ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఏ పని చేసినా కచ్చితత్వం ఉండేలా చూసుకుంటాడు. అది మ్యాచ్ అయినా లేక మరే ఏ పనైనా మిస్టర్ పర్‌ఫెక్ట్‌గానే వ్యవహరిస్తాడు. తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన కోహ్లి ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తూ ఇన్‌స్టాలో వరుసపెట్టి వీడియోలు షేర్ చేస్తున్నాడు. తాజాగా కోహ్లి 180 డిగ్రీల కోణం ల్యాండింగ్ ఎక్సర్‌సైజ్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో కోహ్లి కేవలం తన కాలిపాదం సహయంతోనే ఒకవైపు తిరిగి 180 కోణంలో మరో పాదం సహాయంతో ఇంకోవైపు తిరిగాడు. చూడడానికి ఈ వీడియో కొంచెం కఠినంగానే ఉన్నా కోహ్లి మాత్రం ఈ వర్కవుట్‌ను పర్‌ఫెక్ట్‌గా చేశాడు. ' ఇది నా ఫస్ట్ 180 ల్యాండిగ్ ఎక్సర్‌సైజ్.. ఇదే నా టాప్ ఎక్సర్‌సైజ్ ' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కోహ్లి చేసిన ఈ వర్కవుట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ' విరాట్.. ఇలాగే మాకు ఆదర్శంగా నిలబడు'.. ' నువ్వు ఏం చేసినా కచ్చితత్వం వచ్చేవరకు వదిలిపెట్టవు' అంటూ కామెంట్లు పెట్టారు.
సిక్సర్ల కంటే సింగిల్స్‌పైనే ఫోకస్ చేశాడు
కాగా మంగళవారం హర్భజన్ సింగ్ డంబుల్స్‌తో చేసిన వర్కవుట్‌పై కోహ్లి సరదాగా స్పందించిన సంగతి తెలిసిందే. 'పాజీ.. మెల్లిగా బిల్డింగ్ షేక్ అవుతుంది' అంటూ కామెంట్ చేయడం తెగ వైరల్‌గా మారింది. ఇంతకుముందు కూడా విరాట్ ఇలాగే వెయిట్‌లిఫ్టింగ్‌తో చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ వెయిట్‌లిఫ్టింగ్ వర్కవుట్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.('భజ్జీ ! మెల్లిగా.. బిల్డింగ్ షేక్ అవుతుంది')
Comments
Please login to add a commentAdd a comment