టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మొదటిసారి విదేశాల్లో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. మొరాకోలోని కాసాబ్లాంకాలో కంపెనీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే విదేశీ గడ్డపై అడుగుపెట్టిన మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారంగా టాటా రికార్డ్ క్రియేట్ చేయనుంది.
ఫ్యాక్టరీ ప్రారంభమైన తరువాత కంపెనీ మొదట రాయల్ మొరాకో ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వీల్డ్ ఆర్మర్డ్ ప్లాట్‌ఫామ్‌లను (WhAP) ఉత్పత్తి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఆ తరువాత ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీ ఏడాది లోపల ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ కర్మాగారంలో ప్రతి ఏటా 100 యుద్ధ వాహనాలను ఉత్పత్తి చేయనుంది.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహకారంతో WhAPని అభివృద్ధి చేసింది. సైన్యం కోసం వాహనాలను ఎంపికచేసి ముందు.. ఆఫ్రికా ఎడారుల్లోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించారు. ఆ తరువాత టాటా గ్రూప్ మొరాకోలో సాయుధ వాహనాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
ప్రస్తుతం టాటా మోటార్స్ భారత సైన్యం కోసం వాహనాలను తయారు చేస్తోంది. వీటిని మన ఆర్మీ ఇప్పుడు వినియోగిస్తుంది కూడా. అయితే ఈ వాహనాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ తయారు చేసే వాహనాలు చాలా దృడంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment