జురాసిక్ పార్క్–ఫాలెన్ కింగ్‌డమ్ చిత్రంలో ఓ దృశ్యం
సాక్షి సినిమా: హాలీవుడ్ చిత్రాల్లో భారతీయ సినీ ప్రేక్షకులను అధికంగా అలరించిన అతి కొద్ది చిత్రాల్లో జురాసిక్ పార్క్ నమోదు అవుతుందని ప్రత్కేకంగా చెప్పనవసరం లేదు. ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలు జురాసిక్‌పార్క్ సిరీస్. పార్క్ అనే నవల ఆధారంగా 1993లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తెరపై ఆవిష్కరించిన వండర్ జురాసిక్‌పార్క్ చిత్రం. ప్రపంచ స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది.
ఇస్లా నుప్లర్ అనే ఒక కల్పన దీవిలో డైనోసర్ అనే ఒక వింత జాతికి జంతువు అరాజకాల ఇతివృత్తంగా తెరకెక్కిన ఆ చిత్రానికి ఆ తరువాత ది లాస్ట్ వరల్డ్ పేరుతో 1997లోనూ, జురాసిక్ పార్క్ 3 పేరుతో 2001లోనూ, జురాసిక్ వరల్డ్ పేరుతో2015లోనూ అదే స్టీవెన్ స్పీల్‌బెర్గ్ వరుసగా సీక్వెల్స్‌ను రూపొందించారు. తాజాగా జురాసిక్‌పార్క్– ఫాలెన్‌కింగ్‌డమ్ పేరుతో ఐదవ సీక్వెల్‌ను తెరకెక్కించిన చిత్రం జూన్‌న్7న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. అదే డైనోసర్ విలనిజాలను మరో కొత్త కోణంలో తెరపై దర్శకుడు ఆవిష్కరించారట. 1993 నుంచి జురాసిక్ పార్క్ సిరీస్‌లోనూ నటించిన జెఫ్ కోల్ట్‌ప్లమ్ ఈ జురాసిక్‌పార్క్–ఫాలెన్ కింగ్‌డమ్ చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. ఈ చిత్రంపై అంచనాలు భారి స్థాయిలో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం.ఆంగ్లం భాషల్లో యూనివర్శల్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment