Geologist
-
తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!
సాక్షి, హైదరాబాద్: భూమ్మీద క్షీరదాల (పాలిచ్చి పెంచే జీవుల) ఉనికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. అవి తొలుత ఎక్కడ పుట్టాయి? ఎక్కడెక్కడ తిరిగాయి? అనేదానిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అలా ఇప్పటివరకు ఎక్కడో అర్జెంటీనాలో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు దొరకగా.. ఆ తర్వాత మన దేశంలో మన రాష్ట్రంలోనే వాటి గుట్టు బయటపడింది. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో పరిగి మండలం పరిధిలోని నష్కల్‌లో తొలినాళ్ల క్షీరదాల ఆధారాలు లభించాయి. అమెరికా కేంద్రంగా వెలువడే ప్రఖ్యాత సైన్స్ జర్నల్ పేలియోజియోగ్రఫీ, పేలియోక్‌లైమటాలజీ, పేలియోఎకాలజీ (పేలియో3) ఈ వివరాలను తమ ఆన్లైన్ జర్నల్స్‌లో ప్రచురించింది. ఏప్రిల్‌లో ముద్రణగా దీన్ని ప్రచురించనుంది. తొలినాళ్ల క్షీరదాలేమిటి..? కోట్ల ఏళ్ల కింద భూమిపై రాక్షస బల్లులు, ఇతర సరీసృపాలదే రాజ్యం. ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం అవి అంతరించిపోయాయి. ఆ సమయంలోనే క్షీరదాల (పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులు) ఉనికి మొదలైంది. చిన్నగా ఎలుకల పరిమాణంలో ఉండే క్షీరదాలు కలుగుల్లో, చెట్ల పొదల్లో మనుగడ సాగించాయి. డైనోసార్లు అంతమయ్యాక వాటికి శత్రువులు తగ్గి.. పరిణామం చెందాయి. ఇప్పుడున్న చాలా రకాల జంతువులుగా మారాయి. నాటి తొలితరం క్షీరదాల ఆధారాలు మొదట్లో అర్జెంటీనా దేశంలో వెలుగు చూశాయి. చాలా ఏళ్లపాటు ప్రపంచానికి ఆ వివరా లే దిక్కయ్యాయి. తర్వాత మన నష్కల్ ప్రాంతంలో ఆధారాలు బయటపడ్డాయి. స్వాతంత్య్రానికి పూ ర్వం 1930 దశాబ్దంలో ప్రఖ్యాత జియాలజిస్టు శర్మ.. ఈ ప్రాంతంలో రాక్షస బల్లుల శిలాజాలతోపాటు ఇతర జీవుల జాడలు గుర్తించారు. చదవండి: (మీకు తెలుసా: కర్ర ముక్కలే.. కార్లను నడిపించేవి..) తర్వాత 1970ల్లో ఎన్‌వీబీఎస్ దత్త మరికొన్నింటిని గుర్తించారు. ఇలా నష్కల్, దానికి చేరువలో ఉన్న బసిరెడ్డిపల్లి, రంగాపూర్ మధ్య జీవ మహాయుగం (మోసోజోయిక్ పీరియడ్) నాటి జీవ పరిణామానికి సాక్ష్యంగా నిలిచాయి. ఈ క్రమంలో 1980ల్లో సహానీ, జీవీఆర్ ప్రసాద్‌ల బృందం తొలిసారి పురాతన క్షీరదాల ఆధారాలు సేకరించింది. ఆ వివరాలు ఇప్పటికే ప్రఖ్యాత సైన్స్ జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి. ఇక 1990 దశకంలో ప్రఖ్యాత జి యాలజిస్టు అనంతరామన్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. నష్కల్ ప్రాంతంలో విస్తృతంగా పరిశోధన చేసి.. పురాతన సూక్ష్మ క్షీరదాలకు చెందిన దంత శిలాజాలను సేకరించింది. వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి.. అవి డైనోసార్లు అంతరించే కాలానికి చెందిన, తొలితరం క్షీరదాలని తేల్చింది. ఈ వివరాలు అంతర్జాతీయ సైన్స్ జర్నల్ పేలియో3లో ప్రచురితం అవుతున్నాయి. ఎంతో తృప్తినిచ్చింది తొలితరం క్షీరదం జాడకు సంబంధించి నష్కల్ ప్రాంతంలో ఆధారాలు దొరికాయి. ఇక్కడ చేసిన పరిశోధన ఎంతో తృప్తినిచ్చింది. మరింత పరిశోధన చేస్తే ఎన్నో రహస్యాలకు సమాధానం చెప్పే ఆధారాలు దొరకవచ్చు. – అనంతరామన్, పరిశోధన బృందం సభ్యుడు గొప్ప పరిశోధనకు గొప్ప గుర్తింపు నష్కల్ ప్రాంతం ఎన్నో జియోలాజికల్ రహస్యాలను ఛేదించే ఆధారాలకు కేంద్రం. క్షీరదాల పుట్టుక ఆధారాలు మొదట్లో అర్జెంటీనాలోనే వెలుగుచూశాయి. మన దేశంలో తొలి సారి నష్కల్‌లోనే బయటపడ్డాయి. ఇక్కడ తొలితరం క్షీరదాల దవడ శిలాజాలు సేకరిం చాం. వాటిపై అనంతరామన్ బృందం విస్తృత పరిశోధన చేసింది. ఈ వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురితమవడం సంతోషం. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
సముద్రంలో స్వల్ప భూకంపం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. శనివారం మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాకు 121 కి.మీ. దూరంలోను, ఒడిషాకు 161 కి.మీ., పూరీకి 230 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు తెలిపారు. అయితే.. భూమికి 100 కి.మీ. లోతులో ఈ ప్రకంపనలు రావడంతో పెద్దగా ప్రభావం చూపలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. భూ అంతర్భాగంలో శిలల మధ్య జరిగిన సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు జియాలజీ విభాగ నిపుణులు చెబుతున్నారు. -
ఈ అభివృద్ధి విధ్వంసానికి బాట
కేదార్‌నాథ్‌లో 2013 సంవత్సరం వరదల విలయతాండవం చోటుచేసుకున్న తర్వాత, 11 వేల అడుగుల కంటే ఎత్తులో ఉన్న పూడిపోయిన ఆలయ గర్భగుడి పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు. సుప్రసిద్ధ భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్ నవీన్ జుయల్ ఆలయ పునర్మిర్మాణంపై తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో భారీ నిర్మాణం, పెద్దమొత్తంలో సిమెంట్ లేక ఇనుమును ఉపయోగిస్తే కేదార్నాథ్ పరిసరాల్లో భవిష్యత్తులో మరిన్ని విపత్తులు చెలరేగుతాయని హెచ్చరించారు. వేసవిలో మంచు కరిగేటప్పుడు భూ ఉపరితలానికి పైనున్న నేల కిందికి జారిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కానీ పర్యావరణ హెచ్చరికలపై, శాస్త్రీయ వాదనలపై దృష్టి సారించడానికి బదులుగా ఎన్నికల్లో గెలుపు కోసం పరుగుపందెమే ఇప్పుడు ముఖ్యమవుతోంది. కేదార్‌నాథ్‌లో డాక్టర్ జుయల్, ఇతర నిపుణులు పర్యటనలు ప్రారంభిస్తున్నప్పుడు, కేదార్నాథ్, ఉత్తరాఖండ్ కొండల చుట్టూ వెల్లువగా ప్రకృతి విపత్తుల ఘటనలు పెరుగుతూ వచ్చాయి. అక్కడ నిర్మాణపనులు పెరిగినప్పుడే విపత్తులు కూడా పెరగడం కాకతాళీయంగా కొట్టిపారేయలేం. ఈ ఒక్క ఏడాదిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తుల కారణంగా 250 మంది ప్రజలు చనిపోయారు. పైగా ఇవి కలిగించిన ఆర్థిక నష్టాలు తక్కువేమీ కాదు. (చదవండి: ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!) కేదార్నాథ్ ప్రాంతంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టూ జాతీయ భద్రతతో, మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంది. ఈ నెల మొదట్లో కేదార్నాథ్ పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ ‘పర్వతాల్లో నీళ్లు, పర్వతాల్లో యువత’ అనే పాత సామెతను ఉపయోగించారు. తన ప్రభుత్వం ఈ రెండింటినీ (నీరు, యువత) అభివృద్ధి పథకాలతో కాపాడటానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే జీవితాలను నిలబెట్టడానికి బదులుగా పర్వతాల్లోని నీరు వేగంగా నిర్మించిన డ్యాముల్లో ఇరుక్కుపోయి ఉంది. వరదల రూపంలో పదేపదే విపత్తులకు కారణమవుతోంది. రాష్ట్రంలో 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ, ఈ శతాబ్ది మూడోదశాబ్దం ఉత్తరాఖండ్‌దే అవుతుందనీ, గత వందేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చే పదేళ్లలోనే రాష్ట్రానికి పర్యాటకులు వెల్లువెత్తుతారనీ మోదీ ఘనంగా ప్రకటించారు. రాష్ట్రంలో అనేకమంది ప్రజలకు మతపరమైన, ప్రకృతిపరమైన పర్యాటకం ఒక్కటే ఏకైక ఆధారం అనేది నిజం. కానీ ఉత్తరాఖండ్‌లో ప్రోత్సహిస్తున్న ప్రణాళికలు కొంతమంది కాంట్రాక్టర్లకు, కంపెనీలకు మాత్రమే లబ్ధి కలిగిస్తాయి. వీటి నుంచి సామాన్య ప్రజానీకం పొందేది ఏమీ లేదు. (చదవండి: కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!) పర్యావరణ నియమాలను నిర్లక్ష్యపర్చడం, విచక్షణారహితంగా అడవులను నరికేయడం కారణంగా ఈ యాత్రామార్గంలో నిర్మాణ పనులు తరుచుగా వార్తల్లోకి ఎక్కుతున్నాయి. చార్ధామ్ యాత్రా మార్గాన్ని అన్ని వాతావరణాల్లో పనిచేసే రహదారిగా పేర్కొన్నారు. కానీ నాణ్యతా లోపం వల్ల కట్టిన రహదారి ఎప్పుడో మాయమైపోయింది. నదీ ఉపరితలాలను ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు, పేలవమైన నగర నిర్వహణ వంటివి విపత్తులకు కారణాలు. ఢిల్లీ–మీరట్ హైవే లేదా ఉత్తరాఖండ్‌లో ముంబై–పుణే హైవే వంటి రహదారుల నిర్మాణం అన్ని వాతావరణాల్లో పనిచేసేవిధంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది పర్వత ప్రాంత భౌగోళికతకు దూరంగా లేదు. అందుకనే ప్రతి ఏటా ఈ రోడ్లు వరదల్లో కొట్టుకుపోతుంటాయి. ప్రజాధనం వృథా అయిపోతుంటుంది. పర్యావరణానికి మాత్రం కోలుకోలేని నష్టం జరుగుతుంటుంది. సరిహద్దు ప్రాంతాలకు నాణ్యమైన రహదారులు కావాలి తప్ప వెడల్పాటి రహదారులు అవసరం లేదు. పైగా అత్యంత సున్నిత ప్రాంతాల్లో రహదారులను నిర్మించడమే కాకుండా, సొరంగాలు కూడా తవ్వడం మరీ ప్రమాదకరం. కేదార్‌నాథ్‌కి కేబుల్ కార్లలో నేరుగా చేరుకోవాలన్న ప్రధాని మోదీ ఆలోచన పర్యావరణ పరిరక్షణకు భిన్నంగా ఉంది. పైగా ఆధ్యాత్మిక యాత్రల స్ఫూర్తికి అది దూరంగా ఉంటుంది. కేదార్ మార్గ్ ప్రయాణంలో ప్రకృతి నిసర్గ సౌందర్యం నుంచి నడుచుకుంటూ పోతూ చివరి గమ్యాన్ని చేరుకున్నప్పుడు కఠిన ప్రయాణాన్ని అధిగమించిన భావన మనసు నిండా వ్యాపిస్తుంది. కానీ కేదారనాథ్‌లో ఇప్పుడు హెలికాప్టర్లు రొదపెడుతున్నాయి. న్యాయస్థానాల ఆంక్షలను ఈ హెలికాప్టర్లు ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తున్నాయి. నిరంతరం ఇవి పెట్టే రొద, శబ్దాలు కేదార్ రక్షిత లోయలోని పక్షులు, జంతువుల ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నాయి. నడకదారిలో యాత్ర మెల్లగా సాగిపోతున్నప్పుడు యాత్రికులు అక్కడక్కడా కూర్చుంటూ మరింత ఎక్కువ సమయం ఈ ప్రాంతంలో ఆహ్లాదంగా గడిపేవారు. స్థానిక దుకాణదారులు, దాబా యజమానులు, టీ విక్రేతలు, వ్యాపారులు, సరకులు మోసే వారు, ఇంకా అనేకమంది లబ్ధి పొందేవారు. దీనికి భిన్నంగా హెలికాప్టర్లు, హైవే వల్ల కొన్ని ఎంచుకున్న కంపెనీలకు, ట్రావెల్ ఏజెంట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. గ్లాస్గోలో కాప్–26 వాతావరణ సదస్సు జరుగుతున్నప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సదస్సు నుంచి తిరిగొచ్చిన ప్రధాని పర్యావరణ హిత జీవన శైలి అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ ప్రకృతిని వట్టి నినాదాల ద్వారా మాత్రమే కాపాడలేమని పదేపదే రుజువవుతోంది. ప్రకృతిని ఛిన్నాభిన్నం చేసే ప్రతి ఒక్క ప్రయత్నమూ, నేటి, రేపటి తరాలను బలి తీసుకుంటుందని మరవరాదు. – హృదయేష్ జోషీ రచయిత, సంపాదకుడు -
భూసార నిపుణుడు డా. లాల్‌కు ‘జపాన్ ప్రైజ్’
దుక్కి చెయ్యకుండా పంట విత్తటం, వాతావరణంలోని ఉద్గారాలను భూమి పీల్చుకునేలా సాగు పద్ధతులను రూపొందించడంలో విశేష కృషి చేసిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ రత్తన్ లాల్ ప్రతిష్టాత్మకమైన జపాన్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో భారతీయ సంతతికి చెందిన భూసార శాస్త్రవేత్త డాక్టర్ రత్తన్ లాల్ ప్రతిష్టాత్మకమైన జపాన్ ప్రైౖజ్ –2019ను గెల్చుకున్నారు. పంజాబ్‌లో జన్మించిన డాక్టర్ లాల్ ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భూసార శాస్త్రవేత్తగా సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. డా. లాల్‌కు జపాన్ ప్రైజ్ కింద 4.5 లక్షల డాలర్ల నగదు పురస్కారాన్ని జపాన్ రాజు అకిహిటో, ప్రధాని షింజో అబెల నుంచి ఏప్రిల్ 8న ప్రదానం చేస్తారు. ఇంతకుముందు గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్‌ను, వరల్డ్ అగ్రికల్చర్ ప్రైజ్‌లను కూడా ఆయన అందుకోవడం విశేషం. నగదు బహుమతులను కర్బన ఉద్గారాలపై పరిశోధనలకే వెచ్చిస్తానని ఈ సందర్భంగా డా. లాల్ ప్రకటించి తన ఉదాత్తతను చాటుకున్నారు. -
కంబైన్డ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో గ్రూప్-ఎ హోదా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో సంబంధిత నోటిఫికేషన్ వివరాలు.. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులను రెండు కేటగిరీలుగా విభజించారు. అవి.. కేటగిరీ-1: (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్) జియాలజిస్ట్ (గ్రూప్-ఎ) 100 పోస్టులు జియోఫిజిస్ట్ (గ్రూప్-ఎ) 80 పోస్టులు కెమిస్ట్ (గ్రూప్-ఎ) 80 పోస్టులు కేటగిరీ-2: (సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ వాటర్ రీసోర్సెస్) జూనియర్హైడ్రాలజిస్ట్(సైంటిస్ట్-బి,గ్రూప్-ఏ) 5పోస్టులు అర్హతలు: జియాలజిస్ట్: మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజికల్ సైన్స్/ జియాలజీ/అప్లయిడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ఇంజనీరింగ్ జియాలజీ/మెరైన్ జియాలజీ/ఎర్త్ సైన్స్ అండ్ రీసోర్సెస్ మేనేజ్మెంట్ ఓషియానోగ్రఫి అండ్ కోస్టల్ ఏరియా స్టడీస్/పెట్రోలియం జియోసైన్స్/పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/జియో కెమిస్ట్రీ/జియోలాజికల్/జియోఫిజికల్ టెక్నాలజీ. జియోఫిజిస్ట్: ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/ జియోఫిజిక్స్/ అప్లయిడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్) లేదా ఎంఎస్సీ టెక్ (అప్లయిడ్ జియోఫిజిక్స్). కెమిస్ట్: ఎంఎస్సీ (కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ) జూనియర్ హైడ్రాలజిస్ట్: మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/మెరైన్ జియాలజీ. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ అనే రెండు దశలాధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం ఎంపిక ప్రక్రియకు 900 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష 700 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్‌కు 200 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్ భాషలో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగం.. జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉండొచ్చు. ఇందులో అభ్యర్థి నిర్దేశించిన అంశంపై ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. మిగతా విభాగాల్లో పని చేసే సందర్భంలో ఎదురయ్యే సంఘటనలు, నిత్య జీవితంలో ఉపయోగించే భాష వంటి అంశాలాధారంగా ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఇంగ్లిష్‌లో కేవలం భావ వ్యక్తీకరణే కాకుండా వాక్య నిర్మాణ శైలిని పరిశీలిస్తారు. కాబట్టి వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇందులో మెరుగైన మార్కుల కోసం ప్రతి రోజూ ఆంగ్ల దినపత్రికలు, ప్రముఖ పత్రికలు చదవడం లాభిస్తుంది. అదేవిధంగా యూపీఎస్సీ వివిధ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లోని ఇంగ్లిష్ విభాగాన్ని పరిశీలిస్తూ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. సబ్జెక్ట్ పేపర్లు.. మాస్టర్ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. ఆయా సబ్జెక్ట్‌ల్లో అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. కన్వెన్షన్ పద్ధతిలో సమాధానాలు రాయాలి. కాబట్టి జవాబు రాసే క్రమంలో సమయోచితంగా వ్యవహరించాలి. ఇచ్చిన ప్రశ్న ఆధారంగా సమాచారాన్ని విశ్లేషిస్తూ, అర్థవంతంగా, తక్కువ పదాల్లో ఎక్కువ సమాధానాన్ని ప్రెజెంట్ చేయాలి. అప్పుడే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి. వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్ల ఆధారంగా ఎస్సే రాయాలి. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఈ నేపథ్యంలో కేవలం ప్రిపరేషన్‌కే పరిమితం కాకుండా గత ప్రశ్నపత్రాల ఆధారంగా.. సమాధానాలను ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. రిఫరెన్స్ కోసం అన్ని రకాల పుస్తకాలను సిలబస్‌ను పరిశీలిస్తూ.. ఆయా అంశాలకు సంబంధించి ప్రభావవంతమైన సమాచారం ఉన్న పుస్తకాలను ఎంచుకోవడం మంచిది. ఇంటర్వ్యూ: రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తర్వాతి దశ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందుకోసం 200 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థిలోని స్కిల్స్‌ను మాత్రమే పరీక్షిస్తారు. ఎంచుకున్న పోస్టుకు కావల్సిన లక్షణాలు ఉన్నాయా?, లేవా? నాయకత్వ లక్షణాలు, చొరవ, మేధో సామర్థ్యం, సామాజిక అవగాహన, మానసిక సామర్థ్యం తదితర అంశాలను పరీక్షిస్తారు. నోటిఫికేషన్ సమాచారం: వయసు: కేటగిరీ-1 పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి); కేటగిరీ-2 పోస్టులకు 21 నుంచి 35 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2014. రాతపరీక్షలు ప్రారంభం: మే 24, 2014. వెబ్సైట్: ఠీఠీఠీ.ఠఞటఛి.జౌఠి.జీ రాత పరీక్ష ఇలా: రాత పరీక్షను కన్వెన్షన్ (ఎస్సే) విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే రూపొందిస్తారు. సమాధానాలను తప్పనిసరిగా ఇంగ్లిష్ భాషలో మాత్రమే రాయాలి. ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న డిగ్రీల స్థాయిలో ఉంటుంది. రాత పరీక్షను ఇంగ్లిష్, సబ్జెక్ట్ పేపర్ల కలయికగా నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ పేపర్ అన్ని కేటగిరీ పోస్టులకు ఉమ్మడిగా ఉంటుంది. పరీక్ష వివరాలు.. సబ్జెక్ట్ సమయం మార్కులు జనరల్ ఇంగ్లిష్ 3 గంటలు 100 జియాలజిస్ట్ జియాలజీ పేపర్-1 3 గంటలు 200 జియాలజీ పేపర్-2 3 గంటలు 200 జియాలజీ పేపర్-3 3 గంటలు 200 జియోఫిజిస్ట్ జియోఫిజిక్స్ పేపర్-1 3 గంటలు 200 జియోఫిజిక్స్ పేపర్-2 3 గంటలు 200 జియోఫిజిక్స్ పేపర్-3 3 గంటలు 200 కెమిస్ట్ కెమిస్ట్రీ పేపర్-1 3 గంటలు 200 కెమిస్ట్రీ పేపర్-2 3 గంటలు 200 కెమిస్ట్రీ పేపర్-3 3 గంటలు 200 జూనియర్ హైడ్రాలజిస్ట్ జియాలజీ పేపర్-1 3 గంటలు 200 జియాలజీ పేపర్-2 3 గంటలు 200 హైడ్రాలజీ 3 గంటలు 200 -
డైనోసార్ అవశేషాలు లభ్యం
అమరావతి: జిల్లాలో డైనోసార్ (రాక్షసబల్లి) అవశేషాలు లభ్యమయ్యాయి. అమరావతికి 60 కిలోమీటర్ల దూరంలోని సల్బర్డి ప్రాంతంలో శిలాజాలుగా మారిన ఎముకలు, గుడ్లు దొరికాయి. ఈ విషయాన్ని భూగర్భ శాస్త్రవేత్త శనివారం వెల్లడించారు. ఎ.కె.శ్రీవాస్తవ, ఆయన వద్ద డాక్టరేట్ చేస్తున్న ఆర్.ఎస్.మాన్కర్‌ల నేతృత్వంలోని బృందం ఆరేళ్లుగా జరుపు తున్న అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఈ విషయమై మాన్కర్ మీడియాతో మాట్లాడుతూ ఇవి అవక్షేప రాళ్లలో దొరికాయన్నా రు. ఈ అవశేషాలు 66 నుంచి 71 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి కావొచ ్చని భావిస్తున్నామన్నారు. ఆ కాలంలో డైనోసార్లు, టైటానోసారస్ కోల్బర్టిలు... సౌర్‌పోడ్ కుటుంబానికి చెందినవన్నారు. ఈ ప్రాంతంలో ఇవి సంచరించేవని, ఇక్కడే గుడ్లు పెట్టాయన్నారు. డైనోసార్ అవశేషాలు ప్రస్తుతం చిన్న చిన్న ముక్కల రూపంలో ఉన్నాయన్నారు. ఇవి రాళ్లలో చిక్కుకుపోయి ఉన్నాయని, అందువల్ల వాటిని అక్కడినుంచి తీయలేమన్నారు. టైటానోసారస్ కొల్బర్టి అనేది భారీ శాఖాహార జంతువని, ఇది 18 నుంచి 20 మీటర్ల పొడవు, 13 టన్నుల బరువు ఉంటుందన్నారు. డైనోసోర్ అవశేషాలు అంతకుముందు రాష్ర్టంలోని నాగపూర్, చంద్రపూర్‌లలోనూ కనిపించాయన్నారు.