకారుల కోసం వెతుకుతూనే ఉంటుంది. అందుకే మంచి కథలతో భారతీయ నటులవైపు చూస్తున్నారు హాలీవుడ్ దర్శకనిర్మాతలు' అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement