నేనొక డైనోసర్‌ను చూశాను: అనుష్క | Anushkas Instagram video titled: I spotted A dinosaur on the loose | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: విరుష్కల మరో వీడియో వైరల్‌

Published Thu, May 21 2020 9:59 AM | Last Updated on Thu, May 21 2020 10:26 AM

Anushkas Instagram video titled: I spotted A dinosaur on the loose - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి డైనోసర్‌గా మారాడు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అన్ని టోర్నీలు రద్దవ్వడం, వాయిదాపడటంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ రూపంలో ఊహించని విరామాన్ని కోహ్లి తన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. అంతేకాకుండా తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు విరుష్కలు. తాజాగా అనుష్క తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. 

డైనోసర్‌లగా కోహ్లి నడుస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ.. ‘నేను డైనోసర్‌ను గుర్తించాను’ అంటూ కామెంట్‌ జతచేసింది. ఇక ఈ వీడియోకు కోహ్లి ఫ్యాన్స్‌ తమదైన రీతిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ‘కోహ్లి అచ్చం డైనోసర్‌లా నడిచావ్‌’ అని ఓ అభిమాని సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక అంతకుముందు జిమ్‌లో కోహ్లి వర్కౌట్స్‌ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. 


చదవండి:
ఆ జంప్‌... ఆహా!
టి20 వరల్డ్‌ కప్‌ వాయిదా పడితేనే...

Earn it. Don't demand it.

A post shared by Virat Kohli (@virat.kohli) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement