ట్రంప్పై నటి తీవ్ర వ్యాఖ్యలు
న్యూయార్క్: ఆస్కార్ అవార్డు విజేత, హాలీవుడ్ నటి హెలెన్ మిరెన్.. అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె ట్రంప్ను డైనోసర్ (రాక్షసబల్లి)గా అభివర్ణించింది.
హెలెన్ నటించిన తాజాచిత్రం 'ఐ ఇన్ ద స్కై' ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే డైనోసర్లు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే కొన్ని పాత డైనోసర్లు మిగిలిపోయాయి. వాటిలో ట్రంప్ ఒకడు' అని చెప్పింది. ట్రంప్ ఫిజిక్ కూడా డైనోసర్ మాదిరిగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది. డైనోసర్లాగా ట్రంప్ భారీ శరీరం, చిన్న తల, చేతులు ఉంటాయని హెలెన్ చెప్పింది.
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు హెలెన్ మద్దతు తెలిపింది. హిల్లరీ కోసం ఇటీవల విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొంది.