‘జురాసిక్‌ వరల్డ్‌ 3’ ప్లాన్‌ రెడీ! | Jurassic World -3 plan ready | Sakshi
Sakshi News home page

‘జురాసిక్‌ వరల్డ్‌ 3’ ప్లాన్‌ రెడీ!

Apr 9 2018 1:03 AM | Updated on Apr 9 2018 1:04 AM

Jurassic World -3 plan ready - Sakshi

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ డైరెక్షన్‌లో మొన్న డిసెంబర్‌లో ‘ది పోస్ట్‌’ అని ఒక సినిమా వచ్చింది గుర్తుంది కదా? ఇప్పుడు నిన్నగాక మొన్న ‘రెడీ ప్లేయర్‌ వన్‌’ అని ఇంకో సినిమా వచ్చింది. ఇవి కాకుండా ఆయన ప్రొడక్షన్‌లో నిరంతరం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అంత బిజీగా ఉంటాడాయన. ఇక ‘జురాసిక్‌  పార్క్‌’తో డైనోసర్‌ సినిమా అంటే స్పీల్‌బర్గ్‌ అనిపించుకున్న ఆయన, ‘జురాసిక్‌ వరల్డ్‌’ సిరీస్‌కు దర్శకుడిగా కాక, నిర్మాతల్లో ఒకరుగా ఉంటూ వస్తున్నాడు.

జురాసిక్‌ వరల్డ్‌ ఒకటో భాగం 2015లో వస్తే, రెండో భాగం 2018 జూన్‌లో వస్తోంది. అలాగే మూడో భాగానికి కూడా అప్పుడే ప్లాన్‌ రెడీ చేసేశాడు స్పీల్‌బర్గ్‌. ఆయన ఒక నిర్మాతగా నిర్మించనున్న జురాసిక్‌ వరల్డ్‌ మూడో భాగానికి కొలిన్‌ ట్రెవెరో దర్శకత్వం వహించనున్నాడు. జురాసిక్‌ వరల్డ్‌ మొదటి భాగానికి ఆయనే దర్శకుడు కాగా, కొన్ని అనుకోని కారణాల వల్ల రెండో భాగానికి జె.ఎ.బయోనా దర్శకత్వం వహించాడు. ఇప్పుడు మూడో భాగానికి మళ్లీ కొలినే దర్శకుడు కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement