
అనుష్క, విరాట్ కోహ్లీ
పని లేని మంగలి పిల్లి తల గొరిగాడన్నది సామెత. ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక ఏదో పని చేసేవాళ్లని ఇలా అంటుంటాం. ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ ఇంట్లో లాక్ అయిపోయి ఉన్నారు. బొమ్మలేస్తూ, పాటలు పాడుతూ, వ్యాయామం చేస్తూ ఇలా కాలక్షేపం కోసం చేస్తున్న ప్రతీదాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు స్టార్స్. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ఖాళీగా ఉండటంతో ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. అయితే అది వంట గదిలోనో, వైట్ పేపర్ మీదో కాదు. తన భర్త విరాట్ కోహ్లీ తల మీద. కత్తెర తీసుకొని భర్త కోహ్లీకి హెయిర్ కట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసి ‘లాక్ డౌన్ సమయాల్లో ఇలా ’’ అని కాప్షన్ చేశారు అనుష్క. ఈ కొత్త హెయిర్ స్టైల్ బావుందంటూ అనుష్కను అభినందించారు కోహ్లీ.
Comments
Please login to add a commentAdd a comment