ఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఆటకు విరామం దొరకడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్ ఉండడంతో ఆటకు ఎలాగో దూరమయ్యాం.. కనీసం ఫిట్‌నెస్ అయినా కాపాడుకుందాం అనే ఉద్దేశంలో ఆటగాళ్లంతా కండలు పెంచే పని మీద పడ్డారు. ఇంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలంటూ ఇన్‌స్టా వేదికగా వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఇంట్లోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ వ్యాయామం చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో భజ్జీ తన రెండు చేతులతో డంబుల్స్ పట్టుకొని రొటీన్‌గా సాధాసీదా వర్కవుట్స్ చేశాడు. ' వేటితో చేస్తే ఏంటి.. జీవితంలో ఎక్సర్‌సైజ్ మస్ట్' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్ కోహ్లి తనదైన శైలిలో చమత్కరించాడు.
('దయచేసి.. ఆ ఇద్దరిని ఎలాగైనా పట్టుకోండి')
'వెల్‌డన్ పాజీ.. నీ ఎక్సర్‌సైజ్‌కు మీ ఇంటి బిల్డింగ్ కొద్దిగా షేక్ అవుతున్నట్లు కనిపిస్తుంది' అంటూ కోహ్లి ట్రోల్ చేశాడు. దీనికి బదులుగా భజ్జీ లాఫింగ్ ఎమోజీలతో.. మెళ్లి మెళ్లిగా పరిస్థితి అదుపులోకి వస్తుంది.. అంతవరకు ఓపిక పట్టాల్సిందే కోహ్లి.. పైగా మన ఇద్దరికి కలిపి చాలా వర్కవుట్ సెషన్స్ ఉన్నాయం'టూ రిప్లై ఇచ్చాడు. కాగా హర్భజన్ 2016 మార్చి నుంచి టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. కాగా ఐపీఎల్ 2020లో చెన్నైసూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ.. మంచి ప్రదర్శన కనబరిచి రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఎలాగైనా చోటు సంపాదించాలని ఆశపడ్డాడు. కానీ కరోనా వైరస్ అతడి ఆశల్ని వమ్ము చేసింది. టీమిండియా తరపున హర్భజన్ 103 టెస్టుల్లో 417, 236 వన్డేల్లో 269, 28 టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.
(నన్ను వృద్ధుడిని చేసేశారు: భజ్జీ)
('ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు')
Comments
Please login to add a commentAdd a comment