
గాంధీనగర్ : అతిపొడవైన వెంట్రుకలతో ప్రత్యేకత చాటుకున్న నిలాంషి పటేల్ ఆ వెంట్రులకను కత్తరించుకుంది. గుజరాత్‌లోని అరవల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల నిలాంషి 12 ఏళ్లపాటు అపురూపంగా పెంచుకున్న 6 అడుగుల 6.7 అంగుళాల పొడవైన వెంట్రుకలతో ఈ టీనేజర్ ఇటీవల గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2018లో 170.5 సెంటీమీటర్ల పొడవు కేశాలతో రికార్డు సృష్టించిన నిలాంషి.. తరువాత 2019లో 190 సెంటీమీటర్లు.. 2020లో 200 సెంటీమీటర్ల పొడవుగా కేశాలను పెంచింది. ఫలితంగా ప్రపంచంలో అతి పొడవైన కేశాలు కల్గిన యువతిగా మరోసారి గుర్తింపు పొందింది.
ఈ ఘనత తన తల్లికే చెందుతుందని నిలాంషి తెలిపింది. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన తనను మార్చేసిందని పేర్కొంది. అయితే, తాజాగా ఆ వెంట్రుకలను కత్తిరించుకొన్న వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పెట్టింది. ‘చాలా ఉత్సాహంగా అలాగే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఈ కొత్త హెయిర్‌స్టైల్‌తో ఎలా కనిపిస్తానో నాకు తెలీదు. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ అది అద్భుతంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను’ అని పేర్కొంది. ఇక తన వెంట్రుకలను హాలీవుడ్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డు మ్యూజియానికి అందజేసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment