
స్పీల్‌బెర్గ్ దర్శకత్వంలో ఐదోసారి...
హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ హిట్ మూవీల లిస్ట్‌లో ‘ఇండియానా జోన్స్’ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రపంచానికి అందకుండా చారిత్రక శిథిలాల్లో మిగిలిపోయిన అద్భుతమైన వస్తువుల కోసం అన్వేషించే ఓ పురావస్తు శాఖ అధ్యాపకుని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇప్పటికీ నాలుగు భాగాలు వచ్చి బాక్సాఫీస్ దగ్గర కనకర్షం కురిపించాయి. హాలీవుడ్ సూపర్‌స్టార్ హారిసన్ ఫోర్డ్ హీరోగా నటించారు. ఇప్పుడు అయిదో భాగాన్ని కూడా నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ వరల్డ్ సన్నాహాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ భాగాన్ని కూడా స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తెరకెక్కించనున్నారు. 2019లో ఈ అయిదో భాగాన్ని విడుదల చేయనున్నట్లు డిస్నీ సంస్థ ప్రకటించింది.