
‘జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నారుగానీ ‘టాలెంట్ ఉన్న వ్యక్తి కత్తెర ఉపయోగించకుండా హెయిర్ కట్ చేసినా జుట్టుకు అందమే’ అని ఎవరూ అనలేదు. విషయంలోకి వస్తే... తమిళనాడులో ఒక బార్బర్ తన కస్టమర్‌కు హెయిర్ కటింగ్ చేయడానికి కత్తెర ముట్టుకోకుండా ‘మంట’ను ఉపయోగించాడు. క్లయింట్ జుట్టు కత్తిరించడానికి, స్టైల్ చేయడానికి ‘ఫైర్ టార్చ్’ను ఉపయోగించి రకరకాల విన్యాసాలు చేశాడు. ‘ఎక్స్’లో ప్రత్యక్షమైన ఈ వీడియో క్లిప్ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఇక ఈ వీడియోకు వచ్చిన స్పందన విషయానికి వస్తే... బార్బర్ నైపుణ్యం, ధైర్యాన్ని చాలామంది అభినందించగా కొద్దిమంది మాత్రం ‘నీ దుంపతెగ ఇదేమీ దుస్సాహసం’ అన్నట్లుగా కామెంట్లు పెట్టారు. ‘నెత్తి మీద ఇంత దగ్గరగా మంటను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు...’ అంటూ చెప్పుకొచ్చారు కొందరు.
క్లయింట్‌కు ఎర్ర వస్త్రం చుట్టి మరీ ప్రయోగంలోకి దిగాడు బార్బర్. రెడ్ క్లాత్ చుట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ‘ఇది ప్రమాదం సుమీ’ అని చెప్పకనే చె΄్పాలకున్నాడో తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment