డైనోసార్ల వంటి రాక్షస జాతి బల్లుల గురించి జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాల ద్వారే విన్నాం. పురావస్తు శాస్త్రవేత్తల కారణంగా కథకథలుగా తెలుసుకున్నాం. కానీ మన దేశంలోనే జురాసిక్ పార్క్‌ని తలపించేలా డైనోసార్ల శిలాజ స్థలం ఉందన్న విషయం గురించి విన్నారా?. దాని కోసం రాజవంశానికి చెందని యువరాణి కృషి చేసి ప్రపంచ పటంపై ఆ గ్రామాన్ని నిలపడమే గాక అందరికీ తెలిసేలా చేసింది. ఎవరామె? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అంటే..?
గుజరాత్‌లోని బాలాసినోర్‌కు చెందిన ఆలియా సుల్తానా బాబీ అనే మహిళ భారత గడ్డపై ఉన్న జురాసిక్ పార్క్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాన్ని ఒక ఉద్యానవన పార్క్‌గా చేసి టూరిస్టులకు ఆమెనే గైడ్‌గా ఉండి వాటన్నింటి గురించి వివరిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఆమె ఎలా గుర్తించందంటే..1980లో బాలోసోర్‌కి సమీపంలో ఉన్న రహియోలీ అనే గ్రామంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు గుడ్లు, కుళ్లిన డైనోసార్ ఎముకలను గుర్తించారు. అక్కడ తవ్విన కొద్ది పెద్ద సైజులో ఉండే ఫిరంగి బంతుల్లా రాయి మాదిరిగా ఉన్న డైనోసార్ గుడ్లను చూశారు.
ప్రఖ్యాత జియాలజిస్ట్ అశోక్ సాహ్ని వాటిని గుర్తించి అహ్మదాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని డైనోసార్ శిలాజ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి వీటిని సంరక్షించడం అనేది కష్టమైపోయింది. అలాగే దీన్ని అభివృద్ధిపరచడం కూడా సమస్యాత్మకంగా ఉండేది. సరిగ్గా అప్పుడే ఆలియా కాలేజీ చదువు పూర్తై బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్ట్ శాస్త్రవేత్తలకు ఆమె తండ్రి, నవాబ్ మొహమ్మద్ సలాబత్ఖాన్ బాబీకి చెందిన పెద్ద ప్యాలెస్ బస చేసే హెరిటేజ్ హోటల్‌గా మారింది.
శాస్త్రవేత్తలంతా ఆ గ్రామం వద్ద, సమీపంలో నర్మదా నది ప్రాంతంలో వందల కొద్ది ఎముకలను సేకరించడం వంటివి చేశారు. అలా ఆమెకు డైనోసార్‌ల శిలాజాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా రాళ్లలో నిక్షిప్తమై ఉన్న శిలాజ భాగాలను గుర్తించడం నేర్చుకుంది. అలా ఈ అరుదైన చారిత్రక ప్రదేశం పట్ల ఆసక్తి ఏర్పడి ఆ ప్రాంతాన్ని డైనోసార్ల పార్క్‌గా తీర్చిదిద్దేందుకు దారితీసింది. ఇలా చేసే సమయంలో గ్రామస్తుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి సుల్తానా బాబీకి. ఆమె చేసిన ప్రయత్నాల కారణంగానే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థలాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ కొత్త డబుల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రదేశంలో పశువులు మేయకుండా ఉండేలా గార్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని దాన్నో టూరిస్ట్ ప్రదేశంగా మార్చేలా కృషి చేసింది. ఆమె కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్న డైనోసార్ల జాతి గురించి ప్రపంచమే తెలుసుకునేలా చేసింది. అంతేగాదు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులందరికీ తమ రాజప్యాలెస్‌లోనే బస చేసే ఏర్పాట్లు అందించింది. అలాగే వారికి ఆ డైనోసర్‌ల గురించి సవివరంగా తెలిపేలా స్వయంగా ఆమె ఓ గైడ్‌గా మారి వివరించేది. అ
ఆమె డైనోసార్‌ల గురించి సవివరంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడంతో డైనోసార్ యవరాణి(డైనోసార్ ప్రిన్సెస్ అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతోనే ఇదంత సాధ్యమయ్యిందని చెబుతోందామె. అయితే ఈ శిలాజ పార్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారు తమ శక్తిమేర రక్షిస్తామని హామీ ఇస్తేనని అప్పగిస్తానని అంటోంది ఆలియా. అంతేగాదు ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పాలియోంటాలజీ విద్యార్థుల పరిశోధనల్లో సహాయ సహకారాలు అందించాలని యోచిస్తోంది. ఇక ఈ గ్రామం తన తాతగారికి చెందిందని చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద చారిత్రక శిలాజ ప్రదేశం. ఈ శిలాజాలను భావితరాలకు తెలియజేసేలా జాగ్రత్తగా భద్రపరచడానికి కృషి చేస్తానని ఆలియా అన్నారు. ఇకి ఆమె అత్త ప్రముఖ బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ. ఆలియా నిర్వహిస్తున్న ఈ పార్క్‌లో డైనోసార్ అవశేషాలు తాకొచ్చు, పట్టుకోవచ్చు అదే డైనోసార్ శిలాజ పార్క్ ప్రత్యేకత.
(చదవండి: 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment