డైనోసార్ల పూర్వీకుడి జాడ తెలిసింది
స్పెయిన్: దాదాపు 230 మిలియన్ సంవత్సరాల క్రితం తిరుగాడిన ఓ డైనోసార్ జాడ తెలిసింది. స్పెయిన్లో దాని పాద ముద్రిక స్పష్టంగా బయటపడింది. ఇప్పటి వరకు భూమిపై లభించిన రాక్షస బల్లుల పాద ముద్రికల్లో ఇదే సజీవంగా సురక్షితంగా ఉన్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. ఐబీరియన్ ద్వీపకల్పంలో ఈ గుర్తు భద్రంగా ఏమాత్రం చెదిరిపోకుండా ఉన్నట్లు వారు చెప్పారు.
గత ఏప్రిల్లో ఓ వ్యక్తి బార్సిలోనాకు 40 కిలోమీటర్ల దూరంలోని మోంటెసెర్రాట్ అనే ప్రాంతంలో తిరుగుతుండగా ఈ పాదముద్ర కంటపడింది. ఈ పాద ముద్రికను ప్లాస్టర్ సహాయంతో ప్రింట్ తీసి పురాతత్వశాస్త్ర శాఖలో భద్రపరిచినట్లు అధికారులు చెప్పారు. దీని ద్వారా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఈ గుర్తు ప్రకారం ఆ డైనోసార్ ఇప్పటి వరకు తెలిసిన డైనోసార్లన్నింటికంటే ముందు కాలంనాటిదని చెప్పారు.