
‘ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సినిమా’ అన్నది ఒక సినిమాకు తిరుగులేని బ్రాండ్. ఆ బ్రాండ్‌ను దక్కించుకునేందుకు ఏటా అదిరిపోయే సినిమాలు పోటీ పడుతుంటాయి. జనవరిలో నామినేషన్స్ అనౌన్స్ అయిన రోజు నుంచే ఏ సినిమాకు ఆస్కార్ వస్తుందన్న చర్చ మొదలైపోతుంది. ఇక ఈ ఏడాదికి అయితే ఇంకా నామినేషన్స్ రాకముందే ఆస్కార్ సందడి కనిపిస్తోంది. 2017 సంవత్సరానికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 4, 2018న జరగనుంది.
2017లో చాలానే బెస్ట్ అనిపించుకునే సినిమాలు రావడంతో ఇప్పట్నుంచే అసలు నామినేషన్స్‌కి ఏ సినిమాలు ఎంపికవుతాయి? అందులో నిలిచి, గెలిచే సినిమా ఏది? అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ‘డన్‌కిర్క్’, స్పీల్‌బర్గ్ తీసిన ‘ది పోస్ట్’, ‘షేప్ ఆఫ్ వాటర్’, ‘వండర్ వుమన్’, ‘లేడీ బర్డ్’, ‘కాల్ మి బై యువర్ నేమ్’ తదితర సినిమాల పేర్లు రేసులో ఉంటాయని ఎక్కువమంది అంచనా! మరి ఇందులో ఎన్నింటికి నామినేషన్స్ దక్కుతాయన్నది జనవరి 23 వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇక అస్కార్‌ను ఏ సినిమా తన్నుకుపోతున్నది తెలియాలంటే మాత్రం మార్చి 4 వరకూ వెయిట్ చేయాల్సిందే!!
Comments
Please login to add a commentAdd a comment