2015లో ‘జురాసిక్ వరల్డ్’ | The Jurassic Park series continues with Jurassic World | Sakshi
Sakshi News home page

2015లో ‘జురాసిక్ వరల్డ్’

Published Mon, Sep 16 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

2015లో ‘జురాసిక్ వరల్డ్’

2015లో ‘జురాసిక్ వరల్డ్’

ఎప్పటికీ మనసుల్లో నిలిచిపోయే సినిమాల్లో ‘జురాసిక్ పార్క్’ ఒకటి. ఈ చిత్రంలో రాక్షస బల్లులు చేసిన విన్యాసాలను పిల్లలూ పెద్దలూ ఆసక్తికరంగా తిలకించారు. ఆ తర్వాత రెండో, మూడవ సీక్వెల్స్ కూడా వచ్చాయి. మరోసారి ఈ డైనోసార్లు తెరపైకి రానున్నాయి. ‘జురాసిక్ పార్క్’ నాలుగో సీక్వెల్‌కి సన్నాహాలు మొదలయ్యాయి. 
 
 ఒలిన్ ట్రెవొర్రో దర్శకత్వంలో స్టీఫెన్ స్పీల్‌బర్గ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘జూరాసిక్ వరల్డ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 2015 జూన్, 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘జురాసిక్’ తొలి భాగం విడుదలై దాదాపు ఇరవయ్యేళ్లయ్యింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్స్ సాంకేతికంగా ఇంకా బాగుంటాయి.
 
 నాలుగో భాగం మరింత ఉన్నతంగా ఉంటుందట. అత్యున్నత సాంకేతిక హంగులతో మరింత థ్రిల్‌కు గురి చేసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ‘జురాసిక్ వరల్డ్’ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే పట్టుదలతో కొలిన్, స్టీఫెన్ తదితర యూనిట్ సభ్యులు వర్క్ చేస్తున్నారని హాలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement