సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌తో అన్ని క్రికెట్ టోర్నీలు, ప్రాక్టీస్ సెషన్స్ రద్దవ్వడంతో టీమిండియా ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఏం చేస్తున్నామో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, చహల్‌లు కరోనా లాక్‌డౌన్ సమయంలో ఏం చేస్తున్నామో వివరించారు. తాజాగా వీరి సరసన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేరిపోయాడు.
My all time favourite 🐎 pic.twitter.com/DjQWAP6Cze
— Ravindrasinh jadeja (@imjadeja) March 31, 2020
ఇంటికే పరిమితమైన ఫిట్‌నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని జడ్డు పేర్కొన్నాడు. ‘పరిగెత్తడం నా బలం.. నా శరీరాన్ని రిపేర్ చేయడానికి సరైన సమయం’అంటూ ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. అయితే గుర్రపు స్వారీని మిస్సవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. గుర్రపు స్వారీ చేయడం తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ గతంలో గుర్రపు స్వారీ చేసిన వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన కుక్కతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశాడు.
Running is my strength!! Perfect time to repair my body. #powerrun #speedat24 #staysafestayhome pic.twitter.com/kIsK6YXeuw
— Ravindrasinh jadeja (@imjadeja) March 27, 2020
కాగా, టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఇంగ్లండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్‌ల మధ్య ట్విటర్ వేదికగా ఆసక్తికర చర్చ సాగింది. కట్టుదిట్టమైన లాక్‌డౌన్ సమయంలో తన మెసేజ్‌కు గంటన్నర తర్వాత రిప్లై ఇవ్వడంపై రోహిత్‌ను పీటర్సన్ గట్టిగా ప్రశ్నించాడు. అయితే ఇంటి పనుల్లో బిజీగా ఉండటం వలన ఆలస్యమైందని రోహిత్ వ్యంగ్యంగా బదులిచ్చాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య సంభాషణ సైతం ట్విటర్‌లో హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇక కరోనాపై పోరాటంలో భాగంగా టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వానికి అర్థికంగా అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో విరుష్క జోడి రూ.3 కోట్లు, రోహిత్ రూ. 80 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.
Life after one week at home.
— Shikhar Dhawan (@SDhawan25) March 24, 2020
Reality hits hard 🤪 #AeshaDhawan @BoatNirvana #boAtheadStayINsane 🤙🏻 pic.twitter.com/ZTM2IhGV3c
చదవండి:
విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!
పనే లేదు.. వర్క్‌లోడ్ అంటే ఏమనాలి?
Comments
Please login to add a commentAdd a comment