ఆ యాస కోసం తంటాలు | Irrfan Khan heading to Budapest for 'Inferno' | Sakshi
Sakshi News home page

ఆ యాస కోసం తంటాలు

Published Tue, Apr 14 2015 10:42 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

ఆ యాస కోసం తంటాలు

ఆ యాస కోసం తంటాలు

‘‘బంగారం.. బంగారం’’ అంటూ ‘సైనికుడు’ సినిమాలో త్రిషను ప్రేమించిన విలన్ పప్పూ యాదవ్ గుర్తున్నాడా....? అదేనండి ఇర్ఫాన్ ఖాన్....బాలీవుడ్‌లో పరిచ యం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ‘పీకూ’ చిత్రంలో నటిస్తున్న ఇర్ఫాన్ ఇప్పటికే హాలీవుడ్ చిత్రాలు ‘ది అమేజింగ్ స్పైడర్‌మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘జురాసిక్ వరల్’డతో పాటు డాన్ బ్రౌన్ రాసిన ‘ఇన్‌ఫెర్నో’ నవల ఆధారంగా తీస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇర్ఫాన్ ఇప్పుడు బుడాపెస్ట్ వెళ్లనున్నారు. బ్రిటీష్ జాతీయుడిగా నటిస్తున్న ఇర్ఫాన్ ఇప్పటికే ఆ యాసలో మాట్లాడటానికి నానా తంటాలు పడుతున్నారట. దర్శకుడు కూడా ఈ విషయంపై తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement