
Patagonian fossils show Jurassic dinosaur had herd mentality: డైనోసార్ల ఉనికి.. మనుగడ కాలంపై నిర్ధారణ కోసం పరిశోధనలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అర్జెంటీనా దక్షిణ భాగంలోని పటగోనియా రీజియన్‌లో దొరికిన వివిధ జాతుల డైనోసార్ల శిలాజాల్ని.. ఈ భూమ్మీద అత్యంత ప్రాచీన సాక్ష్యాలుగా పరిగణిస్తుంటారు. అయితే వీటి ఆధారంగా డైనోసార్లు బతికిన విధానంపై సైంటిస్టులు ఇప్పుడొక అంచనాకి వచ్చారు.
గురువారం ఈ మేరకు సైంటిస్టుల పరిశోధనకు సంబంధించిన కథనం.. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. వందకి పైగా గుడ్లు, 20కిపైగా భారీ డైనోసార్లు, 80 పిల్ల డైనోసార్ల అవశేషాల ఆధారంగా.. డైనోసార్లు గుంపులుగా కలిసి బతికేవని అంచనాకి వచ్చారు. సుమారు 193 మిలియన్ సంవత్సరాల కిందట వీటి మనుగడ కొనసాగి ఉంటుందని భావిస్తున్నారు. ముస్సావురస్(సావ్రోపోడోమార్ఫ్ జాతి) డైనోసార్లు 20 అడుగుల ఎత్తు, టన్నున్నర బరువు పెరుగుతాయి. ఈ డైనోసార్ జాతి ఇక్కడి సముహంలో బతికినట్లు భావిస్తున్నారు.
వీటికి పొడవైన మెడ.. తోక, స్తంభాల్లాంటి కాళ్లు ఉంటాయి వీటికి. ఇవి పూర్తి శాఖాహారులు. గుత్తగంపగా ఇవి అన్నీ కలిసి గుడ్లు పెట్టడం విశేషం. కందకాల్లో పొరలు పొరలుగా ఆడ డైనోసార్లు పెట్టిన గుడ్ల(పిండం అభివృద్ధి చెందిన దశలో)ను పరిశోధకులు సేకరించారు. ఇక భారీ డైనోసార్ల శిలాజాలు విడి విడిగా లభించగా.. పిల్ల డైనోసార్ల శిలాజాలు మాత్రం గుంపుగా ఒకే దగ్గర దొరికాయి.
మట్టి దిబ్బల నుంచి ఈ డైనోసార్ల అవశేషాలను సేకరించారు. కరువు వల్లే ఇవన్నీ సామూహికంగా అంతం అయ్యి ఉంటాయని, ఆపై ఇసుక తుపాన్లు వీటి కళేబరాలను ముంచెత్తి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ముస్సావురస్ చాలా పిరికివని, దాడి చేసే సత్తా కూడా ఉండేవి కావేమోనని, శత్రువుల(రాకాసి డైనోసార్ల) నుంచి తమను తాము కాపాడుకునేందుకే గుంపులుగా తిరిగేవని, పిల్ల డైనోసార్లనూ మధ్యలో ఉంచుకుని గుంపులుగా రక్షించుకునేవని నిర్ధారణకు వచ్చారు.
హై రెజల్యూషన్ ఎక్స్‌రే.. (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) ఆధారంగా వీటిని స్కాన్ చేసి ముస్సావురస్ డైనోసార్ల జీవన విధానంపై ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పటాగోనియాలోనే Argentinosaurus ఆర్జెంటినోసారస్‌ను భూమ్మీద అత్యంత భారీ డైనోసార్‌గా(ఈ భూమ్మీద అత్యంత పెద్ద ప్రాణిగా) భావిస్తుంటారు. 118 ఫీట్ల ఎత్తు, 70 టన్నుల బరువు ఉండేదని వాటి శిలాజాల ఆధారంగా నిర్దారించుకున్నారు. ఇవి మాత్రం పక్కా మాంసాహారులని సదరు జర్నల్‌లో కథనం ఉంది.
చదవండి: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment