అమరావతి: జిల్లాలో డైనోసార్ (రాక్షసబల్లి) అవశేషాలు లభ్యమయ్యాయి. అమరావతికి 60 కిలోమీటర్ల దూరంలోని సల్‌బర్డి ప్రాంతంలో శిలాజాలుగా మారిన ఎముకలు, గుడ్లు దొరికాయి. ఈ విషయాన్ని భూగర్భ శాస్త్రవేత్త శనివారం వెల్లడించారు. ఎ.కె.శ్రీవాస్తవ, ఆయన వద్ద డాక్టరేట్ చేస్తున్న ఆర్.ఎస్.మాన్కర్‌ల నేతృత్వంలోని బృందం ఆరేళ్లుగా జరుపు తున్న అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఈ విషయమై మాన్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇవి అవక్షేప రాళ్లలో దొరికాయన్నా రు.
ఈ అవశేషాలు 66 నుంచి 71 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి కావొచ ్చని భావిస్తున్నామన్నారు. ఆ కాలంలో డైనోసార్లు, టైటానోసారస్ కోల్బర్టిలు... సౌర్‌పోడ్ కుటుంబానికి చెందినవన్నారు. ఈ ప్రాంతంలో ఇవి సంచరించేవని, ఇక్కడే గుడ్లు పెట్టాయన్నారు. డైనోసార్ అవశేషాలు ప్రస్తుతం చిన్న చిన్న ముక్కల రూపంలో ఉన్నాయన్నారు. ఇవి రాళ్లలో చిక్కుకుపోయి ఉన్నాయని, అందువల్ల వాటిని అక్కడినుంచి తీయలేమన్నారు. టైటానోసారస్ కొల్బర్టి అనేది భారీ శాఖాహార జంతువని, ఇది 18 నుంచి 20 మీటర్ల పొడవు, 13 టన్నుల బరువు ఉంటుందన్నారు. డైనోసోర్ అవశేషాలు అంతకుముందు రాష్ర్టంలోని నాగపూర్, చంద్రపూర్‌లలోనూ కనిపించాయన్నారు.
డైనోసార్ అవశేషాలు లభ్యం
Published Sun, Oct 20 2013 12:51 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM
Advertisement
Advertisement