Dinosaur
-
విశాఖ బీచ్ రోడ్డు డైనోసర్ పార్క్ లో అగ్నిప్రమాదం..
-
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
బొమ్మ కోసం ఆర్డర్.. భారీ విగ్రహం డెలివరీ!
తల్లితండ్రులు తమ పిల్లలపై చూపే ప్రేమకు హద్దులంటూ ఉండవు. పిల్లల కోర్కెలు తీర్చేందుకు, వారి ఆశలు నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు. ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుమారునిపై తండ్రికి ఉన్న ప్రేమకు పరాకాష్ఠగా నిలిచింది ఈ ఉదాహరణ. నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఎలాగైనా తెచ్చివ్వాలని తండ్రి భావించాడు. ఈ బొమ్మ కోసం కొడుకు పట్టిన మంకుపట్టు ఆ తండ్రికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా, అదొక ఛాలెంజ్‌గా అనిపించింది. కుమారుడు కోరిన బొమ్మ అత్యంత భారీగా ఉండటంతో దానిని ఇంటికి తెచ్చేందుకు తండ్రి క్రేన్‌ను కూడా బుక్ చేయాల్సివచ్చింది. ‘మిర్రర్’ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్న్కు చెందిన ఆండ్రీ బిస్సన్ను అతని నాలుగేళ్ల కుమారుడు థియో.. తనకు డైనోసార్ బొమ్మకావాలని కోరాడు. ఆ పిల్లాడు ఆడుకునేందుకు అనువైన బొమ్మను అడిగినప్పటికీ అతని చెంతకు అత్యంత భారీ విగ్రహం చేరింది. కుమారుడు కోరిన విధంగా ఆండ్రీ బిస్సన్ ఆన్లైన్లో డైనోసార్ బొమ్మను ఆర్డర్ చేశాడు. అయితే అతను ఆర్డర్ చేసింది ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేటుగా తెలిసింది. ఆండ్రీ బిస్సన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో రూ. ఒక లక్షా 5 వేల మొత్తానికి కొనుగోలు చేశాడు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు క్రేన్ అవసరమయ్యింది. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్‌లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కనుగోలు చేశాడు. ఈ ఉదంతం గురించి ఆండ్రీ బిస్సన్ మీడియాతో మాట్లాడుతూ ఈ బొమ్మ ఇది 3 మీటర్ల ఎత్తు, 1.5 మీటర్ల వెడల్పు ఉంటుందని తాను అనుకున్నానని, అయితే, ఆ బొమ్మ ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. డెలివరీ కంపెనీ ఆండ్రీ బిస్సన్కు ఫోన్ చేసి, లారీలో విగ్రహం సరిపోదని, అది రెండు టన్నులు ఉండడంతో జేసీబీలో తీసుకొస్తున్నామని తెలిపారు. ఆ డైనోసార్ విగ్రహం చాలా బరువు ఉన్నందున అది ఆండ్రీ బిస్సన్ ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. -
పదండి.. డైనోసార్లను వేటాడుదాం!
ఒకప్పుడు అడవుల్లో వేట కామన్. నాడు రాజులు సరదాకి చేస్తే.. ఆదివాసీలు ఇప్పటికీ ఆహారం కోసం వేటాడుతుంటారు. ఏ జింకలో, అడవి పందులో అయితే సరే. మరీ పులిని వేటాడాలంటే కష్టం. అది నిషేధం కూడా. మరి ఏకంగా డైనోసార్‌నే వేటాడాలనుకుంటే.. అందుకు అఫీషియల్‌గా లైసెన్స్ కూడా ఇస్తే.. ఆశ్చర్యంగా అనిపిస్తోందా.. ఆ సంగతులేమిటో తెలుసుకుందామా.. అది డైనోసార్ ల్యాండ్.. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల డైనోసార్ల అవశేషాలు బయటపడినా.. అమెరికా మాత్రం స్పెషల్. ఒకప్పుడు భారీ సంఖ్యలో డైనోసార్లు తిరుగాడిన నేల అది. అందులోనూ ఉటా రాష్ట్రంలోని వెర్నల్ ప్రాంతంలో వేలకొద్దీ డైనోసార్ల శిలాజాలను గుర్తించారు. మనం డైనోసార్లను వేటాడటానికి అధికారికంగా లైసెన్సులు ఇచ్చేది కూడా ఇక్కడే. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పర్యాటకులు అక్కడికి వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఇచ్చేస్తారు. కానీ వేటాడటానికి డైనోసార్లు దొరుకుతాయా అని మాత్రం అడగొద్దు సుమా. పర్యాటకం కోసం.. శిలాజాల గుర్తింపు కోసం.. ఉటా ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచేందుకు, డైనోసార్ల శిలాజాల వెలికితీతకు ఊపునిచ్చేందుకు 1951లో ‘డైనోసార్ హంటింగ్ లైసెన్స్’లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి ‘డైనోసార్ కంట్రోల్ ఏరియా ఆఫ్ యూంటా కౌంటీ’ అని పేరు పెట్టారు. ఈ వినూత్న ఆలోచనతో పర్యాటకులు కూడా పెరిగారు. ఏటా 60 వేల మందికే లైసెన్స్‌లు ఇస్తారు. అంతేకాదు చాలా రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. ►లైసెన్స్ పొందినవారు టీ–రెక్స్ డైనోసార్లలో కేవలం ఒక పెద్ద మగదానిని మాత్రమే వేటాడాలి. ►ఒక డిప్లోడాకస్ గిగాంటికస్ (అతిభారీ శాఖాహార డైనోసార్)ను వేటాడొచ్చు. అయితే దాని బరువు 5 వేల పౌండ్లు (2,268 కేజీలు)కన్నా ఎక్కువగా ఉండాలి ►ఏవైనా రెండు మగ స్టెగోసార్ (వీపుపై ముళ్లలా ఉండేవి) డైనోసార్లను వేటాడొచ్చు. ►టెరోడాక్టిల్ (పక్షుల్లా ఎగిరేవి) డైనోసార్లను అయితే నాలుగింటిని వేటాడొచ్చు. అయితే ఇందులో పిల్ల డైనోసార్లు ఉండొద్దు. కుప్పలు కుప్పలుగా డైనోసార్ల ఎముకలు ఉటా స్టేట్‌లోని వెర్నల్ ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఎకరాల ప్రాంతంలో ‘డైనోసార్ నేషనల్ మాన్యుమెంట్’ ఉంది. దీన్నే డైనోసార్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా సుమారు 15 కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల శిలాజాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పదుల కొద్దీ డైనోసార్ల శిలాజాలు కుప్పల్లా ఉండటంతో.. ‘డైనోసార్ ఎముకల క్వారీ’లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పర్యాటకులు ఈ ప్రాంతంలో కలియదిరగవచ్చు. కొన్ని డైనోసార్లను ముట్టుకోవచ్చు కూడా. ..మరి పదండి.. డైనోసార్లను వేటాడుదాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పిట్టంత పిపీలికం.. హమ్మింగ్ బర్డ్ సైజులో ఉండే చీమ శిలాజం గుర్తింపు
చీమ.. ఓ అల్పజీవి. కానీ.. ఒకప్పుడు పరిమాణంలో హమ్మింగ్ బర్డ్ అంత పెద్ద చీమలు పిపీలిక సామ్రాజ్యాన్ని ఏలాయట. ఇటీవల లభించిన చీమ శిలాజాన్ని బట్టి 47 మిలియన్ ఏళ్ల కిందట మహా భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు తేల్చారు. చీమ జాతుల్లో ఏకంగా 30 ఏళ్లు జీవించేవి కూడా ఉండటం విశేషమే. కాగా.. చీమలు వేడి వాతావరణంలోనే జీవించడానికి ఇష్టపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వర్షాకాలం, శీతాకాలంలో చలికి తట్టుకోలేక మన ఇళ్లల్లోకి చొరబడి తలదాచుకుంటాయని.. వంటింట్లోని ఆహార పదార్థాలను దోచుకుపోతాయని వెల్లడించారు. సాక్షి, అమరావతి: అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో 47 మిలియన్ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు అక్కడి కాలనీలను పాలించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హమ్మింగ్ బర్డ్ పరిమాణంలో ఉండే రాణి చీమ శిలాజాన్ని 2011లో కనుగొన్నారు. రెండు అంగుళాలకు పైగా సైజులో ఉన్న ఈ శిలాజాన్ని డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ సైన్సెస్‌లో భద్రపరిచారు. అంతకు ముందు టైటానోమైర్మా జాతికి (2 అంగుళాల పొడవు, 16 సెంటీమీటర్ల రెక్కలు) చెందిన చీమ శిలాజాన్ని జర్మనీలో గుర్తించారు. చీమలు చల్లటి రక్తం (కోల్డ్ బ్లడెడ్) కలిగిన జాతికి చెందినవి. వాటి శరీర ఉష్ణోగ్రత పర్యావరణంలోని సూర్యరశి్మపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికే ఇష్టపడతాయి. గ్లోబల్ వారి్మంగ్ చీమ జాతిని భయపెడుతున్నా.. కొంచెం తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలుతున్నాయి. అందుకే శీతాకాలంలో (డిసెంబర్–జనవరి మధ్య) బయట చీమలు కనిపించవు. ఆహార పదార్థాలు ఉండే ఇళ్లలోకి చొరబడి జీవనం సాగిస్తాయి. డైనోసార్లు అంతరించినా.. ఇవి బతికే ఉన్నాయ్ జీవుల్లో అత్యంత సంపన్నమైన (సోషల్ ఇంజనీరింగ్), శక్తివంతమైన సమూహాలలో చీమలకు ప్రత్యేక స్థానం ఉంది. భూగ్రహంపై డైనోసార్లు అంతరించిపోయినా.. వాటితో కలిసి జీవించిన చీమ జాతులు మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. చీమలకు 130 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల కిందట మయన్మార్‌లో 99 మిలియన్ సంవత్సరాల క్రితం ‘హెల్ యాంట్’ పేరుతో జీవించిన చీమ నమూనాను గుర్తించారు. ఇదే క్రమంలో భూమిపై చీమల సంఖ్యపై హాంకాంగ్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని వుర్జ్బర్గ్లోని జూలియస్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భూమిపై 20 క్వాడ్రిలియన్ (20 వేల ట్రిలియన్) చీమలు ఉన్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించింది. వీటి సంఖ్య గతంలో కంటే రెండు నుంచి 20 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 2.5 మిలియన్ చీమల జనాభా ఉండటం గమనార్హం. వీటి బరువు 12 మిలియన్ టన్నులు ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అడవి పక్షులు, క్షీరదాల కంటే చీమల బరువు (చీమల బయోమాస్ 12 మిలియన్లు) ఎక్కువగా ఉంటుంది. ఇది మానవుల బయోమాస్‌లో దాదాపు 20 శాతం. బయోమాస్ అనేది జీవుల్లోని కర్బనాల మొత్తం బరువుగా కొలుస్తారు. చీమలు మొక్కల విత్తనాల పంపిణీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ సంచార ప్రాంతాలతో పోలిస్తే అడవుల్లో, ఆశ్చర్యకరంగా శుష్క ప్రాంతాల్లో చీమలు సమృద్ధిగా పెరుగుతున్నాయి. 30 ఏళ్ల జీవన కాలం చీమలు కందిరీగల నుంచి ఉద్భవించినట్టు పలు పరిశోధనల్లో తేలింది. పరిమాణంలో 0.07–2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ మినహా ప్రపంచంలోని ప్రతిచోట కనిపిస్తున్నాయి. మగ కారి్మక చీమల జీవిత కాలం మూడేళ్లలోపు (కొన్ని కారి్మక చీమలు స్వల్పకాలమే జీవిస్తాయి) ఉంటుంది. చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణీ చీమ కాలనీ స్థాపకురాలు. రాణి ఫలదీకరణం చేసిన తర్వాత కాలక్రమేణా మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అమెరికాలోని ఇడాహోలోని తన సహజ నిర్మాణంలో ఓ రాణి చీమ 30 ఏళ్లపాటు నివసించింది. క్వీన్ బ్లాక్ గార్డెన్ చీమలు ల్యాబ్ సెట్టింగ్‌లలో 28 సంవత్సరాల వరకు జీవించినట్టు గుర్తించారు. మారికోపా హార్వెస్టర్ చీమకు 12 తేనెటీగలు కలిసి కఠినంగా కుట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. చీమల్లో ఆశ్చర్యకరంగా రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండోది ఇతర చీమలను పోషించడానికి (ట్రోఫాలాక్సిస్ ప్రక్రియ) ఉపయోగిస్తాయి. ఏడాదిలో 50 టన్నుల మట్టి తరలింపు చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవని అంచనా. చీమల జట్టు ఒక సంవత్సర వ్యవధిలో 50 టన్నుల మట్టిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తుంది. ఇది ప్రకృతికి మేలు చేయడంలో వానపాముల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు. శరీరంలోని రంధ్రాల వ్యవస్థను (స్పిరకిల్స్) శ్వాస పీల్చుకునేందుకు ఉపయోగిస్తాయి. అందుకే ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవు. ఇదే అతిపెద్ద చీమల కాలనీ ఐరోపా, జపాన్, అమెరికా అంతటా అతిపెద్ద చీమల కాలనీ వ్యాపించింది. తొలుత వీటిని మూడు ప్రత్యేక కాలనీలుగా భావించారు. ఇక్కడ అర్జెంటీనా చీమ జాతి ఒక్కటే ఉండటంతో మనుగడ కోసం ఒకదానితో మరొకటి పోరాడుకోవడానికి నిరాకరించడంతో కాలనీ చాలా పెద్దదిగా పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ కాలనీ 3,750 మైళ్ల మేర విస్తరించి ఉందని.. అందులో 370 మిలియన్ చీమలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
డైనోసార్లకే.. సారు!
విమానమంత పొడవు.. కొంచెం అటూఇటుగా 4 అంతస్తుల ఎత్తు.. 57 టన్నుల బరువు.. ఇది టిటనోసార్..ఈ భూప్రపంచం ఇప్పటివరకూ చూసిన అతి పెద్ద డైనోసార్.. దీని ముందు అంతటి టీ రెక్స్ కూడా జూజూబీనే..ఎప్పుడో పది కోట్ల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన ఈ టిటనోసార్ అస్థి పంజరాన్ని లండన్‌లోని నేచురల్ హిస్టరీమ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఆరు డైనోసార్ల ఎముకలతో... 2010లో అర్జెంటీనాలోని ఓ రైతు తన పొలంలో పెద్ద ఎముకను గుర్తించాడు. శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడంతో.. క్రెటాషియస్ కాలానికి చెందిన 6 టిటనోసార్లకు చెందిన 280 ఎముకలు బయటపడ్డాయి. వాటిలో బాగున్న వాటిని కలిపి ఒక పూర్తిస్థాయి టిటనోసార్ అస్థిపంజరాన్ని సిద్ధం చేశారు. దీనికి ‘పటగోటిటన్ మయోరమ్’గా పేరుపెట్టారు. ఈ డైనోసార్ అస్థి పంజరంలోని తొడ ఎముక ఒక్కటే 8 అడుగుల పొడవు, 500 కిలోలకుపైగా బరువు ఉండటం గమనా ర్హం. మొత్తం టిటనోసార్ ఎముకలను లండన్‌కు తరలించేందుకు రెండు విమానాలు కావాల్సి వచ్చాయి. దీన్ని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో మార్చి 31 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ప్రదర్శించనున్నారు. రోజుకు 130 కిలోల ఆకులు, కొమ్మలు.. ♦ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల మేరకు.. ఈ టిటనోసార్ పొడవు 121 అడుగులు, ఎత్తు 40 అడుగులు, బరువు 57 టన్నులకుపైగా ఉంటుందని అంచనా. భూమ్మీద తిరుగాడిన అత్యంత బరువైన, పెద్దదైన జంతువు ఇదే. ♦ ఇది శాఖాహారి. రోజుకు 130 కిలోలకుపైగా చెట్ల ఆకులు, కొమ్మలను తినేస్తుంది. ♦ ఒకసారికి 40 వరకు గుడ్లను పెడుతుంది. అయితే మాంసాహార డైనోసార్లు, ఇతర జంతువులు, ప్రమాదాల కారణంగా ప్రతి వంద టిటనోసార్ పిల్లల్లో ఒక్కటే పూర్తిస్థాయి వరకు ఎదుగుతుందని అంచనా. ♦ అంతపెద్ద డైనోసార్ అయినా.. గుడ్డులోంచి బయటికి వచ్చేప్పుడు బరువు నాలుగైదు కిలోలు మాత్రమే. కానీ ఎదిగే వేగం చాలా ఎక్కువ. పుట్టాక రెండు నెలల్లోనే ఏకంగా 40–50 కిలోల వరకు పెరుగుతాయట. ఇదే మనుషులకు అయితే పది పదిహేనేళ్లు పడుతుంది మరి. ♦ ఆరున్నర కోట్ల ఏళ్ల కింద భూమిని గ్రహశక లం ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టిన అతిభారీ డైనోసార్.. అంతకు మరో మూడున్నర కోట్ల ఏళ్ల ముందు బతికినది కావడం విశేషం. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రాక్షసబల్లుల రారాజు
డస్‌ప్లెటొసరస్.. మనకు ఇప్పటిదాకా తెలిసిన రాక్షసబల్లుల్లో అతి భయంకరమైన టీ రెక్స్ (టైరనోసార్ రెక్స్)లో కొత్త జాతి. టీ రెక్స్‌ను కూడా తలదన్నేంతటి భారీ శరీరం, కళ్ల పక్కగా మొలుచుకొచ్చిన కొమ్ములతో భీతిగొలిపేలా ఉండేదట. రాక్షసబల్లులకు రాజుగా చెప్పదగ్గ ఈ జీవి 7.6 కోట్ల ఏళ్ల కింద ఉత్తర అమెరికాలో స్వేచ్ఛావిహారం చేసేదట. మోంటానాకు ఈశాన్య ప్రాంతంలో దొరికిన పుర్రెలు తదితరాల శిలాజాల ఆధారంగా దీని ఉనికిని సైంటిస్టులు తాజాగా నిర్ధారించారు. ఇది బహుశా టీ రెక్స్‌కు అత్యంత పూర్వీకురాలు అయ్యుండొచ్చని వారంటున్నారు. పాత, కొత్త టీ రెక్స్ జాతుల మధ్య దీన్ని మిస్సింగ్ లింక్‌గా అభివరి్ణస్తున్నారు. ఏకంగా 12 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తుండే టీ రెక్స్‌లు 6.8 కోట్ల నుంచి 6.6 కోట్ల ఏళ్ల క్రితం దాకా జీవించాయని చెబుతారు. -
అత్యంత అరుదైన పుర్రె.. వేలంలో ఏకంగా రూ. 162 కోట్లు
వేల సంవత్సరాల క్రితం డైనోసర్ అనే పెద్ద రాక్షస బల్లులు ఉండేవి అని కథలు కథలుగా విన్నాం. టెరన్నోసారస్ రెక్స్ అనే మరో డైనోసర్ జాతి గురించి మనం ఇంతవరకు వినలేదు కదా!. ఇది డైనోసర్‌లో అతి పెద్ధ సరీసృపం. వీటిని టీ రెక్స్‌గా వ్యవహరిస్తారు కూడా. ఇవి ఒకప్పుడూ ఉత్తర అమెరికాలో ఉండేవట. ఐతే వీటీని టెరన్నోసారస్ రెక్స్ అని ఎందుకంటారంటే..లాటిన్లో టీ రెక్స్ అంటే రాజు అని అర్థం. అతిపెద్ద థెరోపాడ్ డైనోసార్ జాతి కాబట్టి దీనిని ఆ పేరుతో వ్యవహరించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ టీ రెక్స్ పుర్రె ఒకటి తవ్వకాల్లో లభించింది. దీన్ని వేలం వేస్తే దాదాపు రూ. 162 కోట్లు వరకు పలుకుతుందంటున్నారు. వివరాల్లోకెళ్తే.....యూఎస్‌లోని దక్షిణ డకోటాలో టీ రెక్స్ డైనోసర్ పుర్రెని కనుగొన్నారు పరిశోధకలు. ఇదోక విలక్షణమైన పుర్రె అని చెబుతున్నారు. ఎలాంటి రసాయనాలతో దీన్ని సురక్షితంగా ఉంచకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ శిలాజం చెక్కు చెదరకుండా ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలికితీసిన పుర్రె ఆకారం ఉపరితలం చాలా వరకు పాడవ్వవకుండా ఉండేటేమే కాక, అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. ఈ పుర్రె సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్లపైన బరువు ఉండచ్చని చెబుతున్నారు. ఇది సుమారు 76 మిలియన్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ టైరన్నోసారస్ తన జాతిలో మరో టైరన్నోసారస్‌తో తలపడి ఉండవచ్చని, అందువల్లే దాని పుర్రెలో రెండు పంక్చర్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి జీవి పుర్రె తవ్వకాల్లో లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు. ఐతే ఈ జీవి పుర్రె చెక్కు చెదరలేదుగానీ అస్తిపంజరం చాలావరకు కోతకు గురైందని అన్నారు. ఈ పుర్రెని మాక్సిమస్‌గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది వేలంలో సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. (చదవండి: మహా సిగ్గరి కోసం అలుపెరగని ప్రయాణం.. చివరికి ఇలా ‘అద్భుతంగా’ చిక్కింది!) -
టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క
టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క.. దానికో సెపరేటు ఇంట్రడక్షన్ మస్టు. ఇప్పటివరకూ వచ్చిన ఏ డైనోసార్ సినిమా చూసినా దాని తర్వాతే మరెవరైనా.. అలాంటి టీ రెక్స్‌ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. అంటే.. డైరెక్ట్‌గా రాక్షసబల్లి అని కాదు.. దాని అస్థిపంజరం అన్నమాట. తొలిసారిగా ఆసియాలో ఇదిగో ఈ 43 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తు ఉన్న టీ రెక్స్‌ను వేలం వేయనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీ రెక్స్ అస్థిపంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకూ ప్రపంచంలో మరో రెండు టీ రెక్స్లను మాత్రమే వేలం వేశారట. చెప్పడం మరిచాం.. దీని పేరు షెన్ అట. ఏం చూసి ఆ పేరు పెట్టారని మాత్రం అడగకండి.. మాక్కూడా తెలియదు. మీరు గానీ.. దీన్ని కొనుక్కుంటే మీకు నచ్చినట్లుగా అప్పారావ్, సుబ్బారావ్ అని మార్చేసుకోవచ్చు. నవంబర్ 30న హాంకాంగ్‌లో దీన్ని వేలం వేస్తున్నారు. కొనాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఓ రూ.200 కోట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం ఆ మాత్రం ధర పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. విషయం అర్థమైందిగా..ఈ అస్థిపంజరం కొనాలంటే.. మన ఆస్తులు అమ్మితే సరిపోదు.. ఇరుగుపొరుగు, బంధుమిత్రుల ఆస్తులు కూడా అమ్ముకొని.. రంగంలోకి దిగాలన్నమాట. మరి రెడీనా..? చదవండి: అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా? -
ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి
కాల్సైట్ స్పటికాల సముహాలతో నిండి... ఫిరింగి పరిమాణంలో ఉన్న డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి చైనాలో అన్హుయ్ ప్రావిన్స్‌లోని కియాన్షాన్లో గుర్తించారు. ఇవి రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లని, క్రెటేషియస్ కాలం నాటివిగా పేర్కొన్నారు. అంతేగాదు ఇవి డైనోసార్ల యుగంలో చివరి కాలంనాటివిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లలోనే ఇవి ఒక కొత్త జాతిగా భావిస్తున్నారు. ఎందుకంటే గుడ్ల పరిమాణం, షెల్ యూనిట్, గట్టి అమరిక, ప్రత్యేకమైన గోళాకార ఆకృతి తదితరాలను బట్టి పాలియోంటాలజిస్టులు డైనోసార్లలో కొత్త జాతికి చెందినవిగా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ గుడ్లలో ఒకటి సరిగా సంరక్షించబడలేదని చెప్పారు. అందువల్లే వాటి అంతర్గత సముహాల్లో కాల్సైట్ స్పటికాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇవి దాదాపు గోళాకారంగా ఉండి, పొడవు 4.1 అంగుళాలు నుంచి 5.3 అంగుళాల మధ్య, వెడల్పు 3.8 అంగుళాల నుంచి 5.2 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ డైనోసార్లు చిన్నచిన్న మొక్కలను ఆహారంగా తినే బైపెడల్ డైనోసార్లగా శాస్తవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్ దృశ్యాలు వైరల్) -
డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు..
కొనుక్కోవాలి అనుకోవాలి గానీ.. మనం రాక్షసబల్లి అస్థిపంజరాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈ గార్గోసారస్ డైనోసార్ అస్థిపంజరాన్ని రూ.49 కోట్లకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. న్యూయార్క్‌లో సదబీస్ సంస్థ నిర్వహించిన వేలంలో అస్థిపంజరంతోపాటు దానికి పేరుపెట్టే హక్కులు కూడా ఆయనకు లభించాయి. ఇది 7.7 కోట్ల సంవత్సరాల కిందటిదట. ఈ డైనోసార్ 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుంది. ఓ డైనోసార్ అస్థిపంజరం ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవ్వడం ఇదే తొలిసారట. అది బతికున్నప్పుడు రెండు టన్నుల బరువు ఉండొచ్చని అంచనా. -
భారత్‌లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు!
భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు. ఓవమ్ ఇన్ ఓవో.. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే. -
నేలపైనా.. నీటిలోనా.. దబిడిదిబిడే..
రాక్షసబల్లులు అనగానే.. మనకు గుర్తుకొచ్చేది.. జురాసిక్ పార్క్ సినిమా.. అందులోని ఫేమస్ టీ–రెక్స్ డైనోసార్.. ఇది దాన్ని మించినది.. పేరు స్పైనోసారస్. వేటాడే రాక్షసబల్లుల్లో అతి పెద్దది ఇదే. మామూలుగా ఉండదు.. 60 అడుగుల ఎత్తుతో వీపు మీద భారీ రెక్క ఒకటి తగిలించినట్లు అరివీర భయంకరంగా ఉంటుంది. జురాసిక్ పార్క్–3 సినిమాలో టీరెక్స్కి దీనికి ఫైట్ కూడా ఉంటుంది. ఇంతకీ విషయమేమిటంటే.. ఇంతకాలం ఇది ఎలా వేటాడుతుందన్న విషయంపై శాస్త్రవేత్తల్లో రకరకాల అంచనాలు ఉన్నాయి.. ఇప్పుడు దానిపై ఓ క్లారిటీ వచ్చింది.. అదేంటి అన్నది తెలుసుకుందామా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ఇది నీటిలో ఈదగలదని.. నేలపైనా.. నీటిలోనా వేటాడగలదని కొందరు శాస్త్రవేత్తలు చెబితే.. కాదు కాదు.. కొంగ నీటిలోని చేపలను ఎలా పట్టుకుంటుందో.. దీని వేట కూడా అలాగే ఉంటుందని మరికొందరు అంచనా వేశారు. దీనిపై కొన్నాళ్లుగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నా యి. తాజాగా షికాగో, ఇల్లినాయి మ్యూజియాల్లోని పరిశోధకులు మొసలి, హిప్పొపొటమస్, పెంగ్విన్ లాంటి వాటితో, 2014లో బయటపడిన స్పినోసారస్ శిలాజాన్ని పోల్చిచూశారు. అధ్యయనం తర్వాత ఇది నీటిలో వేటాడగలదని తేల్చారు. ప్రొఫెసర్ మాటియో ఫాబ్రీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన సాగింది. ఈదగలదు ఇలా...: స్పినోసారస్.. ఎముకల సాంద్రత(ధృడత్వం) ఎక్కువగా ఉండటంతో ఈదుకుంటూ నీటి లోపలికి కూడా వెళ్లగలవు. మామూలుగా డైనోసార్లకు పొడవైన, మొసలిలాంటి దవడలు, కోన్ ఆకారపు దంతాలుంటాయి. కానీ స్పినోసారస్ సముద్ర జీవుల్లా నాసికా రంధ్రాలు, పొట్టి వెనుక కాళ్లు, తెడ్డు లాంటి పాదాలు, రెక్కలాంటి తోక ఉండటం ఈతకు సాయపడుతుంది. అయితే మారుతున్న వాతావరణం భారీ సరీసృపాల ఆహార గొలుసును నాశనం చేయడంతో ఈ డైనోసార్లు అంతరించి ఉండవచ్చని అధ్యయనం అభిప్రాయపడింది. -
పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!
బీజింగ్: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ప్రస్తుతం లభించిన డైనోసార్ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ ఫియాన్వైసుమ్ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్‌లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్ ఐసైన్స్లో ప్రచురించారు. బేబీ ఇంగ్లియాంగ్ విశేషాలు ► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు. ► జాతి: ఒవిరాప్టోరోసారస్(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం) ► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే) ► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు. ► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా). -
డైనోసార్ల అంతానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే!
విషయం ఎలాంటిదైనా తనకు లాభం చేకూరేది అయితే చాలానుకునే తత్వం ఎలన్ మస్క్‌ది. ఈ అపరకుబేరుడు స్పేస్ఎక్స్ కోసం అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డార్ట్ ప్రయోగంపై స్పందించాడు. భూగ్రహం వైపు దూసుకొస్తున్న అతిపెద్ద ఆస్టరాయిడ్ ఒకదానిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీకొట్టించాలన్న ప్రయత్నమే డార్ట్. భారత కాలమాన ప్రకారం.. బుధవారం ఉదయం ఎలన్ మస్క్ Elon musk కే చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్9 రాకెట్ ద్వారా స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపించింది నాసా. అయితే ఈ ప్రయోగంపై మస్క్ తన స్టయిల్లో స్పందించాడు. Avenge the dinosaurs!! https://t.co/knL2pFLGzF — Elon Musk (@elonmusk) November 25, 2021 ‘డైనోసార్ల ప్రతీకారం తీర్చుకోండి’ అంటూ నాసా ట్వీట్‌కు బదులిచ్చాడు ఎలన్ మస్క్. బిలియన్ల సంవత్సరాల క్రితం మెసోజోయిక్ Mesozoic Era యుగంలో ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టి డైనోసార్లు అంతరించిన విషయం తెలిసిందే కదా!. ఇప్పుడు ఆస్టరాయిడ్లను నాశనం చేసి డైనోసార్లకు బదులు ప్రతీకారం తీర్చుకోండనే ఉద్దేశంతో మస్క్ ట్వీటేశాడన్నమాట. ఈ ట్వీట్‌కు మస్క్ ఫాలోవర్స్ నుంచి హ్యూమర్‌తో కూడిన రిప్లైలు వస్తున్నాయి. చదవండి: రష్యా ఉల్కాపాత వినాశనం గుర్తుందా?.. డార్ట్ అందుకే! ఇదిలా ఉంటే డార్ట్ తన పని పూర్తి చేయడానికి ఏడాది.. అంతకంటే ఎక్కువ టైం పట్టొచ్చు. ఒకవేళ అనుకున్నట్లు ఆస్టరాయిడ్ గనుక నాశనం అయితే.. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్లను, ఉల్కలను డార్ట్ లాంటి మరిన్ని ప్రయోగాలతో దారి మళ్లించడమో, నాశనం చేయడమో చేస్తుంది నాసా. చదవండి: పిరికి డైనోసార్లు.. పక్కా వెజిటేరియన్! -
పిరికి డైనోసార్లు.. ఎలా బతికేవో తెలుసా?
Patagonian fossils show Jurassic dinosaur had herd mentality: డైనోసార్ల ఉనికి.. మనుగడ కాలంపై నిర్ధారణ కోసం పరిశోధనలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. అర్జెంటీనా దక్షిణ భాగంలోని పటగోనియా రీజియన్‌లో దొరికిన వివిధ జాతుల డైనోసార్ల శిలాజాల్ని.. ఈ భూమ్మీద అత్యంత ప్రాచీన సాక్ష్యాలుగా పరిగణిస్తుంటారు. అయితే వీటి ఆధారంగా డైనోసార్లు బతికిన విధానంపై సైంటిస్టులు ఇప్పుడొక అంచనాకి వచ్చారు. గురువారం ఈ మేరకు సైంటిస్టుల పరిశోధనకు సంబంధించిన కథనం.. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. వందకి పైగా గుడ్లు, 20కిపైగా భారీ డైనోసార్లు, 80 పిల్ల డైనోసార్ల అవశేషాల ఆధారంగా.. డైనోసార్లు గుంపులుగా కలిసి బతికేవని అంచనాకి వచ్చారు. సుమారు 193 మిలియన్ సంవత్సరాల కిందట వీటి మనుగడ కొనసాగి ఉంటుందని భావిస్తున్నారు. ముస్సావురస్(సావ్రోపోడోమార్ఫ్ జాతి) డైనోసార్లు 20 అడుగుల ఎత్తు, టన్నున్నర బరువు పెరుగుతాయి. ఈ డైనోసార్ జాతి ఇక్కడి సముహంలో బతికినట్లు భావిస్తున్నారు. వీటికి పొడవైన మెడ.. తోక, స్తంభాల్లాంటి కాళ్లు ఉంటాయి వీటికి. ఇవి పూర్తి శాఖాహారులు. గుత్తగంపగా ఇవి అన్నీ కలిసి గుడ్లు పెట్టడం విశేషం. కందకాల్లో పొరలు పొరలుగా ఆడ డైనోసార్లు పెట్టిన గుడ్ల(పిండం అభివృద్ధి చెందిన దశలో)ను పరిశోధకులు సేకరించారు. ఇక భారీ డైనోసార్ల శిలాజాలు విడి విడిగా లభించగా.. పిల్ల డైనోసార్ల శిలాజాలు మాత్రం గుంపుగా ఒకే దగ్గర దొరికాయి. మట్టి దిబ్బల నుంచి ఈ డైనోసార్ల అవశేషాలను సేకరించారు. కరువు వల్లే ఇవన్నీ సామూహికంగా అంతం అయ్యి ఉంటాయని, ఆపై ఇసుక తుపాన్లు వీటి కళేబరాలను ముంచెత్తి ఉంటాయని భావిస్తున్నారు. అయితే ముస్సావురస్ చాలా పిరికివని, దాడి చేసే సత్తా కూడా ఉండేవి కావేమోనని, శత్రువుల(రాకాసి డైనోసార్ల) నుంచి తమను తాము కాపాడుకునేందుకే గుంపులుగా తిరిగేవని, పిల్ల డైనోసార్లనూ మధ్యలో ఉంచుకుని గుంపులుగా రక్షించుకునేవని నిర్ధారణకు వచ్చారు. హై రెజల్యూషన్ ఎక్స్‌రే.. (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) ఆధారంగా వీటిని స్కాన్ చేసి ముస్సావురస్ డైనోసార్ల జీవన విధానంపై ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే పటాగోనియాలోనే Argentinosaurus ఆర్జెంటినోసారస్ను భూమ్మీద అత్యంత భారీ డైనోసార్‌గా(ఈ భూమ్మీద అత్యంత పెద్ద ప్రాణిగా) భావిస్తుంటారు. 118 ఫీట్ల ఎత్తు, 70 టన్నుల బరువు ఉండేదని వాటి శిలాజాల ఆధారంగా నిర్దారించుకున్నారు. ఇవి మాత్రం పక్కా మాంసాహారులని సదరు జర్నల్‌లో కథనం ఉంది. చదవండి: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి గురించి తెలుసా? -
గూగుల్‌లో ఈ బుల్లి డైనోసార్ ఎలా పుట్టిందో తెలుసా?
గూగుల్‌లో కనిపించే బ్రౌజర్ గేమ్ ‘డైనోసార్’ తెలుసు కదా. ఇంటర్నెట్ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్‌కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త అప్డేట్ ఏంటంటే.. ఒలింపిక్స్ మినీ గేమ్స్. సాక్షి, వెబ్‌డెస్క్: అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్. స్పేస్ బార్‌తో ఈ గేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్‌ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్‌కు ఒలింపిక్స్ గేమ్స్ తరహా ఫీచర్స్‌ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్(డైనోసార్), ఒలింపిక్స్ మినీ గేమ్స్, ఒలింపిక్ ఫ్లేమ్, రింగులు, మెడల్స్.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్ కంటే ముందే ఓ రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని గుర్తించి అప్డేట్ ఇవ్వడం విశేషం. Might need to work on my surfing skills 🌊 chrome://dino/ pic.twitter.com/OqDn3RHLGg — Sundar Pichai (@sundarpichai) July 23, 2021 అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్ గాబ్రియల్ ఆలోచన నుంచి పుట్టింది ఇది. 2014లో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్ డిజైనర్ డైనోసార్ గేమ్‌ను లాంఛ్ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ టీ రెక్స్ పేరు మీద ఈ గేమ్‌ను రూపొందించాడు సెబాస్టియన్. మొదట్లో ప్రాజెక్ట్ బోలన్ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్ బోలన్ ఎవరంటే.. టీ-రెక్స్ లీడ్ సింగర్. 2014 సెప్టెంబర్‌లో ఈ గేమ్ రిలీజ్ కాగా..పాత డివైజ్‌లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్లో అప్డేట్ వెర్షన్‌తో రీ-రిలీజ్ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్‌ను ఆడుతుంటారని గూగుల్ చెబుతోంది. తర్వాతి కాలంలో గేమ్‌కు అప్డేట్స్ రాగా.. డినో స్వార్డ్స్ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్‌ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్‌కు తగిలించుకుని ఆడే వీలుంది. తాజా ఒలింపిక్స్ అప్డేట్ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌కి వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. టీ-రెక్స్ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్ లైన్ లక్క్ష్యంగా గేమ్ భలేగా ఉందని సదరు రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్ మాగ్జిమమ్ పాయింట్లు 99999 రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్ వేగం శరవేగంగా ఉంటుంది. -
Dinosaur: డైనోసార్ వెంట పడితే?
ఓ పేద్ద డైనోసార్ వెంటపడుతోంది.. ముందు జీపులో ముగ్గురు వ్యక్తులు.. స్పీడుగా పోనీయ్ అంటూ భయంతో అరుస్తున్నారు.. డైనోసార్ ఇంకా వేగంగా దగ్గరికి వచ్చేసింది.. నోరు తెరిచి జీపులోని ఒకరిని అందుకోబోయింది.. సరిగ్గా అప్పుడే జీపు వేగం పెరిగింది.. వారు డైనోసార్ నుంచి తప్పించుకున్నారు. జురాసిక్ పార్క్–1 సినిమాలోని ఒళ్లు గగుర్పొడిచే సీన్ ఇది. అంతసేపూ ఊపిరిబిగబట్టి చూస్తున్న మనం కూడా ఒక్కసారిగా హమ్మయ్య అని రిలాక్స్ అవుతాం. ఆ సీన్లో జీపు వెంటపడే డైనోసార్ టి–రెక్స్. డైనోసార్లలో అన్నింటికన్నా ప్రమాదకరమైనది అది. మరి ఇప్పుడు నిజంగానే ఓ పెద్ద టీ–రెక్స్ కనిపించి మన వెంట పడిందనుకోండి. అప్పుడెట్లా.. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సినిమాలో టి–రెక్స్ అలా వేగంగా జీపు వెంటపడినట్టు చూపించారుగానీ.. నిజానికి ఆ డైనోసార్ అంత వేగంగా పరుగెత్తలేదట. అది నడిచే వేగం మహా అయితే గంటకు 4.5 కిలోమీటర్ల వరకే ఉంటుందట. అంటే మనుషులు కాస్త వేగంగా నడవడంతో సమానం అన్న మాటే. ఒకవేళ దానికి మరీ కోపం వచ్చి మన వెంట పడినా గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు అంతకన్నా వేగంగా పరుగెత్తగలరని అంటున్నారు. డైనోసార్ అస్థి పంజరంపై పరిశోధనతో అమెరికాలోని మోంటానా స్టేట్‌లో 2013లో ఒక డైనోసార్ పూర్తి శిలాజాన్ని గుర్తించారు. 13 మీటర్ల పొడవు, సుమారు 6 టన్నుల బరువైన ఆ ఆడ టి–రెక్స్ అస్థి పంజరంపై నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ డైనోసార్ తోక ఒక్కటే సుమారు వెయ్యి కిలోల బరువు ఉండి ఉంటుందని, డైనోసార్ నడిచినప్పుడు అది పైకి, కిందికి ఊగుతుందని తేల్చారు. దాని మొత్తం శరీరం, తోక, బరువు ఆధారంగా పరిశీలించి.. టి–రెక్స్ గంటకు 2.8 మైళ్లు (4.5 కిలోమీటర్ల) వేగంతో కదిలేదని నిర్ధారించారు. ఈ లెక్కన మనుషులు కాస్త వేగంగా పరుగెడితే టి–రెక్స్ నుంచి తప్పించుకోవచ్చన్న మాట. అయితే కథ అప్పుడే అయిపోలేదు. తోడేళ్లలా.. గుంపుగా.. టి–రెక్స్ మెల్లగా కదిలినా దాని నుంచి తప్పించుకోవడం కష్టమేనట. టి–రెక్స్‌లు మనం ఊహించినదాని కంటే మరింత ప్రమాదకరమైనవని.. అవి తోడేళ్లలాగా గుంపులుగా మాటేసి, వేటాడేవని అమెరికాలోని సదరన్ ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2014లో అమెరికాలో ఒకే చోట పెద్ద సంఖ్యలో డైనోసార్ల శిలాజాలను కనుగొన్నారు. దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. అక్కడ డైనోసార్లతోపాటు తాబేళ్లు, మొసళ్లు, చేపల శిలాజాలను కూడా గుర్తించారు. డైనోసార్లు గుంపులుగా వేటాడి, ఆహారాన్ని పంచుకు తినేవని తేల్చారు. -
అతిపెద్ద డైనోసార్ శిలాజం
మానవ ఆవిర్భావానికి కొన్ని వేల సంవత్సరాల ముందు భూమిపై రాక్షస బల్లుల పెత్తనం కొనసాగింది. శతాబ్దాలు కొనసాగిన ఈ డైనోసార్ల డామినేషన్‌కు ఆకస్మికంగా భూమిపై విరుచుకుపడ్డ ఉల్కాపాతం చెక్ పెట్టింది. డైనోసార్లు పూర్తిగా అంతరించిన వేల సంవత్సరాలకు భూమిపై మనిషి ఆధిపత్యం మొదలైంది. సైన్సు పురోగతి సాధించేకొద్దీ రాక్షసబల్లులపై పరిశోధనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో వీటి శిలాజాలు వెలికి తీయడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద డైనోసార్ శిలాజాన్ని వెలికి తీశారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ శిలాజం అర్జెంటీనాలో లభించింది. సౌరోపాడ్ గ్రూప్‌నకు చెందిన డైనోసార్‌కు చెందిన ఈ శిలాజ ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయి. ఇప్పటివరకు పటగొటియన్ మయోరమ్ అనే డైనోసార్‌నే అతిపెద్ద డైనోసార్‌గా భావించారు. కానీ తాజా శిలాజం ఎముకలు ఈ పటగొటియన్ కన్నా 10– 20 శాతం పెద్దవిగా ఉన్నాయని సీటీవైఎస్ సైంటిఫిక్ ఏజెన్సీ తెలిపింది. సౌరోపాడ్ గ్రూప్ డైనోసార్లు పెద్ద శరీరంతో, పొడవైన మెడ, తోకతో తిరిగేవి. ఇవి శాకాహారులు. భూమిపై ఇంతవరకు జీవించిన ప్రాణుల్లో ఇవే అతిపెద్దవి. వీటిలో పటగొటియన్ 70 టన్నుల బరువు, 131 అడుగుల పొడవు ఉండేది. తాజా శిలాజం ఏ డైనోసార్‌కు చెందిందో ఇంకా గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు కొన్ని శరీరభాగాలకు చెందిన ఎముకలు మాత్రమే వెలికి తీయడం జరిగింది. పూర్తిగా వెలికితీత పూర్తయి డైనోసార్‌ను గుర్తించేందుకు మరికొన్నేళ్లు పడుతుందని శిలాజ శాస్త్రవేత్త జోస్ లూయిస్ కార్బల్లిడో అభిప్రాయపడ్డారు. -
నేనొక డైనోసర్‌ను చూశాను: అనుష్క
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి డైనోసర్గా మారాడు. కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని టోర్నీలు రద్దవ్వడం, వాయిదాపడటంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో లాక్డౌన్ రూపంలో ఊహించని విరామాన్ని కోహ్లి తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు విరుష్కలు. తాజాగా అనుష్క తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. డైనోసర్లగా కోహ్లి నడుస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘నేను డైనోసర్‌ను గుర్తించాను’ అంటూ కామెంట్ జతచేసింది. ఇక ఈ వీడియోకు కోహ్లి ఫ్యాన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘కోహ్లి అచ్చం డైనోసర్‌లా నడిచావ్’ అని ఓ అభిమాని సరదాగా కామెంట్ చేశాడు. ఇక అంతకుముందు జిమ్‌లో కోహ్లి వర్కౌట్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఆ జంప్... ఆహా! టి20 వరల్డ్ కప్ వాయిదా పడితేనే... View this post on Instagram Earn it. Don't demand it. A post shared by Virat Kohli (@virat.kohli) on May 19, 2020 at 8:36am PDT -
సారూ.. ఇది డైనోసారూ...
పెద్దఅంబర్‌పేట: దేశంలోనే మొట్టమొదటి డైనోసార్ పార్కుకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండరావిరాల గ్రామం వేదికైంది. ‘డైనో వరల్డ్’పేరుతో వినూత్నంగా వివిధ రకాల డైనోసార్ బొమ్మలను ఇక్కడ తీర్చిదిద్దారు. బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పార్కులోని డైనోసార్ బొమ్మలను పరిశీలించి వాటి పనితీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన డైనో వరల్డ్ ఎంతో బాగుందని కితాబిచ్చారు. పార్కుకు పర్యాటకశాఖ నుంచి ప్రత్యేక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకశాఖ వెబ్సైట్లో పార్కు వివరాలను పొందుపరుస్తామని వివరించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో డైనో పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ నాలుగు ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారని, ఇదే తరహాలోనే మరో పార్కును మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఆసక్తి కనబరిస్తే స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందుతూ ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కును కొనసాగించాలని సూచించారు. వినోదం, విజ్ఞానం అందించాలనే.. చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో వినూత్నంగా పార్కును తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు సుశాంక్, ప్రశాంత్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు పార్కులోకి అనుమతిస్తామని, ప్రవేశ రుసుం రూ. 300 అని చెప్పారు. త్వరలోనే రిసార్ట్స్, మల్టీథీమ్ పార్కును ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వంగేటి లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తరకం డైనోసార్ అస్థిపంజరం గుర్తింపు!
టాంజానియా : డైనోసార్ల గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. వేల ఏళ్ల కిందట అంతరించి పోయిన ఈ జీవులపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలో మరో కొత్త జాతి డైనోసార్ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక భాగాల్లో గుండె ఆకారంలో ఎముక ఉండడం ఈ డైనోసార్ల ప్రత్యేకత. టైటనోసారస్ జాతికి ఈ చెందిన ఈ డైనోసార్ శిలాజాన్ని టాంజానియాలోని మొటుకా నది సమీపంలో ఉన్న ఓ క్వారీలో గుర్తించినట్లు మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. పొడవైన మెడ, 70 టన్నుల బరువుతో ఉండే ఈ డైనోసార్లు నాలుగు కాళ్లపై నడిచేవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట క్రిటేషియస్ శకంలో అంతరించిపోయిన డైనోసార్లలో ఇవీ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా తోక భాగంలో గుండె ఆకారంలోని ఎముకతో కూడిన రాక్షసి బల్లులు అరుదని, కానీ తాము కనుగొన్న డైనోసార్ అస్థిపంజరం తమ అంచనాలను మార్చిందని ఈ పరిశోధకులు అంటున్నారు. పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇవి మాంసాహారులా కాదా అనే విషయం తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
జురాసిక్ పార్క్ ఐదో సీక్వెల్ వస్తోంది!
సాక్షి సినిమా: హాలీవుడ్ చిత్రాల్లో భారతీయ సినీ ప్రేక్షకులను అధికంగా అలరించిన అతి కొద్ది చిత్రాల్లో జురాసిక్ పార్క్ నమోదు అవుతుందని ప్రత్కేకంగా చెప్పనవసరం లేదు. ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలు జురాసిక్‌పార్క్ సిరీస్. పార్క్ అనే నవల ఆధారంగా 1993లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ తెరపై ఆవిష్కరించిన వండర్ జురాసిక్‌పార్క్ చిత్రం. ప్రపంచ స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లా నుప్లర్ అనే ఒక కల్పన దీవిలో డైనోసర్ అనే ఒక వింత జాతికి జంతువు అరాజకాల ఇతివృత్తంగా తెరకెక్కిన ఆ చిత్రానికి ఆ తరువాత ది లాస్ట్ వరల్డ్ పేరుతో 1997లోనూ, జురాసిక్ పార్క్ 3 పేరుతో 2001లోనూ, జురాసిక్ వరల్డ్ పేరుతో2015లోనూ అదే స్టీవెన్ స్పీల్బెర్గ్ వరుసగా సీక్వెల్స్‌ను రూపొందించారు. తాజాగా జురాసిక్‌పార్క్– ఫాలెన్కింగ్డమ్ పేరుతో ఐదవ సీక్వెల్‌ను తెరకెక్కించిన చిత్రం జూన్‌న్7న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. అదే డైనోసర్ విలనిజాలను మరో కొత్త కోణంలో తెరపై దర్శకుడు ఆవిష్కరించారట. 1993 నుంచి జురాసిక్ పార్క్ సిరీస్‌లోనూ నటించిన జెఫ్ కోల్ట్ప్లమ్ ఈ జురాసిక్‌పార్క్–ఫాలెన్ కింగ్డమ్ చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. ఈ చిత్రంపై అంచనాలు భారి స్థాయిలో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం.ఆంగ్లం భాషల్లో యూనివర్శల్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. -
ట్రంప్‌పై నటి తీవ్ర వ్యాఖ్యలు
న్యూయార్క్: ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి హెలెన్ మిరెన్.. అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె ట్రంప్‌ను డైనోసర్ (రాక్షసబల్లి)గా అభివర్ణించింది. హెలెన్ నటించిన తాజాచిత్రం 'ఐ ఇన్ ద స్కై' ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే డైనోసర్లు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే కొన్ని పాత డైనోసర్లు మిగిలిపోయాయి. వాటిలో ట్రంప్ ఒకడు' అని చెప్పింది. ట్రంప్ ఫిజిక్ కూడా డైనోసర్ మాదిరిగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది. డైనోసర్లాగా ట్రంప్ భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉంటాయని హెలెన్ చెప్పింది. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు హెలెన్ మద్దతు తెలిపింది. హిల్లరీ కోసం ఇటీవల విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంది. -
డైనోసార్‌తో ఆటాపాటా!
డైనోసార్‌తో శ్రుతీహాసన్ ఆడి, పాడబోతున్నారు. ఈ బ్యూటీకి ధైర్యం ఎక్కువ అనుకుంటున్నారా? అసలు కథ ఏంటంటే... డైనోసార్ పైల్ అప్ అనే రాక్‌బ్యాండ్‌తో కలిసి శ్రుతి ఓ ఆల్బమ్ తయారు చేయనున్నారు. నటిస్తూనే అడపాదడపా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌కి పాడడం ఆమెకి అలవాటే. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం ఎహ్సాన్-లాయ్‌తో కలిసి ఆమె ఓ ఆల్బమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా లండన్‌కు చెందిన ‘డైనోసార్ పైల్ అప్’ అనే రాక్‌బ్యాండ్‌తో కలిసి మళ్లీ ఓ కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌ను స్వరపరచనున్నారు. లిరిక్స్ రాయడా నికి కూడా తన వంతు సహకారం అందిస్తున్నారట. ఈ ఆల్బమ్ పని మీద లండన్‌కు రెండు, మూడు సార్లు వెళ్లి వచ్చారట. ఒక వైపు సినిమాలూ మరోవైపు ఈ ఆల్బమ్‌తో శ్రుతి ఫుల్ బిజీ.