ఆ సర్వేలో కోహ్లి జంట టాప్‌..! | Kohli Anushka Cutest Couple In Flipkart Kya Bolti Public Poll | Sakshi
Sakshi News home page

ఆ సర్వేలో కోహ్లి జంట టాప్‌..!

Published Wed, May 13 2020 7:34 PM | Last Updated on Wed, May 13 2020 8:08 PM

Kohli Anushka Cutest Couple In Flipkart Kya Bolti Public Poll - Sakshi

కరోనా లాక్‌డౌన్‌తో సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ లేకపోవడంతో వారిలో చాలా మంది సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు వినోదాన్ని పంచడమే కాకుండా.. ఇంటి పనులు చేస్తున్న వీడియోలను షేర్‌ చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో నిర్వహించిన ఓ పోల్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

క్యా బోల్తి పబ్లిక్‌ పేరిట ఫ్లిప్‌కార్ట్‌ వీడియో పోల్‌ ఆధారిత గేమ్‌ షోను నిర్వహిస్తోంది. ఇందులో ఇండియన్‌ క్రికెటర్స్‌, బాలీవుడ్‌ తారల గురించి అభిమానుల ముందు పలు ఫన్నీ ప్రశ్నలు ఉంచింది. ఇందులో ఇండియాలోనే టాప్‌ టెన్‌ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకటిగా నిలిచే విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ జంటకు అధిక శాతం ఓట్లు లభించాయని మై ఖేల్ పేర్కొంది.ఈ పోల్‌లో విరాట్‌-అనుష్క, సైఫ్‌ అలీ ఖాన్‌-కరీనా కపూర్‌లలో క్యూటెస్ట్‌ కపుల్‌ ఎవరని అడగ్గా.. 81 శాతం మంది భారతీయ అభిమానులు విరుష్క జోడికే ఓటు వేశారు. కాగా, కోహ్లి, అనుష్క సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. (చదవండి : 8 వారాల తర్వాత.. హెసన్‌ భావోద్వేగం)

కూలెస్ట్‌ ఆల్‌ రౌండర్స్‌గా జడేజా, హార్దిక్‌ ..
ఇదే పోల్‌లో టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలలో కూలెస్ట్‌ ఆల్‌ రౌండర్‌ ఎవరని అభిమానులను ప్రశ్నించగా.. వారి నుంచి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. జడేజా, హార్దిక్‌లకు దాదాపు కొద్దిపాటి తేడాతో ఓట్లు వచ్చాయి. మొత్తంగా జడేజాకు 53 శాతం ఓట్లు పోలయ్యాయి. 

కత్రినా కంటే ధావన్‌ బెటర్‌.. 
అలాగే టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌లలో ఎవరు ఇంటి పనులు బాగా చేస్తారని ప్రశ్నించగా.. ఎక్కువ మంది ధావన్‌కే ఓటేశారు. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో ధావన్‌ ఇంట్లో బట్టలు ఉతుకుతున్న వీడియోలో పోస్ట్‌ చేయగా.. కత్రినా ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు కడిగే వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : మరోసారి వార్తల్లో శుభ్‌మన్‌, సారా టెండూల్కర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement