
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో సెలూన్లు మూతపడ్డాయి. అసలే ఎండాకాలం..ఆపై జుట్టు పెరిగి పోవడంతో మగవారు ఉక్కపోతతో భరించలేకపోతున్నారు. బయటకెళ్లి క్రాఫ్ చేయించుకుందామంటే దాదాపు నెలన్నరగా షాపులన్నీ క్లోజ్. అ లాగే ఉంచుకుందామంటే చికాకు. దీంతో కొందరు తమ ఇంటి వద్దే క్రాఫ్ చేసుకుంటుంటే మరికొందరు సెలూన్ షాపు వాళ్లను ఫోన్లలో ఇళ్లకు రమ్మని చెబుతున్నారు. కాగా, కొందరు సెలూన్ షాపు యజమానులు లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి ఐదారుగురిని లోపల కూర్చోబెట్టి షాపులకు తాళం వేసి కస్టమర్లకు క్రాఫ్ వేస్తున్నారు. వాడిన కత్తెర, దువ్వెన్లను అందరికీ వాడుతున్నారు. వాటిని కొద్దిపాటినీళ్లతో కడిగి వదిలేస్తున్నారు. ఎలాంటి శానిటైజర్, చేతులకు గ్లౌజులు వాడకుండా క్రాఫ్ చేసేస్తున్నారు. ఇలా రోజుకు 10 నుంచి 15 మంది క్రాఫ్ చేస్తున్నారు. కరోనా విజృంభణ సయమంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు వాటిల్లే ప్రమాదముంది.
Comments
Please login to add a commentAdd a comment