
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన బాడీని ఫిట్‌గా ఉంచుకోవడంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తాడు. తన ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు స్పెషల్‌గా ఒక ట్రైనర్‌ను కూడా అపాయింట్ చేసుకున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబైలోని తన ఇంటికే పరిమితమయ్యాడు. ట్రైనర్ రాకపోవడంతో తాజాగా కోహ్లి ఇంట్లోనే ఉన్న జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఫిట్‌నెస్ పెంచుకుంటున్నాడు. తాజాగా అతను 20 కేజీల వెయిట్‌లిఫ్ట్‌ను చేయడంతో పాటు మూడుసార్లు బంగీ జంప్ చేశాడు. లాక్‌డౌన్ కాలంలో యువత ఫిట్‌నెస్‌పై దృష్టి పెంచుకోవాలని, జీవితంలో ఏదైనా సాధించాలన్న ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని తన అభిమానులకు వివరించాడు. ' మనం ఏదైనా అనుకుంటే సంపాదించి తీరాలి కాని.. డిమాండ్ చేయకూడదు ' అంటూ క్యాప్షన్ జతచేశాడు. తాజాగా కోహ్లి చేసిన వర్క్‌వుట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వర్క్‌వుట్‌పై రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌లు కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తారు.
('సెంచరీ కంటే భార్య చేసే హెయిర్‌కట్ కష్టంగా ఉంది')
Comments
Please login to add a commentAdd a comment