డైనోసార్‌తో ఆటాపాటా! | Shruti Hassan's international rockstar collaboration | Sakshi
Sakshi News home page

డైనోసార్‌తో ఆటాపాటా!

Published Wed, May 11 2016 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

డైనోసార్‌తో ఆటాపాటా!

డైనోసార్‌తో ఆటాపాటా!

డైనోసార్‌తో శ్రుతీహాసన్ ఆడి, పాడబోతున్నారు. ఈ బ్యూటీకి ధైర్యం ఎక్కువ అనుకుంటున్నారా? అసలు కథ ఏంటంటే...  డైనోసార్ పైల్ అప్ అనే రాక్‌బ్యాండ్‌తో కలిసి శ్రుతి ఓ ఆల్బమ్ తయారు చేయనున్నారు. నటిస్తూనే అడపాదడపా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌కి పాడడం ఆమెకి అలవాటే.
 
  ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం ఎహ్‌సాన్-లాయ్‌తో కలిసి ఆమె ఓ ఆల్బమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా లండన్‌కు చెందిన ‘డైనోసార్ పైల్ అప్’ అనే రాక్‌బ్యాండ్‌తో కలిసి మళ్లీ ఓ కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌ను స్వరపరచనున్నారు. లిరిక్స్ రాయడా నికి కూడా తన వంతు సహకారం అందిస్తున్నారట. ఈ ఆల్బమ్ పని మీద లండన్‌కు రెండు, మూడు సార్లు వెళ్లి వచ్చారట. ఒక వైపు సినిమాలూ మరోవైపు ఈ ఆల్బమ్‌తో శ్రుతి ఫుల్ బిజీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement