haircut
-
మండుటెండలో నిలబెట్టి... ఆపై జుత్తు కత్తిరించి!
జి.మాడుగుల: అసెంబ్లీకి సమయానికి రాలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం నాడు పాఠశాల, కళాశాల విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేసుకొని ఆలస్యంగా కేజీబీవీకి వచ్చారు.పాఠశాలలో రోజువారీ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అలస్యంగా రావడంతో వారిపై ప్రిన్సిపాల్ ఆగ్రహించారు. విద్యార్థినులను పాఠశాల, కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అసెంబ్లీకి రాని విద్యార్థినుల్లో కొంతమందిని దండించారు. వీరిలో 15 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించారు. మనోవేదనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచినా.. వెంబడించి మరీ జుత్తు కత్తిరించినట్టు సమాచారం. వీరిలో ఒక విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. జుత్తు కట్ చేస్తున్న సమయంలో మనోవేదనకు గురైన ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ తాగడానికి మంచినీరు కూడా ప్రిన్సిపాల్ అందించటానికి నిరాకరించారు. క్రమశిక్షణ నేర్పాలనే... విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ కోరగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్ చేసినట్లు తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం కేజీబీవీలో విద్యార్థినుల జుత్తును అకారణంగా కటింగ్ చేసినట్టు కొంతమంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎంఈవో బాబూరావుపడాల్ తెలిపారు. ఈ విషయంపై కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్టు చెప్పారన్నారు. అక్కడ నుంచి ఫోన్లో ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా విద్యార్థినులకు జుట్టు పెరిగిపోయిందని, క్రమశిక్షణ(డిసిప్లేన్) కోసం విద్యార్థినుల్లో కొంతమంది జత్తు కటింగ్ చేసినట్టు చెప్పారని ఎంఈవో తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు. -
ప్రభాస్ హెయిర్ స్టైల్ కావాలి.. ఫ్లాట్ హెయిర్ కట్ నచ్చడం లేదు!
‘మాకు హీరో ప్రభాస్‌లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్‌గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు. ‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్రభావమే... ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్‌లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది -
మంటతో హెయిర్ కట్ చేస్తాడు... మండిపడకండి సార్!
‘జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నారుగానీ ‘టాలెంట్ ఉన్న వ్యక్తి కత్తెర ఉపయోగించకుండా హెయిర్ కట్ చేసినా జుట్టుకు అందమే’ అని ఎవరూ అనలేదు. విషయంలోకి వస్తే... తమిళనాడులో ఒక బార్బర్ తన కస్టమర్‌కు హెయిర్ కటింగ్ చేయడానికి కత్తెర ముట్టుకోకుండా ‘మంట’ను ఉపయోగించాడు. క్లయింట్ జుట్టు కత్తిరించడానికి, స్టైల్ చేయడానికి ‘ఫైర్ టార్చ్’ను ఉపయోగించి రకరకాల విన్యాసాలు చేశాడు. ‘ఎక్స్’లో ప్రత్యక్షమైన ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోకు వచ్చిన స్పందన విషయానికి వస్తే... బార్బర్ నైపుణ్యం, ధైర్యాన్ని చాలామంది అభినందించగా కొద్దిమంది మాత్రం ‘నీ దుంపతెగ ఇదేమీ దుస్సాహసం’ అన్నట్లుగా కామెంట్లు పెట్టారు. ‘నెత్తి మీద ఇంత దగ్గరగా మంటను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు...’ అంటూ చెప్పుకొచ్చారు కొందరు. క్లయింట్‌కు ఎర్ర వస్త్రం చుట్టి మరీ ప్రయోగంలోకి దిగాడు బార్బర్. రెడ్ క్లాత్ చుట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ‘ఇది ప్రమాదం సుమీ’ అని చెప్పకనే చె΄్పాలకున్నాడో తెలియదు. -
జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఓ కొత్త లుక్‌లో రాహుల్: ఫోటోలు వైరల్
మొన్నటి వరకు భారత్ జోడో యాత్రలో ఫుల్ గడ్డం, జుట్టుతో కనిపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కసారిగా కొత్త లుక్‌లో కనిపించారు. ఒక్కసారిగా రాహుల్ జుట్టు కత్తిరించి, గెడ్డం తీసేసి..ఒక లెక్చరర్ మాదిరిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు లండన్‌లో ఒక వారం పర్యటించినున్న రాహుల్ మంగళవారమే అక్కడికి చేరుకున్నారు. అక్కడ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ విద్యార్థులతో మాత్రమే ఉపన్యసించనున్నారు. రాహుల్ కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్(కేంబ్రిడ్జ్ జేబీఎస్)ని కూడా సందర్శించి..అక్కడ 21వ శతాబ్దపు లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అంతేగాదు రాహుల్ కేం బ్రిడ్జ్‌లో బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలు అనే అంశంపై యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ ట్యూటర్ అండ్ కోడైరెక్టర్, గ్లోబల హ్యూమానిటీస్ ఇనిషియేటివ్ డైరెక్టర్ అయిన శ్రుతి కపిలాతో కలసి కొన్ని సెషన్లు కూడా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ట్విట్టర్ వేదికగా భారత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది అని పేర్కొంది. అందుకు సంబధించిన రాహుల్ కొత్త లుక్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. Rahul Gandhi in Cambridge. With a New Look 😎 pic.twitter.com/wOSZnl8MAE — Aaron Mathew (@AaronMathewINC) March 1, 2023 Rahul Gandhi ji in Cambridge. With a New Look 🫶🫶 #RahulGandhi pic.twitter.com/3GHKzm6q0r — Rabiul Hassan (@Rabiul__INC) March 1, 2023 (చదవండి: కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. కేబినెట్లో సౌరవ్, అతిషిలకు చోటు) -
హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్
హెయిర్ కటింగ్ చేయడంలో జరిగిన పొరపాటుకి శిక్షగా న్యాయస్థానం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కి రెండు కోట్ల రూపాయల ఫైన్ విధించింది. మూడేళ్లపాటు ఈ కేసు కొనసాగగా గురువారం తీర్పు వచ్చింది. 2018 ఏప్రిల్ 18న మోడల్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ చెన్నైలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసింది. హెయిర్ కటింగ్ చేసుకునేందుకు ఆ రోజు హోటల్లో ఉన్న సెలూన్‌కి ఆ మహిళ వెళ్లింది. ‘ తనకు ఇంటర్వ్యూ ఉందని, జుట్టును కింది నుంచి నాలుగు అంగులాల వరకు కత్తరించమని’ సూచించింది. హెయిర్ డ్రస్సర్ కటింగ్ చేస్తుండగా ఆమె కళ్ల జోడు తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత డ్రెస్సర్ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించుకుంది. తీరా కటింగ్ పూర్తయిన తర్వాత చూస్తే జుట్టును కింది నుంచి కాకుండా మొదలు నుంచి నాలుగు అంగుళాల వరకు ఉండేలా కటింగ్ చేశారు. తనకు జరిగిన నష్టంపై సదరు మహిళ హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా... వారు సరైన స్పందన ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ నేషనల్ కన్సుమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని సంప్రదించింది. హోటల్ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, పైగా వారు ఉపయోగించిన కెమెకల్స్ వల్ల తన స్కాల్ప్ పాడైందంటూ కోర్టుకు విన్నవించింది. తనకు పొడవైన జుట్టు ఉండటం వల్ల పలు ప్రముఖ కంపెనీల షాంపూ యాడ్లలో నటించాని, ప్రస్తుతం తనకు ఆ అవకాశం పోయిందంటూ కోర్టుకు వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఐటీసీ మౌర్య హోటల్లో ఉన్న హెయిర్ డ్రెస్సర్, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సదరు మహిళకు తీవ్ర నష్టం కలిగినట్టు భావించింది. జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 2 కోట్లను బాధిత మహిళకు చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. చదవండి : వర్కింగ్ విమెన్: మీకోసమే ఈ డ్రెస్సింగ్ స్టైల్ -
అతిపొడవైన వెంట్రుకలను కత్తిరించుకున్న టీనేజర్
గాంధీనగర్ : అతిపొడవైన వెంట్రుకలతో ప్రత్యేకత చాటుకున్న నిలాంషి పటేల్ ఆ వెంట్రులకను కత్తరించుకుంది. గుజరాత్‌లోని అరవల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల నిలాంషి 12 ఏళ్లపాటు అపురూపంగా పెంచుకున్న 6 అడుగుల 6.7 అంగుళాల పొడవైన వెంట్రుకలతో ఈ టీనేజర్ ఇటీవల గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2018లో 170.5 సెంటీమీటర్ల పొడవు కేశాలతో రికార్డు సృష్టించిన నిలాంషి.. తరువాత 2019లో 190 సెంటీమీటర్లు.. 2020లో 200 సెంటీమీటర్ల పొడవుగా కేశాలను పెంచింది. ఫలితంగా ప్రపంచంలో అతి పొడవైన కేశాలు కల్గిన యువతిగా మరోసారి గుర్తింపు పొందింది. ఈ ఘనత తన తల్లికే చెందుతుందని నిలాంషి తెలిపింది. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తనను మార్చేసిందని పేర్కొంది. అయితే, తాజాగా ఆ వెంట్రుకలను కత్తిరించుకొన్న వీడియోను తన ఫేస్బుక్ అకౌంట్లో పెట్టింది. ‘చాలా ఉత్సాహంగా అలాగే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త హెయిర్‌స్టైల్‌తో ఎలా కనిపిస్తానో నాకు తెలీదు. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ అది అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను’ అని పేర్కొంది. ఇక తన వెంట్రుకలను హాలీవుడ్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డు మ్యూజియానికి అందజేసినట్లు తెలిపింది. -
దళితులకు హెయిర్ కట్ : ఆత్మహత్యే శరణ్యం
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా పలు వ్యాపారాలు, చిన్న, చిన్న దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతోపాటు అనేక వృత్తి కార్మికులు కూడా ఉపాధిలేక సంక్షోభంలోకి కూరుకుపోయారు. అయితే ఇపుడిపుడే సాధారణ పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక బార్బర్‌షాపు యజమాని పట్ల గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ సామాజివర్గాలకు హెయిర్ కట్ చేశారన్న అక్కసుతో మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకాలోని బార్బర్ కుటుంబాన్ని బాయ్‌కాట్ చేసిన ఉదంతం కర్నాటకలో చోటుచేసుకుంది. హల్లారే గ్రామానికి చెందిన మాల్లికార్జున శెట్టి కుటుంబం కటింగ్ సెలూన్ నడుపుకుంటోంది. చెప్పినా వినకుండా ఎస్టీ, ఎస్సీ సభ్యులకు జుట్టు కత్తిరించారంటూ కొందరు కుల దురహంకారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. అంతేకాదు ఏకంగా 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. గతంలో కూడా రెండుసార్లు కుల వివక్షకు గురయ్యామని జరిమానా కూడా చెల్లించామంటూ బార్బర్ మాల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తమ షాపును సందర్శించిన చన్నా నాయక్ తదితరులు దళితులకు ఎక్కువ చార్జ్ వసూలు చేయాలని గతంలో ఆదేశించారని ఆరోపించారు. దీనికి తాము అంగీకరించకపోవడంతో తమ కుమారుడిని కొట్టి, బెదిరించి మరీ అతడినుంచి 5 వేల రూపాయలను లాక్కుపోయారని తెలిపారు. దళితుడికి హెయిర్ కట్ చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఈ హింస ఆపకపోతే, తమకు న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక నాగరిక సమాజంలో జాతి, కుల, మతం అటూ విద్వేషాన్ని వెళ్లగక్కడం శోచనీయమని మండిపడుతున్నాయి. ఇంకా దళితులు, అంటరాని వారు అంటూ వివక్ష, సంఘ బహిష్కారం లాంటి ఘటనలు అమానవీయమైవనవీ, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
'తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా'
ముంబై : టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌లో ఎంత నైపుణ్యతను ప్రదర్శించాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన బ్యాటింగ్ పవర్‌తోనే క్రికెట్ ప్రపంచంలో లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్ హెయిర్‌కట్ చేయడంలోనూ అంతే నైపుణ్యతను చూపిస్తున్నాడు. తాజాగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు హెయిర్‌కట్ చేసిన వీడియోనూ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం ఎవరి సహాయం లేకుండానే తనే సొంతంగా హెయిర్‌కట్ చేసుకున్న సచిన్ తాజాగా అర్జున్‌కు హెయిర్ ట్రిమ్ చేశాడు. సచిన్‌కు అతని కూతురు సారా టెండూల్కర్ అసిస్టెంట్‌గా వ్యవహరించడం ఇందులో మరో విశేషం.('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్ చేయొద్దు') 'క్రికెటర్‌గా దేశం తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడి గెలిపించాను. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నా. ఒక తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా.. పిల్లలతో కలిసి ఆడుకోవడం, తినడం, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడం లాంటివి చేస్తున్నా. తాజాగా నా కొడుకు అర్జున్‌కు హెయిర్‌కట్ చేయడం కూడా అందులో బాగమే. క్రికెట్ తర్వాత నేను బాగా సక్సెస్ అయింది హెయిర్‌కట్‌లో అని చెప్పాలి. అందులోనూ హెయిర్‌కట్ చేసిన తర్వాత వాడు( అర్జున్) చాలా అందంగా ఉన్నాడు. నాకు అసిస్టెంట్‌గా పని చేసినందుకు థ్యాంక్యూ ! సారా ' అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ('సెంచరీ కంటే భార్య చేసే హెయిర్‌కట్ కష్టంగా ఉంది') లాక్డౌన్ 4వ దశలో దేశంలోని సెలూన్ షాపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినా చాలా వరకు తెరుచుకోలేదనే చెప్పాలి. దీంతో యూట్యూబ్‌ను ఫాలో అవుతూ చాలా మంది తమ స్నేహితులు, ఇంట్లో వారితోనే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. లాక్డౌన్ మొదటి దశలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో హెయిర్ ట్రిమ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం టీమిండియా టెస్టు క్రికెటర్ చటేశ్వర్ పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
మగవారికి క్రాఫ్ కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో సెలూన్లు మూతపడ్డాయి. అసలే ఎండాకాలం..ఆపై జుట్టు పెరిగి పోవడంతో మగవారు ఉక్కపోతతో భరించలేకపోతున్నారు. బయటకెళ్లి క్రాఫ్ చేయించుకుందామంటే దాదాపు నెలన్నరగా షాపులన్నీ క్లోజ్. అ లాగే ఉంచుకుందామంటే చికాకు. దీంతో కొందరు తమ ఇంటి వద్దే క్రాఫ్ చేసుకుంటుంటే మరికొందరు సెలూన్ షాపు వాళ్లను ఫోన్లలో ఇళ్లకు రమ్మని చెబుతున్నారు. కాగా, కొందరు సెలూన్ షాపు యజమానులు లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి ఐదారుగురిని లోపల కూర్చోబెట్టి షాపులకు తాళం వేసి కస్టమర్లకు క్రాఫ్ వేస్తున్నారు. వాడిన కత్తెర, దువ్వెన్లను అందరికీ వాడుతున్నారు. వాటిని కొద్దిపాటినీళ్లతో కడిగి వదిలేస్తున్నారు. ఎలాంటి శానిటైజర్, చేతులకు గ్లౌజులు వాడకుండా క్రాఫ్ చేసేస్తున్నారు. ఇలా రోజుకు 10 నుంచి 15 మంది క్రాఫ్ చేస్తున్నారు. కరోనా విజృంభణ సయమంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. -
లాక్డౌన్: హెయిర్ స్టైలిష్‌గా సతీమణి!
సాక్షి, రాజంపేట: కరోనా లాక్‌డౌన్‌తో అన్ని సేవలు, సర్వీసులు రద్దయ్యాయి. దాంతో ఇంటికే పరిమితమైన జనం అవసరానికి తగినట్టు తమని తాము సంస్కరించుకుంటున్నారు. ప్రాణాంతక వైరస్‌ను తరిమికొట్టాలంటే.. సామాజిక దూరం తప్పనిసరి కావడంతో.. తమ పనులను తామే చేసుకుని ఔరా! అనిపిస్తున్నారు. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో చేతుల్లో కత్తెర్లతో.. అటు సెలబ్రిటీలతో పాటు సామాన్యులు తమ వాళ్లకు క్షవరం చేస్తున్నారు. దాంతోపాటు ఆ ఫొటోలను సరదాగా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా తన భర్తకు క్షవరం చేసిన వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన ఓ ఇల్లాలు ఔరా అనిపించారు. ఇక ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి హెయిర్ కట్ చేసిన అనుష్క శర్మ ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. (చదవండి: న్యూ కట్) -
భార్య ‘చేతి’లో బుక్కైపోయాడు..!
లండన్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అందరూ లాక్‌డౌన్‌కే పరిమితమయ్యారు. ప్రధానంగా సెలబ్రెటీలు ప్రతీ కాలక్షేపాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అదే సమయంలో హెయిర్కట్లను కూడా ఇంట్లోనే చేసుకుంటూ ఆ ఫోటోలను సైతం షేర్ చేస్తున్నారు. ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి భార్య అనుష్క శర్మ హెయిర్‌కట్ చేసి ఔరా అనిపించింది. ఎప్పుడూ సరికొత్త స్టైల్లో కనబడాలనే కోహ్లికి న్యూకట్ను ట్రై చేసి అనుష్క శర్మ విజయవంతమైంది. మరి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబర్ట్ కీ విషయానికొచ్చేసరికి మాత్రం ఆ న్యూకట్ కాస్తా తల్లక్రిందులైంది. (కోహ్లి న్యూకట్) రాబర్ట్కీకు హెయిర్ కట్ చేస్తానంటూ భార్య ఫ్లూయర్ కీ ముందుకు రావడంతో అతను ఒప్పుకున్నాడు. హెయిర్‌కట్‌లో భార్య ప్రతిభను చూద్దామని భావించాడు. కానీ కొత్త స్టైల్‌ను చూద్దామనుకున్న రాబర్ట్కీ భార్య చేసిన హెయిర్‌కట్‌తో పరేషాన్ అయ్యాడు. జట్టుకు సరికొత్త లుక్‌ను ఇవ్వాలనుకున్న భార్య.. భర్త త ల వెనుక భాగాన బొప్పడం చేసేసింది. ఇంకేముందు తన భార్య టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసేశాడు రాబర్ట్కీ. దానికి సంబంధించిన ఫోటోను ట్వీటర్లో పెట్టేశాడు. హెయిర్డ్రెసర్స్కు వేదన మిగిల్చిన నీకు అక్కడ వెళ్లడానికి ఎప్పుడూ అనుమతి ఉండదు’ అని కామెంట్ చేశాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరాన్, సిమాన్ జోన్స్‌లు లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేయగా, భార్య ఫ్లూయర్ ఇక చేసేది లేక రాబర్ట్ కీకు క్షమాపణలు తెలియజేశారు. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!) Well f*****g done @fleurkey u aren’t allowed to moan about hairdressers ever gain pic.twitter.com/ZAKG6fcgRg — Rob Key (@robkey612) April 16, 2020 -
న్యూ కట్
పని లేని మంగలి పిల్లి తల గొరిగాడన్నది సామెత. ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక ఏదో పని చేసేవాళ్లని ఇలా అంటుంటాం. ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ ఇంట్లో లాక్ అయిపోయి ఉన్నారు. బొమ్మలేస్తూ, పాటలు పాడుతూ, వ్యాయామం చేస్తూ ఇలా కాలక్షేపం కోసం చేస్తున్న ప్రతీదాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు స్టార్స్. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ఖాళీగా ఉండటంతో ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. అయితే అది వంట గదిలోనో, వైట్ పేపర్ మీదో కాదు. తన భర్త విరాట్ కోహ్లీ తల మీద. కత్తెర తీసుకొని భర్త కోహ్లీకి హెయిర్ కట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసి ‘లాక్ డౌన్ సమయాల్లో ఇలా ’’ అని కాప్షన్ చేశారు అనుష్క. ఈ కొత్త హెయిర్ స్టైల్ బావుందంటూ అనుష్కను అభినందించారు కోహ్లీ. -
నేను ఇలాగే చేస్తా!.. అయితే ఏంటి??
వాషింగ్టన్ : అమెరికాలోని మిస్కాన్సన్ నగరంలోని 22 ఏళ్ల యువకుడు.. క్రిస్మస్ సందర్భంగా అందంగా రెడీ అవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా లేటెస్ట్ హెయిర్ స్టయిల్ కోసం క్షౌరశాలకు వెళ్లాడు. లేటెస్ట్ ట్రెండ్ అయిన.. ‘2’ ఆకారంలో హెయిర్ కటింగ్ చేయాలని క్షురకుడికి చెప్పాడు. యువకుడి చెప్పింది వినిపించుకోని క్షరుకుడు.. ‘0’ ఆకారంలో హెయిర్ కటింగ్ చేశాడు. క్షరకుడు చెప్పినట్లు చేస్తున్నాడులే అన్న ధైర్యంతో యువకుడు కళ్లు మూసుకుని పాటలు వింటూ కాలం గడిపేశాడు. కటింగ్ అంతా పూర్తయ్యాక.. అద్దంలో చూసుకుని యువకుడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అంతే నేను చెప్పిందేమిటి? నువ్వేచేసిందేమిటి? అని క్షురకుడితో యువకుడు గొడవకు దిగాడు. ‘నేను ఇలాగే చేసా.. నువ్వు చెప్పింది వినపడలేదు.. ఇప్పుడు ఏం చేయగలవు’ అంటూ అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. క్షురకుడు చేతిలోకి కత్తి తీసుకుని యువకుడిపై దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామాన్ని యువకుడు ఊహించే లోపు.. చెవి భాగం కోసుకుపోయింది. ఈ ఘటనపై ఆగ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు క్షురకుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షురకుడిని 46 ఏళ్ల షబానీ ఖలీద్‌గా పోలీసులు గుర్తించారు. -
రూ. 2.4 లక్షల కోట్లు వదులుకోవాలి!
♦ రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో 40 శాతమే దక్కేది ♦ 50 మొండి ఖాతాలకు సంబంధించి ఇదే పరిస్థితి ♦ బ్యాంకుల ’హెయిర్‌కట్’ భారీగానే ఉంటుంది ♦ వీటిలో అధికం మెటల్, నిర్మాణ, విద్యుత్ కంపెనీలే ♦ విద్యుత్ కంపెనీల హెయిర్‌కట్ కాస్త తక్కువే: క్రిసిల్ ముంబై: భారీగా మొండి బకాయిలు పేరుకుపోయిన దాదాపు 50 ఖాతాలను పరిష్కరించుకునేందుకు బ్యాంకులు సుమారు రూ.2.4 లక్షల కోట్లు వదులుకోవాల్సి (హెయిర్‌కట్) రావొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ఆయా సంస్థలు చెల్లించాల్సిన మొత్తంలో ఇది సుమారు 60%మని తెలియజేసింది. ఈ 50 మొండి బాకీల ఖాతాలు.. మెటల్స్, నిర్మాణ, విద్యుత్ రంగాలకు చెందినవి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకున్న మొత్తం రూ.8 లక్షల కోట్ల పైగా నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణంలో వీటి వాటా దాదాపు సగభాగం ఉంటుందని క్రిసిల్ తెలిపింది. ‘దాదాపు రూ.4 లక్షల కోట్ల రుణభారం పేరుకుపోయిన 50 భారీ మొండి బాకీల ఖాతాల సమస్యను సెటిల్ చేసుకునేందుకు బ్యాంకులు సుమారు 60%.. అంటే దాదాపు రూ.2.4 లక్షల కోట్ల మేర వదులుకోవాల్సి వస్తుంది‘ అని పేర్కొంది. ఈ హెయిర్‌కట్‌ను స్వల్ప (25% కన్నా తక్కువ), ఒక మోస్తరు (25–50 %), అధికం (50–75%), అత్యధికం (75% పైగా) కింద నాలుగు రకాలుగా వర్గీకరించింది. ప్రస్తుతం ఇలా ఎన్పీఏలు బాగా పేరుకుపోయిన సంస్థలపై రిజర్వు బ్యాంకు సూచనల మేరకు అప్పులిచ్చిన బ్యాంకులు దివాలా ప్రక్రియను ఆరంభించిన విషయం తెలిసిందే. దివాలా ప్రక్రియలో భాగంగా చివరకు ఆయా సంస్థల ఆస్తుల్ని విక్రయించుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. ఇలా విక్రయించిన పక్షంలో బ్యాంకులకు 40% మొత్తమే దక్కుతుందని, మిగిలిన 60%న్ని వదులుకోవాల్సి ఉంటుందని క్రిసిల్ నివేదిక హెచ్చరించింది. ఒక మోస్తరుగా విద్యుత్ రంగం.. విద్యుత్ రంగ కంపెనీలకు ఒక మోస్తరు హెయిర్‌కట్ సరిపోతుందని, అయితే మెటల్స్, నిర్మాణ రంగ సంస్థల మొండి బాకీల విషయంలో బ్యాంకులు అధికంగానే వదులుకోవాల్సి రావొచ్చని క్రిసిల్ చీఫ్ అనలిటికల్ ఆఫీసర్ పవన్ అగ్రవాల్ తెలిపారు. అత్యధికంగా హెయిర్‌కట్ అవసరమయ్యే ఖాతాల్లో ఎక్కువ భాగం సంస్థలు నిలదొక్కుకోలేని వ్యాపార రంగాల్లో ఉన్నవేనని ఆయన పేర్కొన్నారు. ఒక మోస్తరు లేదా అధిక హెయిర్‌కట్ అవసరమైన కంపెనీలు చాలా మటుకు పెట్టుబడి వ్యయాల కోసం రుణాలు తీసుకున్నవే. అయితే డిమాండ్ పడిపోవడమో లేదా నియంత్రణపరమైన అడ్డంకులతో అవి తలపెట్టిన ప్రాజెక్టులు నిల్చిపోవడం.. ఫలితంగా సమయం వృధా కావడంతో పాటు వ్యయాలూ భారీగా పెరిగిపోయి సదరు ప్రాజెక్టు లాభదాయకత దెబ్బతినడమో జరిగిందని క్రిసిల్ తెలిపింది. ఇక స్వల్ప హెయిర్‌కట్ అవసరమయ్యే కంపెనీలు.. తాత్కాలికంగా ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నవని, కాలక్రమేణా అవి సర్దుకోగలవని వివరించింది. నిర్ణయాలు వాయిదా వేయడం కన్నా ఎకానమీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఒకింత కష్టమైనా హెయిర్‌కట్ చేదు మాత్ర తీసుకోవడమే శ్రేయస్కరమని తెలిపింది. బ్యాంకులకు మూలధనంపై కేంద్రం కసరత్తు.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం సమకూర్చే వ్యూహంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలో దీనిపై ప్రకటన చేయొచ్చని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తమ తమ మూలధన అవసరాలపై వివిధ బ్యాంకులు పంపిన అభ్యర్ధనలకు సంబంధించి ఇంద్రధనుష్ స్కీము కింద నిధులు సమకూర్చే ప్రతిపాదనలకు తుది రూపునిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. లబ్ధి పొందే బ్యాంకుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని, గత ంలోలాగే ఈసారీ మూలధన నిధులు దశలవారీగా అందిస్తామని అధికారి తెలిపారు. ఇంద్రధనుష్ స్కిము కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల మూలధన అవసరాలకోసం రూ. 10,000 కోట్లు కేటాయించినప్పటికీ.. మొండిబాకీల పరిష్కారాల కోసం బ్యాంకులు అధిక ప్రొవిజనింగ్ చేయాల్సి వస్తుండటంతో ఈ మొత్తం సరిపోకపోవచ్చని భావిస్తున్నారు. స్వయంగా ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సైతం గత నెలలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బ్యాంకుల్లో 60 శాతం ఉద్యోగాల కోత-క్రిసిల్
ముంబై: మొండి బకాయిల సమస్యల పరిష్కారం కోసం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం బ్యాంకు ఉద్యోగుల పాలిట శాపంగా మారనుంది. ముఖ్యంగా ఎన్పీఏల కారణంగా బ్యాంకుల ఆదాయం మందగించడం ఉద్యోగులకు ముప్పుగా మారింది. ఇటీవలి ఆర్బీఐ కఠిన చర్యల కారణంగా దేశీయ బ్యాంకుల్లో 60 ఉద్యోగుల్లో కోత పెట్టే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదించిన దివాలా చట్టం బ్యాంకులకు అనుకూలమైన చర్యగా అభివర్ణించిన క్రిసిల్ ఉద్యోగాల కోత షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది. విడుదల చేసిన నివేదికలో బ్యాంకుల ఉద్యోగాల కోతను ప్రముఖంగా ప్రస్తావించింది. బకాయిల వసూలుతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 25 శాతం ప్రొవిజనింగ్ పెంచుకోవాలన్న ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు భారీగా ఉద్యోగాలను తగ్గించుకోనున్నాయని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతం వృద్ధిని సాధించినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే తదుపరి ఆరు ఎనిమిది త్రైమాసికాల్లో ప్రొవిజనింగ్ రుసుమును వసూలు చేయడానికి బ్యాంకులకు అనుమతి లభిస్తే ఈ భారీ ప్రభావం కొంత శాంతించే అవకాశం ఉందని చెప్పారు. ఈ గణనీయమైన మందగమనాన్ని అధిగమించడంలో దాదాపు 70శాతంకంటే ఎన్పీఏ లు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కృషి, క్యాపిటల్ పొజిషన్ ను చాలా దగ్గరగా పరిశీల్సించాల్సి ఉందని క్రిసిల్ డైరెక్టర్ రామ పటేల్ పేర్కొన్నారు. కాగా ఇన్ సాల్వెనసీ అండ్ బ్యాంకరప్టీ కోడ్ దివాలా స్మృతి(ఐబీసీ) 2016 ద్వారా ఎగవేతదార్ల మెడలు వంచేందుకు సిద్ధపడిన ఆర్బీఐ బకాయిలు రాబట్టుకోడానికి పెద్ద ముందడుగు వేసింది. ఈక్రమంలో 12 అతిపెద్ద మొండి ఖాతాలను ప్రకటించింది. వీటిలో ఆరింటిని ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూ అప్పగించింది. వీటిలో ప్రధానంగా అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఖాతాలు ఆరు. అంతర్గత సలహా కమిటీ (ఐఏసీ) సిఫారసుల ఆధారంగాఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా మొండి ఖాతాలకు గట్టి హెచ్చరిక జారీ చేయడంతోపాటు నిర్ణీత సమయంలో ఈ కేసుల పరిష్కారాన్ని బ్యాంకులకు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే -
ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?
రాంచి: టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్‌గా ఉండడంలోనే కాదు నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు. బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న ఫొటోను తన ఫేస్బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్ చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు. నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్' రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.