రాక్షసబల్లులు.. ఒకప్పుడు భూమిపై వీటిదే రాజ్యం.. భూమిపై ఓకే.. మరి నీటిలోనో.. అక్కడ కూడా వీటిదే రాజ్యమని తాజాగా తేలింది.. చిత్రంలో చూస్తున్నారుగా.. నీట్లో ఉండే జీవులను ఎలా కరకరలాడిస్తోందో.. దీని పేరు స్పైనొసొరస్ ఈజిప్టాయకస్. చిన్నప్పుడు ఎంతుంటాయో తెలియదు గానీ.. పెద్దయ్యాక మాత్రం 50 అడుగుల పొడవుండి.. 20 వేల కిలోల బరువుంటాయట. పళ్ల సైజు ఆరంగుళాలు. ఈ మధ్యే దీని తోకకు సంబంధించిన శిలాజం మొరాకోలోని ఎడారి ప్రాంతంలో దొరికాయి.. శాస్త్రవేత్తలు దీని తోకను పట్టుకుని.. చరిత్రను తవ్వితే.. మొత్తం విషయం బయటపడింది. నదుల్లో ఎక్కువగా ఉండేవని.. తమ జీవితకాలంలో అత్యధిక భాగం నీటిలోనే గడిపేవని చెబుతున్నారు. నీటిలోనూ రాక్షస బల్లులు ఉండేవనడానికి స్పష్టమైన ఆధారం దొరకడం ఇదే తొలిసారట.
Comments
Please login to add a commentAdd a comment