భారీ రాక్షస బల్లులతో సీక్వెల్ | jurasic world sequal details | Sakshi
Sakshi News home page

భారీ రాక్షస బల్లులతో సీక్వెల్

Published Wed, Sep 23 2015 9:18 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

భారీ రాక్షస బల్లులతో సీక్వెల్

భారీ రాక్షస బల్లులతో సీక్వెల్

బాక్సాఫీసు రికార్డులను తిరగరాసిన జురాసిక్ వరల్డ్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన కొలిన్ ట్రివోరో సీక్వెల్ను మరింత భారీగా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన దర్శకుడు, సీక్వెల్తో జురాసిక్ వరల్డ్ ఇమేజ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.

తొలి భాగానికి ఘనవిజయం అందించిన ఆడియన్స్, ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించడానికి మాకు పర్మిషన్ ఇచ్చినట్టుగానే భావిస్తున్నాం అన్నాడు దర్శకుడు కొలిన్. తొలి భాగంతో పొలిస్తే రెండో భాగంలో మరింత భారీ రాక్షస బల్లులను తెర మీద చూపించడానికి రెడీ అవుతున్నామని, అయితే ఇప్పటివరకు కథ రెడీ అవ్వలేదు కనుక మరింత వివరంగా చెప్పలేమని తెలిపాడు. వీలైనంత త్వరగా కథా కథనాలను సిద్ధం చేసి జురాసిక్ వరల్డ్ 2ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాను 2018 జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement