అగ్నిపర్వతాల వల్ల కాదు
వాషింగ్టన్: డైనోసార్లు దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల కింద అంతరించిపోవడానికి భారత్‌లో సంభవించిన అగ్ని పర్వతాల విస్ఫోటం కారణం కాదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. క్రిటేషియస్, పేలియోజీన్ కాలాల మధ్య దాదాపు మూడొంతుల వృక్ష, జంతు జాతులు నశించాయని, అందులో డైనోసార్లు కూడా అంతరించి పోయాయనే చర్చ జరుగుతోంది.
అయితే భారత్‌లో విస్ఫోటం చెందిన అగ్నిపర్వతాల నుంచి కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల కారణంగానే అలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే కార్బన్‌డై ఆక్సైడ్‌ను శోషించుకున్న సముద్రాల్లో ఎసిడిటీ పెరిగి అది తిరిగి వాతావరణంలోకి కార్బన్‌డై ఆక్సైడ్ పంపటం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల డైనోసార్లు అంతరించిపోయి ఉంటాయని పేర్కొన్నారు.