
సిడ్నీ : ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు. లాక్‌డౌన్ సమయాన్ని వార్నర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడిపేస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేసిన ప్రతీ వీడియోనూ షేర్ చేసుకుంటున్నాడు. వార్నర్ పిల్లలైన ఐవీ-మే, ఇండి-రే కోరిక మేరకు ఈ మధ్యనే టిక్‌టాక్ యాప్‌లో పిల్లలతో కలిసి గెస్ట్ రోల్‌లో నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా వార్నర్ తన పిల్లలతో కలిసి ఒక లైవ్ వీడియో చాట్‌లో పాల్గొన్నాడు. ('నేనైతే అభిమానుల మధ్యే ఆడాలనుకుంటా')
వీడియో చాట్‌లో భాగంగా మీకిష్టమైన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పండి అని పిల్లలను అడగ్గానే.. వెంటనే మాకు విరాట్ కోహ్లి అంటే చాలా ఇష్టమని.. ఇండియన్ ఫేవరెట్ క్రికెటర్ అని పేర్కొన్నారు. తర్వాత తండ్రి వైపు తిరిగి చూస్తు మా నాన్న కూడా మాకు ఫేవరెట్ ఆటగాడనంతో వార్నర్ ముఖంలో ఆనందం వెల్లివెరిసింది. మరీ మీకు కోహ్లి ఫోటోగ్రాఫ్ కావాలా అని వార్నర్ అడగ్గానే.. అవకాశమొస్తే కోహ్లి అంకుల్‌తో సెల్ఫీ కావాలని అడుగుతామని ఐవీ-మే, ఇండి-రేలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లతో సిరీస్‌లు జరిగేది కష్టమేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తాను అభిమానుల సమక్షంలోనే క్రికెట్ ఆడేందుకు ఇష్టపడుతానని, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వ్యర్థమేనని పేర్కొన్నాడు.
('మెక్‌గ్రాత్ గుర్తుంచుకో.. నేనింకా క్రీజులోనే ఉన్నా')
Comments
Please login to add a commentAdd a comment