లండన్: భూమిపై మనుషులతో సహా పలు రకాల క్షీరదాలు ఒకప్పుడు రాక్షస బల్లులతో(డైనోసార్లు) కలిసి జీవించినట్లు ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడయ్యింది. క్షీరదాల శిలాజాల పరీక్ష ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. దాదాపు 6.60 కోట్ల ఏళ్ల క్రితం బలమైన గ్రహ శకలం భూమిని ఢీకొట్టడంతో రాక్షస బల్లులు అంతమైనట్లు పరిశోధకులు ఇప్పటికే నిర్ధారించారు. అంతకంటే కొంత కాలం ముందే మనుషులతోపాటు కుందేళ్లు, శునకాలు, పిల్లులు, గబ్బిలాల వంటి క్షీరదాలు పరిణామ క్రమంలో భూమిపై ఆవిర్భవించాయి.
అవి రాక్షస బల్లులతోపాటే మనుగడ సాగించాయని బ్రిస్టల్ సైంటిస్టులు తేల్చారు. ఈ అధ్యయనం వివరాలను కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. డైనోసార్లతో ప్రాచీన మానవుల పరిచయం ఎక్కువ కాలం కొనసాగలేదని వెల్లడయ్యింది. మానవులు ఆవిర్భవించిన కొంతకాలానికే డైనోసార్లు అంతం కావడమే ఇందుకు కారణం. భూమిపై జీవనం సాగించే విషయంలో డైనోసార్ల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో క్షీరదాలు విస్తృతంగా ఆవిర్భవించాయని, కాలానుగుణంగా వాటిలో వైవిధ్యం సైతం చోటుచేసుకుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment