ఫస్ట్‌ప్లేస్‌లో ములుగు జిల్లా, లాస్ట్‌లో గ్రేటర్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 83,64,331 నివాసాల్లో సర్వే పూర్తయ్యింది. సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,16,14,349 నివాసాలకుగాను ఇప్పటి వరకు 72 శాతం సర్వే పూర్తయినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జాప్యం లేకుండా సకాలంలో సర్వే పూర్తి చేయడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును కూడా వదలకుండా ప్రతీ ఇంటిలో సమగ్రంగా సర్వే నిర్వహించాలని సీఎస్ స్పష్టం చేశారు.
మంగళవారం నాటికి రాష్ట్రంలో ములుగు జిల్లా 98.9శాతం పూర్తి చేసి ప్రథమస్థానంలో నిలవగా, నల్లగొండ జిల్లా 95 శాతంతో ద్వితీయ స్థానంలో, జనగాం జిల్లా 93.3 శాతంతో తృతీయ స్థానంలో నిలిచాయి. గ్రేటర్ హైదరాబాద్ 50.3 శాతం సర్వేతో చివరిస్థానంలో నిలిచింది. ఈ సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారీ గా పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారు లను నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే తీరును సమీక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment