Ratnakar reddy
-
వెయ్యేళ్ల లక్ష్మీదేవి ఆలయం
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ శివారులోని పురాతన నాగులమ్మ దేవాలయంలో దాదాపు వెయ్యేళ్లనాటి లక్ష్మీదేవి ఆలయం వెలుగుచూసింది. ఈ మేరకు తను గుర్తించిన పలు విషయాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి శుక్రవారం వివరించారు. ‘కాకతీయుల కాలంలో నిర్మించిన నాగులమ్మ గుడిలో ద్వికూటాలయానికి మరమ్మతులు చేస్తున్నారు. గుడిచుట్టూ మట్టిని తొలగిస్తుండగా సూర్యుడి విగ్రహం, 13వ శతాబ్దం నాటి శిలాశాసనం బయటపడ్డాయి. ఆ శాసన పాఠం అచ్చుతీసి శాసన పరిష్కర్త కె.మునిరత్నంనాయుడు, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్‌కు పంపించగా పూర్తి వివరాలు తెలిశాయి. సుమారు ఐదడుగుల ఎత్తైన ఏకశిలపై రాసిన శాసనంలో.. కాకతీయుల కాలంలోని మహాప్రధాని లక్ష్మీదేవికి రంగ¿ోగాలకు భూమిని దానం చేసినట్లు తెలిసింది. ఆ శాసనంపై ‘తుసము, దునెనిమిదిసమ, గూతి శ్రీలక్ష్మీ, రంగ¿ోగలకు, విచ్చితి, మహాప్ర«దాని, క్రయమాత, ముక్య, నానకు’ అనే పదాలు ఉన్నాయని తెలిపారు. ఇటుకల తయారీలో ఇంజనీరింగ్ నైపుణ్యం ఇక్కడి ఇటుకల్లో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని, మట్టి, డంగు సున్నం లేకుండా తయారు చేశారని తెలిపారు. ఆలయం ముందున్న పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి రుబ్బు రోలు లభించిందని, అక్కడే కాకతీయుల కాలం నాటి శిథిల దేవాలయం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. -
ములుగు జిల్లాలో శిలాజాల గుర్తింపు
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రం పరిధిలో శిలాజాలు వెలుగులోకి వచ్చాయి. పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల గోదావరి నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరిపి ఈ శిలాజాలను గుర్తించారు. శనివారం వాటి వివరాలను వెల్లడించారు. ప్రాచీన కాలంలో భూమిలోపల పొరల్లో కూరుకుపోయిన జంతు కళేబరాలు జల ప్రవాహాల సమయంలో శిలాజాల రూపంలో బయట పడుతుంటాయని తెలిపారు. వీటిని స్ట్రోమాటోలైట్స్ అంటారన్నారు. స్థానికులు గెర్రా అని పిలిచే ఈ ప్రాంతం ప్రాచీనకాలంలో సరస్సుగా ఉండేదని తెలిపారు. వివిధ చారలతో కలిగి ఉన్న రాళ్లు ఆదిమమానవులు వాడిన పరికరాలుగా, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తులను బట్టి పురాతన సరస్సుగా చెప్పవచ్చన్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపితే మరిన్నో విషయాలు వెలుగు చూస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శిలాజాలు, వివిధ చారలతో ఉన్న శిలాజం -
బుట్టాయిగూడెం అడవుల్లో డైనోసార్ శిలాజాలు
♦ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వృక్ష శిలాజాలు ♦ చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెల్లడి ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలోని లక్షల సంవత్సరాల కిందటి వృక్ష శిలాజాలు, డైనోసార్ శిలాజాలు ఉన్నట్లు ఆనవాళ్లు లభించాయి. ఆది మానవుల కాలం నాటి చరిత్రను మూడేళ్లుగా వెలుగులోకి తెస్తున్న అధ్యాపకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. బుట్టాయిగూడెంలోని చెలకల్లో అడుగడుగునా శిలాజాలున్నాయి. రెండు మీటర్ల పొడువైన వృక్ష శిలాజంతోపాటు అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపిస్తున్నాయి. స్థానికులు వీటిని రాకాసి బొక్కలు అని పిలుస్తుంటారు. ఈ గ్రామంలో ప్రాచీన శిలా యుగానికి చెందిన అనేక రాతి పనిముట్లును రత్నాకర్ సేకరించారు. ఒక సూక్ష్మరాతి పనిముట్టు కూడా లభించిందని వెల్లడించారు. బుట్టాయిగూడెం నుంచి అడవుల్లోకి వెళ్లినట్లైతే మరిన్నీ పొడవైన శిలాజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అడవిలో పరిశోధనలు జరిపితే డైనోసార్ల శిలాజాలు వెలుగులోకి వస్తాయని రత్నకర్ తెలిపారు. జంతు శిలాజపు మూడు అంగుళాల ఎముక దొరికిందన్నారు. పరిశోధనలో పకిడె అరవింద్, స్థానికులు గోగు కల్యాణ్, రేసు మణికంఠ పాల్గొన్నారు. -
ఏటూరునాగారం అడవుల్లో డైనోసర్ శిలాజాలు!
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అడవి ప్రాంతంలో లక్షల సంవత్సరాల కిందటి వృక్ష శిలాజాలు, డైనోసర్ శిలాజాల ఆనవాళ్లు లభించాయి. ఆది మానవుల కాలం నాటి చరిత్రను గత మూడేళ్లుగా వెలుగులోకి తెస్తున్న కవి, అధ్యాపకుడు రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో నమ్మలేని శిలాజాలు బయటపడ్డాయి. గత కొన్ని రోజులుగా బుట్టాయగూడెంలో పరిశోధనలు చేస్తున్న రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి భద్రాచలం వెళ్లేదారిలో గోదావరి నది అనేక పాయలుగా చీలి దారి మార్చుకొని ప్రవహించడం వల్ల భూగర్భంలోని వృక్ష శిలాజాలు బయటకి వస్తున్నాయి. గ్రామ శివారు భూముల్లో అనేక శిలాజాలు ఉన్నట్లు గుర్తించాం. రెండు మీటర్ల పొడువైన వృక్ష శిలాజంతోపాటు అనేక ప్రాంతాల్లో డైనోసర్ ఎముకల వంటి శిలాజాలను గుర్తించాం. వీటిని స్థానికులు రాకాసి బొక్కలు అని పిలుస్తుంటారు. దేవతల, రాక్షసుల యుద్ధంలో రాక్షసులు చనిపోయారని, ఈ శిలాజాలను వారి బొక్కలుగా భావిస్తున్నారు. ఈ గ్రామంలో ప్రాచీన శిలా యుగానికి చెందిన అనేక రాతి పనిముట్లును సేకరించాం. ఒక సూక్ష్మరాతి పనిముట్టు కూడా లభించిందని ఆయన వెల్లడించారు. బుట్టాయిగూడెం నుంచి అడవుల్లోకి వెళితే మరిన్ని శిలాజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో డైనోసర్ శిలాజాలు కూడా లభించవచ్చని ఆయన అన్నారు. -
బృహదు శిలాయుగం నాటి సమాధులు లభ్యం
లింగాలఘణపురం(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం ప్రాంతంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి, పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సాగర్ తెలిపారు. మంగళవారం వారు సమాధులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో సుమారు 100కు పైగా సమాధులు ఉన్నాయని.. వాటిలో కొన్ని ధ్వంసమయ్యాయని అన్నారు. క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్నట్లు వెల్లడించారు. సమాధుల ఏర్పాటుకు గుర్తుగా బెహరాన్‌లు (ఎత్తైన రాతి స్తంభాలు) కూడా నాలుగు ఉన్నాయని వివరించారు. ఆనాటి సమాధులను పరిరక్షించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. కళ్లెం పరిసరాల్లో రెండు శాసనాలు కూడా ఉన్నాయని, వాటిని విశధీకరించాలని కోరారు. తన వద్ద రాతితో తయారైన గొడ్డలి, బ్లేడు, వినాయకవిగ్రహం, గొర్రెపొటేలు విగ్రహం, మట్టి పాత్రలు ఉన్నాయని పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే ఎంతో చరిత్ర బయట పడుతుందని ఇటీవల మంత్రి కేటీఆర్ తన వద్దనున్న మట్టి పాత్రను కూడా బహూకరించినట్లు వివరించారు.