ములుగు జిల్లాలో శిలాజాల గుర్తింపు  | Rare Fossils Are Found In Mulugu district | Sakshi
Sakshi News home page

ములుగు జిల్లాలో శిలాజాల గుర్తింపు 

Published Sun, Jan 9 2022 4:13 AM | Last Updated on Sun, Jan 9 2022 5:23 AM

Rare Fossils Are Found In Mulugu district - Sakshi

శిలాజాలను గుర్తిస్తున్న పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి

కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రం పరిధిలో శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల గోదావరి నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరిపి ఈ శిలాజాలను గుర్తించారు. శనివారం వాటి వివరాలను వెల్లడించారు. ప్రాచీన కాలంలో భూమిలోపల పొరల్లో కూరుకుపోయిన జంతు కళేబరాలు జల ప్రవాహాల సమయంలో శిలాజాల రూపంలో బయట పడుతుంటాయని తెలిపారు.

వీటిని స్ట్రోమాటోలైట్స్‌ అంటారన్నారు. స్థానికులు గెర్రా అని పిలిచే ఈ ప్రాంతం ప్రాచీనకాలంలో సరస్సుగా ఉండేదని తెలిపారు. వివిధ చారలతో కలిగి ఉన్న రాళ్లు ఆదిమమానవులు వాడిన పరికరాలుగా, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తులను బట్టి పురాతన సరస్సుగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపితే మరిన్నో విషయాలు వెలుగు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.


శిలాజాలు, వివిధ చారలతో ఉన్న శిలాజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement