దాదాపు మిలియన్ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. భూమిపై లోతైనా సముద్రాలు, పోడవైన నదులు, ఎతైనా పర్వతాలు వాటి పుర్వొత్తారాల గురించి అందరికి తెలుసు. కానీ మనం నివసించే ఈ భూమిపై ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది.. ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్ పాలియోంటాలజిస్టు(శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణం) శాస్త్రవేత్తలు ఇటివల ఆధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు.
పోర్ట్స్‌మౌత్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని కెమ్ కెమ్ గ్రూప్ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు.
అంతేగాక ఈ నది వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల, భూసంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం పుస్తకం కూడా రచించించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్‌కు చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబెర్-టూత్ కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్లు, ఎగిరే సరిసృపాలు నీటి వేట జంతువులు నివసించేవని వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని, భూమిపై ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారని కూడా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment