'ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా' | Virat Kohli Reveals Influence Of Anushka Sharma On His Life | Sakshi
Sakshi News home page

ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే కూర్చున్నా : కోహ్లి

Apr 22 2020 1:42 PM | Updated on Apr 22 2020 1:45 PM

Virat Kohli Reveals Influence Of Anushka Sharma On His Life - Sakshi

ముంబై : అనుష్క శ‌ర్మ నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని, ఒక‌వేళ ఆమె నా జీవితంలోకి రాక‌పోయుంటే వేరేలా ఉండేద‌ని  టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంప‌తులు చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటున్నారు. ఎప్పుడు బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకుండా గ‌డిపే ఈ ఇద్ద‌రు క‌రోనా పుణ్య‌మా అని ఆనందంగా గ‌డిపేస్తున్నారు. తాజాగా కొంత‌మంది స్టూడెంట్స్‌కు జీవితాన్ని ఎలా మ‌లుచుకోవాల‌నే దానిపై కోహ్లి దంప‌తులు ఆన్‌‌లైన్ సెష‌న్ నిర్వ‌హించారు. (తుఫాన్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు‌)

ఈ సంద‌ర్భంగా కోహ్లి మాట్లాడుతూ..  'ముఖ్యంగా ఓపిక విష‌యంలో క్రెడిట్ మొత్తం నా భార్య‌కే ద‌క్కుతుంది. గ‌తంలో తాను చాలా దూకుడుగా ఉండేవాడిని. నిజాయతీగా చెప్పాలంటే అనుష్కతో ప‌రిచ‌యం నాలో చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో నేను ప్ర‌తీ చిన్న విష‌యానికి కొప్ప‌డేవాడిని. ఇప్పుడు ఆ ధోర‌ణి మారింది. అనుష్క నాలో శాంతిని నింపింద‌నుకుంటా. కెరీర్ ఆరంభించిన తొలినాళ్ల‌లో రాష్ట్ర జ‌ట్టుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డంతో చాలా బాధ‌ప‌డ్డా.. రాత్రంతా కూర్చొని ఏడ్చా' అంటూ కోహ్లీ పేర్కొన్నాడు. 2013లో ఒక షాంపో యాడ్‌లో భాగంగా విరాట్‌, అనుష్క‌లు ఒకరొకొక‌రు ప‌రిచ‌య‌మ‌య్యారు. దాదాపు 4 ఏళ్ల రిలేష‌న్‌షిప్ అనంత‌రం 2017లో పెళ్లి చేసుకున్నారు. (క‌రోనా : ‌మాట విన‌క‌పోతే ఇలాంటివే జ‌రుగుతాయి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement