fossils
-
'డైనోసార్ ప్రిన్సెస్': ఎవరీ ఆలియా సుల్తాన్ బాబీ?
డైనోసార్ల వంటి రాక్షస జాతి బల్లుల గురించి జురాసిక్ పార్క్ వంటి హాలీవుడ్ సినిమాల ద్వారే విన్నాం. పురావస్తు శాస్త్రవేత్తల కారణంగా కథకథలుగా తెలుసుకున్నాం. కానీ మన దేశంలోనే జురాసిక్ పార్క్‌ని తలపించేలా డైనోసార్ల శిలాజ స్థలం ఉందన్న విషయం గురించి విన్నారా?. దాని కోసం రాజవంశానికి చెందని యువరాణి కృషి చేసి ప్రపంచ పటంపై ఆ గ్రామాన్ని నిలపడమే గాక అందరికీ తెలిసేలా చేసింది. ఎవరామె? ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అంటే..? గుజరాత్‌లోని బాలాసినోర్కు చెందిన ఆలియా సుల్తానా బాబీ అనే మహిళ భారత గడ్డపై ఉన్న జురాసిక్ పార్క్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. దాన్ని ఒక ఉద్యానవన పార్క్‌గా చేసి టూరిస్టులకు ఆమెనే గైడ్‌గా ఉండి వాటన్నింటి గురించి వివరిస్తుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఆమె ఎలా గుర్తించందంటే..1980లో బాలోసోర్కి సమీపంలో ఉన్న రహియోలీ అనే గ్రామంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు గుడ్లు, కుళ్లిన డైనోసార్ ఎముకలను గుర్తించారు. అక్కడ తవ్విన కొద్ది పెద్ద సైజులో ఉండే ఫిరంగి బంతుల్లా రాయి మాదిరిగా ఉన్న డైనోసార్ గుడ్లను చూశారు. ప్రఖ్యాత జియాలజిస్ట్ అశోక్ సాహ్ని వాటిని గుర్తించి అహ్మదాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని డైనోసార్ శిలాజ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆ గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడకు వచ్చి వీటిని సంరక్షించడం అనేది కష్టమైపోయింది. అలాగే దీన్ని అభివృద్ధిపరచడం కూడా సమస్యాత్మకంగా ఉండేది. సరిగ్గా అప్పుడే ఆలియా కాలేజీ చదువు పూర్తై బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో పరిశోధన చేసే శాస్త్రవేత్తలకు, జియాలజిస్ట్ శాస్త్రవేత్తలకు ఆమె తండ్రి, నవాబ్ మొహమ్మద్ సలాబత్ఖాన్ బాబీకి చెందిన పెద్ద ప్యాలెస్ బస చేసే హెరిటేజ్ హోటల్‌గా మారింది. శాస్త్రవేత్తలంతా ఆ గ్రామం వద్ద, సమీపంలో నర్మదా నది ప్రాంతంలో వందల కొద్ది ఎముకలను సేకరించడం వంటివి చేశారు. అలా ఆమెకు డైనోసార్ల శిలాజాలపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాత క్రమంగా రాళ్లలో నిక్షిప్తమై ఉన్న శిలాజ భాగాలను గుర్తించడం నేర్చుకుంది. అలా ఈ అరుదైన చారిత్రక ప్రదేశం పట్ల ఆసక్తి ఏర్పడి ఆ ప్రాంతాన్ని డైనోసార్ల పార్క్‌గా తీర్చిదిద్దేందుకు దారితీసింది. ఇలా చేసే సమయంలో గ్రామస్తుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి సుల్తానా బాబీకి. ఆమె చేసిన ప్రయత్నాల కారణంగానే గుజరాత్ ప్రభుత్వం ఈ స్థలాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలం చుట్టూ కొత్త డబుల్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఆ ప్రదేశంలో పశువులు మేయకుండా ఉండేలా గార్డులను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటి గురించి సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని దాన్నో టూరిస్ట్ ప్రదేశంగా మార్చేలా కృషి చేసింది. ఆమె కృషి ఫలితంగా భారతదేశంలో ఉన్న డైనోసార్ల జాతి గురించి ప్రపంచమే తెలుసుకునేలా చేసింది. అంతేగాదు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులందరికీ తమ రాజప్యాలెస్లోనే బస చేసే ఏర్పాట్లు అందించింది. అలాగే వారికి ఆ డైనోసర్ల గురించి సవివరంగా తెలిపేలా స్వయంగా ఆమె ఓ గైడ్‌గా మారి వివరించేది. అ ఆమె డైనోసార్ల గురించి సవివరంగా పలు ఆసక్తికర విషయాలు తెలియజేయడంతో డైనోసార్ యవరాణి(డైనోసార్ ప్రిన్సెస్ అని ముద్దుగా పిలవడం ప్రారంభించారు స్థానికులు. ఈ విషయంలో తన తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతోనే ఇదంత సాధ్యమయ్యిందని చెబుతోందామె. అయితే ఈ శిలాజ పార్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ వారు తమ శక్తిమేర రక్షిస్తామని హామీ ఇస్తేనని అప్పగిస్తానని అంటోంది ఆలియా. అంతేగాదు ఇక్కడే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి పాలియోంటాలజీ విద్యార్థుల పరిశోధనల్లో సహాయ సహకారాలు అందించాలని యోచిస్తోంది. ఇక ఈ గ్రామం తన తాతగారికి చెందిందని చెప్పుకొచ్చింది. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద చారిత్రక శిలాజ ప్రదేశం. ఈ శిలాజాలను భావితరాలకు తెలియజేసేలా జాగ్రత్తగా భద్రపరచడానికి కృషి చేస్తానని ఆలియా అన్నారు. ఇకి ఆమె అత్త ప్రముఖ బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ. ఆలియా నిర్వహిస్తున్న ఈ పార్క్‌లో డైనోసార్ అవశేషాలు తాకొచ్చు, పట్టుకోవచ్చు అదే డైనోసార్ శిలాజ పార్క్ ప్రత్యేకత. View this post on Instagram A post shared by Dinosaur Musuem (@dinosaur__balasinor) (చదవండి: 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు) -
చైనాలో 24 కోట్ల ఏళ్ల డ్రాగన్ శిలాజం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో శిలాజాలు బయటపడుతుంటాయి. వందల సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయిన జీవులు క్రమంగా శిలాజంగా మారుతుంటాయి. అయితే, చైనాలో 2003లో బయటపడిన భారీ డ్రాగన్ శిలాజం వయసు 24 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇంత వయసున్న డ్రాగన్ శిలాజం వెలుగుచూడడం ఇదే మొదటిసారి అని నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనాలో ట్రియాసిక్ కాలానికి చెందిన ఈ శిలాజం భాగాలను తొలుత 2003లో దక్షిణ చైనాలోని గిజౌ ప్రావిన్స్‌లో గుర్తించారు. గత పదేళ్లలో తవ్వకాల్లో మరిన్ని భాగాలు బయటపడ్డాయి. వాటన్నింటినీ ఒకేచోట అమర్చగా అది ఐదు మీటర్ల డ్రాగన్‌గా తేలింది. 24 కోట్ల ఏళ్ల క్రితమే అది శిలాజంగా మారిపోయిందని పరిశోధకులు కనిపెట్టారు. దీనికి డైనోసెఫాలోసారస్ ఒరియంటలిస్ అని పేరుపెట్టారు. ముక్కు నుంచి తోక దాకా పూర్తి శిలాజాన్ని ఆవిష్కరించామని ఎన్ఎంఎస్ సైంటిస్టు డాక్టర్ నిక్ ఫ్రాసెర్ చెప్పారు. ఇది 8 అంకె ఆకారంలో ఉందని, చైనా డ్రాగన్లను గుర్తుకు తెస్తోందని వివరించారు. డ్రాగన్ కాల్పనిక జీవి కాదని, నిజంగానే ఉండేదని చెప్పడానికి ఈ శిలాజం ఒక ఆధారమని సైంటిస్టులు అంటున్నారు. రాక్షస బల్లుల తరహాలో వాతావరణ మార్పుల కారణంగా కోట్ల సంవత్సరాల క్రితం అవి అంతరించిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో బయటపడిన డ్రాగన్ శిలాజం మెడ చాలా పొడవుగా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. నదులు, చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి వీలుగా దాని మెడ పొడవుగా సాగి ఉండొచ్చని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ చేప వయసు 18కోట్ల ఏళ్లు!
కోట్ల ఏళ్ల క్రితం ఎన్నో అరుదైన జీవజాతులు తెలంగాణ ప్రాంతంలో తమ అస్తిత్వాన్ని చాటుకున్నా యి. ఇక్కడ వెలుగు చూస్తున్న అప్పటి జీవ, వృక్ష జాతుల శిలాజాలు (ఫాసిల్స్) ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఆర్కియాలజీ (పురావస్తు పరిశోధన), పేలియంటాలజీ (శిలాజాల పరిశోధన) విభాగాల పరిశోధనల్లో ఇవి బహిర్గతమవుతున్నాయి. జురాసిక్ యుగం కన్నా ముందు యుగమైన ట్రయాసిక్ యుగం నాటి శిలాజాలు కూడా తెలంగాణలో దొరుకుతుండటం గమనార్హం. అనేక అరుదైన శిలాజాలను తెలంగాణ తన గర్భంలో దాచుకుందని, అనేక కొత్త అధ్యాయాలకు తెరతీసే అంతటి చరిత్ర ఇక్కడ దాగి ఉందని పరిశోధకులు అంటున్నారు. – సాక్షి, హైదరాబాద్ వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస శిలాజాలపై 200 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. గత చరిత్రకు, ప్రస్తుత తరానికి మధ్య జీవపరిణామ అంశాలను, జీవ వైవిధ్యాన్ని, జీవన స్థితిగతులును తెలియజేసేవే శిలాజాలు. సాధారణంగా ప్రిజర్వ్ (బురద, బంక, మంచులో కూరుకుపోయి ఏర్పడిన శిలాజాలు), ట్రేస్, కార్బన్, మోల్డ్స్, టెట్రిఫైడ్ అనే ఐదు రకాల శిలాజాలు ఉంటాయి. దాదాపుగా ఈ ఐదు రకాల శిలాజాలూ తెలంగాణలో లభ్యమయ్యాయి. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కాటారంలో రింకోసారా జాతికి చెందిన 25 కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2000 సంవత్సరంలో వెలికితీసింది. పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ ప్రాంతాల్లో కూడా శిలాజ సంపద ఎక్కువగా ఉంది. మంచిర్యాలలోని వేమనపల్లిలో డైనోసార్ వెన్నుపూస (శిలాజం) బయటపడింది. చెన్నూరు అడవుల్లో ఆకుల శిలాజాలను, ఆసిఫాబాద్ జిల్లాలో షెల్ ఫాసిల్స్‌ను, మరోచోట పిల్లి జాతి (పిల్లి, పులి, చిరుత...)కి చెందిన పాద ముద్రల శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. మంచిర్యాలలోని జైపూర్‌లో ఓ క్షీరదానికి సంబంధించిన శిలాజం వెలుగు చూసింది. వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో జురాసిక్ యుగం నాటి పాదముద్రలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో మైక్రో (సూక్ష్మ) ఫాసిల్స్ విరివిగా ఉన్నాయి. వోల్కనిక్ ఎరా (అగ్ని పర్వతాల నుంచి లావా వెలువడి అధిక శాతం జీవజాలం నశించిన సమయం) కు సంబంధించిన ఆరున్నర కోట్ల ఏళ్లనాటి శిలాజాలు దక్కన్ ప్రాంతంలో ఎక్కువగా బయటపడుతున్నాయి. శిలాజాల కోసం తమిళనాడు, కోల్‌కతా, మహారాష్ట్రలో ప్రత్యేకంగా పార్కులు నిర్మించి భద్రపరుస్తున్నారు. రాష్ట్రంలో కూడా ఫాసిల్ పార్క్ ఏర్పాటు చేస్తే అరుదైన సంపదను సంరక్షించవచ్చని, వీటిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలవుతుందని పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. ఫాసిల్ పార్కు ఏర్పాటు చేయాలి.. మన వద్ద 50 కోట్ల ఏళ్ల నాటి శిలాజ సంపద కూడా ఉంది. అయితే వీటి పరిరక్షణ, ఇతర పరిశోధనల విషయంలో అవసరమైనంత మేర కృషి జరగడం లేదు. ఈ మధ్య కాలంలో పలువురు యువ ఔత్సాహికులు శిలాజాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల మాదిరి ఇక్కడ కూడా ఫాసిల్ పార్కుల దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. – చక్కిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జీఎస్ఐ 2012 నుంచి పరిశోధనలు.. తెలంగాణలో అనేక అరుదైన శిలాజాలు ఉన్నా యి. నేను 2012లో వీటిపై వ్యక్తిగతంగా పరిశోధనలు ప్రారంభించా. ప్రొఫెసర్లు, ఇతర పరిశోధకుల సహకారంతో నైపుణ్యం సాధించా. ఇప్పటివరకు ఆదిమానవుడి రాతి పనిముట్లు, కోట్ల సంవత్సరాల నాటి డైనోసార్ల అవయవాలకు సంబంధించిన శిలాజాలు సేకరించా. నా పరిశోధనల సంబంధిత సమాచారాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్టలోని వర్సిటీల విద్యార్థులకు సెమినార్లు, ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నా. – సునీల్ సముద్రాల, ఔత్సాహిక పరిశోధకుడు, బేగంపేట, పెద్దపల్లి జిల్లా -
శిలాజాల అన్వేషి
నిన్న మొన్నటి చరిత్ర అంటేనే ఈ కాలపు యువతకు ఆసక్తి లేదు. కాని వేలయేళ్ల ప్రకృతి రహస్యాలను నిక్షిప్తం చేసుకుని ఉండే శిలాజాల అన్వేషణకు ఎవరైనా పూనుకుంటారా? చెన్నైకి చెందిన అశ్వథ బిజు 9 ఏళ్ల వయసు నుంచే ‘పాలియోంటాలజిస్ట్’గా మారింది. అందుకే ఇటీవల ప్రధానమంత్రి బాలపురస్కార్ని అందుకుంది. 14 ఏళ్ల అశ్వథకు ఈ పని పట్ల ఎందుకు ఆసక్తి? ఆమె తెలుసుకున్నది ఏమిటి? ‘పాలియోంటాలజిస్ట్’ అనే మాట మనకు ఏ స్పీల్బర్గ్ తీసే హాలీవుడ్ సినిమాలోనో వినిపించవచ్చు. కాని చెన్నైకి చెందిన 14 ఏళ్ల అశ్వథ తన విశిష్ట కృషితో ఇవాళ వేలమంది విద్యార్థులకు ఆ మాటను తెలియ చేసింది. పాలియోంటాలజిస్ట్ అంటే శిలాజాల పరిశోధకుడు అని అర్థం. పాలియోంటాలజీ అంటే శిలాజాల అధ్యయన శాస్త్రం. శిలాజం అంటే? భూఆవరణంలో లక్షల ఏళ్లుగా ఎన్నో జీవులు, జీవరాశులు పుట్టాయి. గిట్టాయి. కాని కొన్ని మరణించి తమ జీవ అవశేషాన్ని భూపొరలతో కలుపుకొని వాతావరణ పీడనం వల్ల రాయిలా మారతాయి. అంటే ఆ రాతి లో జీవచిహ్నం అలాగే ఉండిపోతుందన్న మాట. ఇలాంటి రాళ్లనే శిలాజం (ఫాజిల్) అంటారు. ఆ శిలాజాన్ని పరిశీలించినప్పుడు అది ఏ జీవిది ఏ కాలానికి ఆ కాలంలో ఆ జీవి ఉనికి ఎలా ఉండేది అని తెలుసుకోవచ్చు. జంతు శిలాజాలు, వృక్ష శిలాజాలు ఎన్నో భూమిపై జీవుల ఉనికి ఏ విధంగా ఉండేదో తెలియ చేస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఉండి ఆ తర్వాత అంతరించిపోయిన డైనోసార్లు, డోడో పక్షుల వంటివి ఈ శిలాజాల అన్వేషణ వల్లే వాటి పూర్వ రూపం గుర్తించడానికి వీలయ్యాయి. ఇరవై లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ శిలాజాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. చెన్నై అమ్మాయి అశ్వథ చెన్నైలో పుట్టి పెరుగుతున్న అశ్వథను తల్లిదండ్రులు చిన్నప్పుడు బీచ్‌కు తీసుకెళితే ఉత్సాహంగా గవ్వలు ఏరేది. ఐదేళ్లప్పుడు తండ్రి ఎన్‌సైక్లోపిడియాను బహూకరిస్తే ఆ పుస్తకంలో మొదటిసారి శిలాజాల గురించి తెలుసుకుంది. సముద్ర గవ్వల్లో కూడా కొన్ని శిలాజాలుగా మారి ఉంటాయని తెలుసుకున్నాక ఆమెకు శిలాజాల గురించి తెలుసుకోవాలనిపించింది. అశ్వథ ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తల్లి చిన్నారి అశ్వథను ఎగ్మూర్‌లోని గవర్నమెంట్ మ్యూజియంకు తీసుకెళ్లింది. ‘అక్కడ నేను మొదటిసారి అమ్మొనైట్ ఫాజిల్‌ను చూశాను. చేతితో తాకాను. థ్రిల్లింగ్‌గా అనిపించింది. అలాంటివి అన్వేషించి సేకరించవచ్చు అని తెలుసుకున్నాను. నాకూ సేకరించాలనిపించింది’ అంటుంది అశ్వథ. చెన్నైలోని ఒక టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న అశ్వథ ఇప్పటికి 136 శిలాజాలను సేకరించింది. ఆ విధంగా భారతదేశంలో చిన్న వయసు పాలియోంటాలజిస్ట్గా గుర్తింపు పొందింది. అందుకే భారత ప్రభుత్వం అశ్వథ కృషికి మెచ్చి మొన్న ‘ప్రధానమంత్రి బాలపురస్కార్’ను బహూకరించింది. విశేష ప్రచారం అశ్వథకు పదేళ్లు ఉన్నప్పుడు పెరియార్ యూనివర్సిటీలో పని చేస్తున్న జియోలజీ ప్రొఫెసర్ ఎం.యు.రాంకుమార్‌ను కలిసింది. ఆయన శిలాజాల గురించి ఆ అమ్మాయికి ఉన్న ఆసక్తి గమనించి మార్గనిర్దేశనం చేశాడు. ఆ తర్వాతి నాలుగేళ్లలో అశ్వథ తమిళనాడులోని అరియలూరు, గుండు పెరుంబేడు లలో, మహారాష్ట్రలోని శిరోంచాలో శిలాజాల అన్వేషణ సాగించింది. స్కూలు సెలవుల్లో తల్లిదండ్రుల సహాయంతో అశ్వథ ఈ పని చేయగలిగింది. విశేషం ఏమిటంటే ఆమెకు డైనోసార్ల ఎముకలు కూడా దొరికాయి. ‘కాని శిలాజాల అధ్యయనం పట్ల మన స్కూళ్లలో ఎలాంటి పాఠాలు లేవు. అవగాహన లేదు. అందుకే నేను చెన్నైలోని అనేక స్కూళ్లను కలిసి అక్కడ శిలాజాల గురించి చెప్పడం మొదలెట్టాను. కొద్ది రోజుల్లోనే నాకు గుర్తింపు వచ్చి అన్ని స్కూళ్లు పిలవడం మొదలెట్టాయి. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా విద్యార్థుల కోసం వెబినార్లు నిర్వహిస్తున్నాను. పాలియోంటాలజీ ఇప్పుడు యూనివర్సిటీలలో అడిషినల్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఉంది. నేను పెద్దయ్యే సమయానికి అది మెయిన్ కోర్సు అవుతుందని ఆశిస్తున్నాను. నేను పెద్దయ్యి మాలిక్యులర్ పాలియోంటాలజిస్ట్ అవుదామనుకుంటున్నాను’ అంటుంది అశ్వథ. అశ్వథ కృషి కొనసాగాలని కోరుకుందాం. శిలాజాల అధ్యయనం పట్ల మన స్కూళ్లలో ఎలాంటి పాఠాలు లేవు. అవగాహన లేదు. యూనివర్సిటీలలో కూడా అడిషినల్ సబ్జెక్ట్‌గా మాత్రమే ఉంది. నేను పెద్దయ్యే సమయానికి అది మెయిన్ కోర్సు అవుతుందని ఆశిస్తున్నాను. నేను పెద్దయ్యి మాలిక్యులర్ పాలియోంటాలజిస్ట్ అవుదామనుకుంటున్నాను. – అశ్వథ బిజు -
రాళ్లలా కనిపిస్తున్నాయా?.. ఆరున్నర కోట్ల ఏళ్ల చరిత్ర దాగుంది
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్: చిత్రంలో కనిపిస్తున్నవన్నీ నత్తగుల్లలు.. రాళ్లలా కనిపిస్తున్నాయి కదా! ఎందుకంటే అవి ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం నాటివి. శిలాజాలుగా మారి అలా రాళ్లలో ఇరుక్కుపోయాయి. ఆదిలాబాద్ జిల్లా కరిమెరి పరిసరాల్లో ఈ నత్తగుల్లల శిలాజాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు అహోబిలం కరుణాకర్ గుర్తించారు. ద్వారం కుడివైపు తిరిగి ఉన్న ఈ అరుదైన, అలనాటి జాతి నత్తగుల్లల శిలాజాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గోదావరి నది ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో ఇంతకంటే పెద్ద నది ప్రవహించినట్టు జీఎస్ఐ గతంలో గుర్తించింది. ఆ మంచినీటి నదిలో పెరిగిన నత్తగుల్లలు ఇవి. తర్వాత లావా ఉబికివచ్చి ఈ ప్రాంతంలో ప్రవహించి ఘనీభవించింది. ఆ లావాలో చిక్కుకుని ఈ నత్తగుల్లలు కూడా రాతిలో రాళ్లుగా మారిపోయి ఇప్పుడు శిలాజాలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో తిర్యానీ ప్రాంతంలో ప్రిసా టెర్పోలెన్సిస్ జాతి నత్తగుల్లల శిలాజాలు వెలుగు చూశాయి. వాటికి భిన్నంగా ఇవి ప్రిసా ప్రిన్సిపీ ఉపజాతికి చెందిన నత్తగుల్లలని జీఎస్ఐ విశ్రాంత అధికారి చకిలం వేణుగోపాల్‌ను ఉటంకిస్తూ కరుణాకర్ తెలిపారు. ఇన్ని కోట్ల ఏళ్ల తర్వాత కూడా వాటి ఆకారం ధ్వంసం కాకుండా.. తాజా నత్త గుల్లల్లా కనిపిస్తుండటం విశేషం. -
ములుగు జిల్లాలో శిలాజాల గుర్తింపు
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రం పరిధిలో శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల గోదావరి నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరిపి ఈ శిలాజాలను గుర్తించారు. శనివారం వాటి వివరాలను వెల్లడించారు. ప్రాచీన కాలంలో భూమిలోపల పొరల్లో కూరుకుపోయిన జంతు కళేబరాలు జల ప్రవాహాల సమయంలో శిలాజాల రూపంలో బయట పడుతుంటాయని తెలిపారు. వీటిని స్ట్రోమాటోలైట్స్ అంటారన్నారు. స్థానికులు గెర్రా అని పిలిచే ఈ ప్రాంతం ప్రాచీనకాలంలో సరస్సుగా ఉండేదని తెలిపారు. వివిధ చారలతో కలిగి ఉన్న రాళ్లు ఆదిమమానవులు వాడిన పరికరాలుగా, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తులను బట్టి పురాతన సరస్సుగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపితే మరిన్నో విషయాలు వెలుగు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శిలాజాలు, వివిధ చారలతో ఉన్న శిలాజం -
పిరికి డైనోసార్లు.. ఎలా బతికేవో తెలుసా?
Patagonian fossils show Jurassic dinosaur had herd mentality: డైనోసార్ల ఉనికి.. మనుగడ కాలంపై నిర్ధారణ కోసం పరిశోధనలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అర్జెంటీనా దక్షిణ భాగంలోని పటగోనియా రీజియన్‌లో దొరికిన వివిధ జాతుల డైనోసార్ల శిలాజాల్ని.. ఈ భూమ్మీద అత్యంత ప్రాచీన సాక్ష్యాలుగా పరిగణిస్తుంటారు. అయితే వీటి ఆధారంగా డైనోసార్లు బతికిన విధానంపై సైంటిస్టులు ఇప్పుడొక అంచనాకి వచ్చారు. గురువారం ఈ మేరకు సైంటిస్టుల పరిశోధనకు సంబంధించిన కథనం.. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. వందకి పైగా గుడ్లు, 20కిపైగా భారీ డైనోసార్లు, 80 పిల్ల డైనోసార్ల అవశేషాల ఆధారంగా.. డైనోసార్లు గుంపులుగా కలిసి బతికేవని అంచనాకి వచ్చారు. సుమారు 193 మిలియన్ సంవత్సరాల కిందట వీటి మనుగడ కొనసాగి ఉంటుందని భావిస్తున్నారు. ముస్సావురస్(సావ్రోపోడోమార్ఫ్ జాతి) డైనోసార్లు 20 అడుగుల ఎత్తు, టన్నున్నర బరువు పెరుగుతాయి. ఈ డైనోసార్ జాతి ఇక్కడి సముహంలో బతికినట్లు భావిస్తున్నారు. వీటికి పొడవైన మెడ.. తోక, స్తంభాల్లాంటి కాళ్లు ఉంటాయి వీటికి. ఇవి పూర్తి శాఖాహారులు. గుత్తగంపగా ఇవి అన్నీ కలిసి గుడ్లు పెట్టడం విశేషం. కందకాల్లో పొరలు పొరలుగా ఆడ డైనోసార్లు పెట్టిన గుడ్ల(పిండం అభివృద్ధి చెందిన దశలో)ను పరిశోధకులు సేకరించారు. ఇక భారీ డైనోసార్ల శిలాజాలు విడి విడిగా లభించగా.. పిల్ల డైనోసార్ల శిలాజాలు మాత్రం గుంపుగా ఒకే దగ్గర దొరికాయి. మట్టి దిబ్బల నుంచి ఈ డైనోసార్ల అవశేషాలను సేకరించారు. కరువు వల్లే ఇవన్నీ సామూహికంగా అంతం అయ్యి ఉంటాయని, ఆపై ఇసుక తుపాన్లు వీటి కళేబరాలను ముంచెత్తి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ముస్సావురస్ చాలా పిరికివని, దాడి చేసే సత్తా కూడా ఉండేవి కావేమోనని, శత్రువుల(రాకాసి డైనోసార్ల) నుంచి తమను తాము కాపాడుకునేందుకే గుంపులుగా తిరిగేవని, పిల్ల డైనోసార్లనూ మధ్యలో ఉంచుకుని గుంపులుగా రక్షించుకునేవని నిర్ధారణకు వచ్చారు. హై రెజల్యూషన్ ఎక్స్‌రే.. (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) ఆధారంగా వీటిని స్కాన్ చేసి ముస్సావురస్ డైనోసార్ల జీవన విధానంపై ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పటాగోనియాలోనే Argentinosaurus ఆర్జెంటినోసారస్ను భూమ్మీద అత్యంత భారీ డైనోసార్‌గా(ఈ భూమ్మీద అత్యంత పెద్ద ప్రాణిగా) భావిస్తుంటారు. 118 ఫీట్ల ఎత్తు, 70 టన్నుల బరువు ఉండేదని వాటి శిలాజాల ఆధారంగా నిర్దారించుకున్నారు. ఇవి మాత్రం పక్కా మాంసాహారులని సదరు జర్నల్‌లో కథనం ఉంది. చదవండి: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా? -
అత్యంత భారీ డైనోసార్లు ఏవి?
కోట్ల సంవత్సరాల క్రితం భూమండలంపై తిరగాడిన భారీ జీవజాతి ఏదైనా ఉందంటే అది రాకాసిబల్లులదే. పరిశోధకుల అన్వేషణలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని డైనోసార్ జాతుల అవశేషాలు బయల్పడ్డాయి. వాటిని విశ్లేషించి ఆ జాతుల్లో అత్యంత భారీ డైనోసార్లు రకాలు కొన్నింటిని శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ► బ్రాకియోసారస్ పొడవు: 25 మీటర్లు బరువు: 80 టన్నులు జీవించిన కాలం: దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం ►అర్జెంటీనోసారస్ పొడవు: 37–40 మీటర్లు బరువు: 100–110 టన్నులు జీవించిన కాలం: దాదాపు 9.8 కోట్ల ఏళ్ల క్రితం ► సూపర్సారస్ పొడవు: 33–35 మీటర్లు బరువు: 45 టన్నులు జీవించిన కాలం: 14.2 నుంచి 15.4 కోట్ల ఏళ్ల క్రితం ► పటగోటైటాన్ మయోరం పొడవు: 37–40 మీటర్లు బరువు: 77 టన్నులు జీవించిన కాలం: దాదాపు 9.5 నుంచి 10 కోట్ల ఏళ్ల క్రితం ► డిప్లోడోకస్ పొడవు: 27 మీటర్లు బరువు: 30–80 టన్నులు జీవించిన కాలం: దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం పటగోటైటాన్ మయోరం రకం డైనోసార్ పరిమాణంలో మానవుడు, ఏనుగు, జిరాఫీల కంటే ఎంత పెద్దదంటే..? -
అతిపెద్ద డైనోసార్ శిలాజం
మానవ ఆవిర్భావానికి కొన్ని వేల సంవత్సరాల ముందు భూమిపై రాక్షస బల్లుల పెత్తనం కొనసాగింది. శతాబ్దాలు కొనసాగిన ఈ డైనోసార్ల డామినేషన్‌కు ఆకస్మికంగా భూమిపై విరుచుకుపడ్డ ఉల్కాపాతం చెక్ పెట్టింది. డైనోసార్లు పూర్తిగా అంతరించిన వేల సంవత్సరాలకు భూమిపై మనిషి ఆధిపత్యం మొదలైంది. సైన్సు పురోగతి సాధించేకొద్దీ రాక్షసబల్లులపై పరిశోధనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో వీటి శిలాజాలు వెలికి తీయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద డైనోసార్ శిలాజాన్ని వెలికి తీశారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ శిలాజం అర్జెంటీనాలో లభించింది. సౌరోపాడ్ గ్రూప్‌నకు చెందిన డైనోసార్‌కు చెందిన ఈ శిలాజ ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయి. ఇప్పటివరకు పటగొటియన్ మయోరమ్ అనే డైనోసార్‌నే అతిపెద్ద డైనోసార్‌గా భావించారు. కానీ తాజా శిలాజం ఎముకలు ఈ పటగొటియన్ కన్నా 10– 20 శాతం పెద్దవిగా ఉన్నాయని సీటీవైఎస్ సైంటిఫిక్ ఏజెన్సీ తెలిపింది. సౌరోపాడ్ గ్రూప్ డైనోసార్లు పెద్ద శరీరంతో, పొడవైన మెడ, తోకతో తిరిగేవి. ఇవి శాకాహారులు. భూమిపై ఇంతవరకు జీవించిన ప్రాణుల్లో ఇవే అతిపెద్దవి. వీటిలో పటగొటియన్ 70 టన్నుల బరువు, 131 అడుగుల పొడవు ఉండేది. తాజా శిలాజం ఏ డైనోసార్‌కు చెందిందో ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు కొన్ని శరీరభాగాలకు చెందిన ఎముకలు మాత్రమే వెలికి తీయడం జరిగింది. పూర్తిగా వెలికితీత పూర్తయి డైనోసార్‌ను గుర్తించేందుకు మరికొన్నేళ్లు పడుతుందని శిలాజ శాస్త్రవేత్త జోస్ లూయిస్ కార్బల్లిడో అభిప్రాయపడ్డారు. -
ఈ ‘చేప’ వయసు 12 కోట్ల ఏళ్లు
రాతిపై పెయింట్ చేసిన చేప బొమ్మలాగా ఉంది కదూ ఇది. కానీ, ఇది నిజమైన చేప అచ్చు. సహజంగా ఇలా రాతిలో నిక్షిప్తమైంది. దీని వయసు ఎంతో తెలుసా? దాదాపు 12 కోట్ల ఏళ్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శిలాజంగా మారిన ఆ చేప ఆకృతి ఇలా రాతి పొరల్లో ఉండిపోయింది. సాక్షి, హైదరాబాద్: కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు రాష్ట్రంలో లభ్యమయ్యాయి. శిలాజంగా మారిన చేప ఆకృతి రామగుండం ఎన్టీపీసీ పరిధిలో లభించింది. ఈ ప్రాంతంలో శిలాజాలకు కొదవే లేదు. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రాక్షస బల్లులు కూడా జీవించాయనడానికి సాక్ష్యంగా గతంలో వాటి శిలాజాలు లభ్యమయ్యాయి. బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని డైనోసారియంలో ఉన్న రాక్షసబల్లి ఆకృతి శిలాజాల రూపం ఇక్కడ లభించిందే. ఇప్పటికీ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలో రకరకాల శిలాజాలు లభిస్తూనే ఉన్నాయి. తాజాగా కోట్ల ఏళ్ల నాటి చేపలు, వృక్షాలు, ఆకులు, జంతువుల పాద ముద్రలతో కూడిన అచ్చులకు సంబంధించిన శిలాజాలు లభించాయి. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో లభించిన ఆకుల ముద్రలున్న శిలాజం ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ తాజాగా వీటిని సేకరించారు. చెన్నూరు కోటపల్లి అటవీ ప్రాంతంలో కొన్ని ఆకుల ఆకృతులతో కూడిన శిలాజాలు లభించాయి. ఇవి ప్రాచీన వృక్షజాతి గ్లోసోప్టెరీస్‌కు చెందినవిగా నిష్ణాతులు అభిప్రాయపడుతున్నట్లుగా వాటిని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ జాతి చెట్లలో నారవేప, తిరుమణి తదితరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పత్ర శిలాజాల వయసు 10 కోట్ల ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. మంచిర్యాల జైపూర్ ప్రాంతంలో ఒక జంతువు పాద ముద్ర నిక్షిప్తమైన శిలాజాన్ని కూడా గుర్తించారు. -
శిలా'జెమ్'
గువ్వలాంటి ఈ పాపాయి గవ్వలతో ఆడుకుని అక్కడితే ఆగిపోయి ఉంటే.. ఇప్పుడు ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండకపోయేది. గవ్వలాగ కనిపిస్తూనే గవ్వ కానిదేదో అశ్వత ఆకర్షించింది. అది శిలాజం అని చెప్పింది అమ్మ. అలాంటి శిలాజాల కోసం వెతకడం మొదలు పెట్టింది. శిలాజాల శోధన అంత సులువు కాదని అప్పట్లో అశ్వతకు తెలియదు. అలాగని వాటికోసం వెతకడం మాననూ లేదు. ఐదేళ్ల వయసు నుంచి శిలాజాల సేకరణ మొదలు పెట్టింది, ఇప్పుడామె దగ్గర 79 శిలాజాలున్నాయి. ఇన్ని ప్రత్యేకమైన శిలాజాలను (ఫాజిల్స్) సేకరించడం సీనియర్ సైంటిస్ట్లకు తప్ప మామూలు వాళ్లకు సాధ్యంకాదు. పన్నెండేళ్లకే ఇంతగా అధ్యయనం చేసిందంటే ఆమెను బాల మేధావిగా గుర్తించి తీరాల్సిందే అని ప్రశంసించారు చెన్నై, పెరియార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్‌కుమార్. ఇండియాలో అత్యంత చిన్న వయసు పేలియెంటాలజిస్ట్ (శిలాజ పరిశోధకురాలు) అశ్వత. సెలవొస్తే మ్యూజియానికే! అశ్వతకు సముద్ర తీరాలే కాదు పుస్తకాలంటే కూడా అంతే ఇష్టం. చదవడం రానంత చిన్నప్పటి నుంచి కూడా ఎన్సైక్లోపీడియా పుస్తకాన్ని విపరీతంగా ఇష్టపడేది. పేజీలు తిప్పుతూ బొమ్మలు చూస్తూ చదివినట్లే ఫీలయ్యేది. ఓ పేజీలో ఫాజిల్ (శిలాజం) కనిపించింది. సముద్రానికెళ్లి వెతికితే బోలెడన్ని దొరుకుతాయని ఆ చిట్టి బాల్యానికి పెద్ద ఆశ. అశ్వత సరదా మీద నీళ్లు చల్లడం ఇష్టంలేని ఆమె తల్లి విజయరాణి ఆమెను ఎగ్మోర్‌లో ఉన్న మ్యూజియానికి తీసుకెళ్లింది. ఐదేళ్ల పాపాయిగా తొలిసారి అశ్వత ఆ మ్యూజియాన్ని చూసింది. తరవాత అదే మ్యూజియానికి ఎన్నిసార్లు వెళ్లిందో లెక్కే లేదు. స్కూలుకెళ్లినంత క్రమబద్ధంగా మ్యూజియానికి వెళ్లేది. స్కూలుకు సెలవు వస్తే వాళ్ల ఫ్యామిలీ వీకెండ్ టూర్ మ్యూజియానికి లేదా సముద్ర తీరానికి. పిక్నిక్ని ఎంజాయ్ చేసినంత ఆనందంగా మ్యూజియంలోని శిలాజాలను చూసేది. అశ్వత ఊరికే చూస్తుందనే మాత్రమే అనుకుంది విజయరాణి, ఆ చిన్న మెదడుతో పెద్ద అధ్యయనమే చేస్తోందని తెలియదు. ఊహించని మలుపు అశ్వత ఐదవ తరగతిలో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో తిరుచ్చి భారతీదాసన్ యూనివర్సిటీ మెరైన్‌సైన్స్ హెచ్ఓడీని కలవడం జరిగింది. అశ్వత అడుగుతున్న సందేహాలను వివరిస్తూనే ఆమె అప్పటికే శిలాజ అధ్యయనంలో తెలుసుకున్న సంగతులకు ఆశ్చర్యపోయారు ఆయన. ఎన్నో ఏళ్ల పరిశోధనతో తప్ప సాధ్యం కాని పరిజ్ఞానం ఇంత చిన్న వయసులో సాధ్యం చేసినందుకు ప్రశంసించారు. యూనివర్సిటీకి వచ్చి తనను కలిస్తే అశ్వతకు మరిన్ని విషయాలను వివరిస్తానని తన కార్డు ఇచ్చారు. కానీ తీరా అశ్వత వెళ్లేటప్పటికి ఆయన అక్కడ లేరు. నిరాశతో వెనక్కు రావాల్సిన సమయంలో అశ్వతను ఆమె తల్లి విజయరాణి పెరియార్ యూనివర్సిటీకి తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్ రామ్‌కుమార్‌కి తాను సేకరించిన ఫాజిల్స్‌ను చూపించిందా అమ్మాయి. వాటిని చూసిన రామ్‌కుమార్ ఏకంగా మూడు గంటల సేపు వాటి గురించి అశ్వతకు వివరించారు. మూడు గంటల్లో ఆయన చెప్పిన సమాచారాన్ని అంతే వేగంగా ఆకళింపు చేసుకుందామె. బాల మేధావి అని భుజం తట్టి, అశ్వతకు ఓ ప్రాజెక్టు ఇచ్చారాయన. కావేరీ నది తీరాన అరియలూర్ దగ్గర విస్తరించిన నేల శిలాజ అధ్యయన క్షేత్రం. అక్కడ పరిశోధన చేయమని రూట్ మ్యాప్ ఇచ్చి పంపించారాయన. అలా ఫాజిల్ సేకరణను ముమ్మరం చేసింది అశ్వత. వాటి గురించి ఆమె అప్పటికే చదివి ఉండడంతో ఎగ్మోర్ మ్యూజియంలో లేని నమూనాలను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇప్పుడు అశ్వత ఇల్లు ఓ మినీ మ్యూజియాన్ని తలపిస్తోంది. అది కూడా ఎగ్మోర్‌లో ఉన్న మ్యూజియానికి ఎక్స్‌టెన్షన్‌గా అన్నమాట! కూతురి కోసం ఎన్ని సర్దుబాట్లు చేసుకుని అయినా సరే, ఆమె కోసం పేరెంట్స్‌లో ఎవరో ఒకరు ప్రయాణిస్తూనే ఉన్నారు. శిలాజ క్షేత్రాలు ఎంత దూరంలో ఉన్నా అక్కడికి అశ్వతను తీసుకెళ్లడం, ఎప్పుడు, ఎక్కడ సెమినార్లు జరుగుతుంటే వాటికి హాజరు కావడానికి ఆమెకు తోడుగా వెళ్లడం కోసం ఒకరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. అదే మాట అడిగినప్పుడు ‘మా అమ్మాయి కోసం మేము కాకపోతే మరెవరు చేస్తారు’ అంటారు నవ్వుతూ. చెప్పడమూ ఇష్టమే అశ్వతకు ఫాజిల్స్‌ను సేకరించడంతోపాటు వాటి గురించి తన తోటి పిల్లలకు చెప్పడం కూడా అంతే ఇష్టం. స్కూలు హెడ్ మాస్టర్లకు ఉత్తరాలు రాసి అనుమతి తీసుకుంది. మొదట్లో ఆమె ఉత్సాహం చూసి ‘చిన్న పిల్లను నిరాశ పరచడం ఎందుకు, ఓ గంట టైమ్ ఇద్దాం’ అని మాత్రమే అనుమతినిచ్చారు. ఇప్పుడు స్కూళ్లు, కాలేజ్‌లతోపాటు పేలియెంటాలజీ ఇన్స్టిట్యూట్లు కూడా ఆమెను సెమినార్లకు ఆహ్వానిస్తున్నాయి. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా వినే వారిలో డాక్టరేట్లు సాధించిన సీనియర్ సైంటిస్టులు కూడా ఉంటున్నారు. అశ్వత చదువులో కూడా బ్రిలియెంట్ స్టూడెంటే. సైన్స్, మ్యాథ్ ఒలింపియాడ్లలో అవార్డులందుకుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఫిక్కీ ఎఫ్ఎల్ఓ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చేతుల మీదుగా యంగెస్ట్ పేలియెంటాలజిస్ట్ అవార్డు అందుకుంది. ఒక శిలాజం ఒక చరిత్ర పుస్తకంతో సమానం. వందల వేల ఏళ్ల నాడు భూమి మీద సంచరించిన స్థితిగతులను వివరిస్తుంది. ఈ రంగంలో అధ్యయనానికి మన దేశంలో ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి, కానీ ఆదరణ అంతగా లేదు. ఆసక్తి ఉన్నవాళ్లు ఇతర దేశాలకు వలస వెళ్లేది ఇలాంటి పరిస్థితిలోనే. అందుకే మన మేధను మనదేశ నిర్మాణానికి ఉపయోగించుకునే అవకాశాలు కల్పించాలి. అప్పుడే మన అశ్వతలు మనదేశంలోనే ఉంటారు. ఈ అమ్మాయి పెద్దయ్యేలోపు మన దగ్గర పేలియెంటాలజీ రీసెర్చ్ మరింత పటిష్టంగా విస్తరించాలని కోరుకుందాం.– మంజీర -
పదికోట్ల ఏళ్ల నత్త ఇది...
ఫొటో చూశారుగా.. అదీ విషయం. ఎప్పుడో పదికోట్ల ఏళ్ల క్రితం నాటి నత్త ఇది. చెట్ల జిగురు (ఆంబర్)లో బందీ అయిపోయింది. మయన్మార్‌లో ఇటీవల బయటపడ్డ ఈ అపురూపమైన శిలాజంలోని నత్త బతికి ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. పైభాగంలోని పెంకుతోపాటు కణజాలం కూడా ఏమాత్రం చెడిపోకుండా భద్రంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద రాక్షసబల్లులు తిరుగాడిన కాలంలోనే ఈ నత్తలు కూడా మనుగడలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిగురులో చిక్కుకునే సమయానికి నత్త బతికే ఉందని.. శరీరం నిటారుగా ఉండటం, తలచుట్టూ గాలి బుడగ ఉండటం దీనికి నిదర్శమని ఈ శిలాజాన్ని పరిశీలించిన పురాతత్వ శాస్త్రవేత్త జెఫ్రీ స్టివెల్ అంటున్నారు. రాక్షసబల్లుల కాలంలో నత్తలు ఉన్న విషయం తెలిసినప్పటికీ వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం లేకపోయిందని.. పది కోట్ల ఏళ్లనాటి నత్త శరీరం చెక్కు చెదరకుండా లభించడం ద్వారా ఈ కొరత తీరనుందని ఆయన వివరించారు. చెట్ల జిగురులో చిక్కుకుపోయి చెక్కు చెదరకుండా లభించిన అవశేషాల్లో రాక్షసబల్లి తోక, కర్రలాంటి తోక ఉన్న విచిత్ర ఆకారపు జంతువు, ఊసరవెల్లి, -
ఇప్పటి ఎడారి.. ఒకప్పటి సముద్రం
జైపూర్ : ఎడారి.. కనుచూపు మేర ఇసుక తప్ప మరొకటి కనిపించని ప్రాంతం. మచ్చుకోక చోట మాత్రమే నీరు. మన దేశంలో ఎడారి అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజస్ధాన్. అయితే ఇప్పటి ఈ ఎడారి ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా..? పూర్తిగా నీరు ఆవరించి ఉండేది. చెలమలు, చెరువుల కాదు.. ఏకంగా సముద్రం. అవును ఇప్పటి ఈ ఎడారి ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేదంట. నమ్మడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఏడాది నుంచి గుజరాత్, రాజస్థాన్‌లో విస్తరించిన ఎడారి ప్రాంతంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. పాలియెంటాలజీ(శిలాజాల అధ్యాయనం) విభాగం డైరెక్టర్ దేబసిష్ భట్టాచార్య అధ్వర్యంలో నిర్వహస్తున్న ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జైసల్మేర్ జిల్లాలోని ఈ ఎడారి ప్రాంతంలో పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన అనేక శిలాజాలు బయటపడ్డాయి. వీటిలో తొలి తరం తిమింగలానికి సంబంధించినవి, షార్క్, మొసలి దంతాలు, తాబేలు ఎముకకు సంబంధించిన శిలజాలు ఉన్నాయి. ఇవన్ని పూర్వ చారిత్రక యుగానికి సంబంధించినవే కాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇవన్ని జలచరాలు. ఇవన్ని మధ్య శిలాయుగానికి చెందినవి. జైసల్మేర్ జిల్లాలో దొరికిన ఈ శిలజాలు అన్ని మధ్య శిలా యుగానికి చెందినవిగా భట్టాచార్య టీం గుర్తించింది. మధ్య శిలా యుగం అంటే దాదాపు 47 లక్షల సంవత్సరాల కాలం నాటి జీవజాలం. అంటే ప్రస్తుతం ఎడారి విస్తరించిన ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల క్రితం సముద్రం ఉండేదని స్పష్టంగా అర్ధమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల క్రమేణ వచ్చిన వాతావరణ మార్పులు మూలంగా ప్రస్తుతం ఉన్న ఎడారిగా రూపాంతరం చెంది ఉంటుందని శ్రాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాక గుజరాత్, కచ్ బేసిన్ ప్రాంతాల్లో ఒకే రకమైన వాతావరణ మార్పులు సంభవించి ఉంటాయని భట్టాచార్య టీం అంచనా వేస్తుంది. అయితే ఒకప్పుడు ఉన్న సముద్రం అంతరించి ఇప్పటి ఎడారి ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత పరిశోధన చేయాల్సి ఉంటుందని భట్టాచార్య ప్రకటించారు. -
ఏటూరునాగారం అడవుల్లో డైనోసర్ శిలాజాలు!
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అడవి ప్రాంతంలో లక్షల సంవత్సరాల కిందటి వృక్ష శిలాజాలు, డైనోసర్ శిలాజాల ఆనవాళ్లు లభించాయి. ఆది మానవుల కాలం నాటి చరిత్రను గత మూడేళ్లుగా వెలుగులోకి తెస్తున్న కవి, అధ్యాపకుడు రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో నమ్మలేని శిలాజాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా బుట్టాయగూడెంలో పరిశోధనలు చేస్తున్న రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి భద్రాచలం వెళ్లేదారిలో గోదావరి నది అనేక పాయలుగా చీలి దారి మార్చుకొని ప్రవహించడం వల్ల భూగర్భంలోని వృక్ష శిలాజాలు బయటకి వస్తున్నాయి. గ్రామ శివారు భూముల్లో అనేక శిలాజాలు ఉన్నట్లు గుర్తించాం. రెండు మీటర్ల పొడువైన వృక్ష శిలాజంతోపాటు అనేక ప్రాంతాల్లో డైనోసర్ ఎముకల వంటి శిలాజాలను గుర్తించాం. వీటిని స్థానికులు రాకాసి బొక్కలు అని పిలుస్తుంటారు. దేవతల, రాక్షసుల యుద్ధంలో రాక్షసులు చనిపోయారని, ఈ శిలాజాలను వారి బొక్కలుగా భావిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రాచీన శిలా యుగానికి చెందిన అనేక రాతి పనిముట్లును సేకరించాం. ఒక సూక్ష్మరాతి పనిముట్టు కూడా లభించిందని ఆయన వెల్లడించారు. బుట్టాయిగూడెం నుంచి అడవుల్లోకి వెళితే మరిన్ని శిలాజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో డైనోసర్ శిలాజాలు కూడా లభించవచ్చని ఆయన అన్నారు.