హాలీవుడ్ రూటే సెపరేటు! | Can't survive in hollywood without agent, Irrfan khan | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ రూటే సెపరేటు!

Published Sun, Aug 23 2015 4:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

హాలీవుడ్ రూటే సెపరేటు! - Sakshi

హాలీవుడ్ రూటే సెపరేటు!

ముంబై: హాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే ఏజెంట్ అనే వాడు ఉండాలట. భారతదేశ సినీ పరిశ్రమలో లాగా నేరుగా ఫిల్మ్ మేకర్లను సంప్రదించే పద్దతి అక్కడ లేదట. అక్కడ సినిమా అవకాశాలను పొందటానికి ఏజెంట్ అనే వాడు తప్పకుండా ఉండాలని అంటున్నాడు పీకూ నటుడు ఇర్ఫాన్ ఖాన్. త్వరలో విడుదల కానున్న హాలీవుడ్ మూవీ 'ఇన్  ఫెర్నో'లో నటించిన ఇర్ఫాన్.. అక్కడి పరిస్థితులను  పంచుకున్నాడు.

 

'అక్కడ ఫిల్మ్ మేకర్లను సంప్రదించడానికి ఫోన్ల ద్వారా సాధ్యపడదు.  సినిమా అవకాశాల కోసం ఏజెంట్ అనే వాడు ఉండాలి. ఏజెంట్ విధానమనేది అక్కడ ఒక పద్దతి.  అలాకకపోతే హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం'అని ఇర్ఫాన్ తెలిపాడు.  అతను కేవలం వర్క్ అనేది ఎక్కడ ఉందో వెతికి మనకు తెలుపుతాడని.. దాంతో మనం అక్కడి వెళ్లాల్సి ఉంటుందన్నాడు.  తాను కూడా ఒక ఏజెంట్ ను పెట్టుకున్నానని.. అయితే అతనికి మిగతా ఏపని చెప్పేవాడిని కాదన్నాడు.  ఆ ఏజెంట్ కేవలం సినీపరమైన అవకాశాలను మాత్రమే చూస్తాడన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement