
లండన్: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అందరూ లాక్‌డౌన్‌కే పరిమితమయ్యారు. ప్రధానంగా సెలబ్రెటీలు ప్రతీ కాలక్షేపాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అదే సమయంలో హెయిర్‌కట్‌లను కూడా ఇంట్లోనే చేసుకుంటూ ఆ ఫోటోలను సైతం షేర్ చేస్తున్నారు. ఇటీవల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి భార్య అనుష్క శర్మ హెయిర్‌కట్ చేసి ఔరా అనిపించింది. ఎప్పుడూ సరికొత్త స్టైల్‌లో కనబడాలనే కోహ్లికి న్యూకట్‌ను ట్రై చేసి అనుష్క శర్మ విజయవంతమైంది. మరి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబర్ట్ కీ విషయానికొచ్చేసరికి మాత్రం ఆ న్యూకట్ కాస్తా తల్లక్రిందులైంది. (కోహ్లి న్యూకట్)
రాబర్ట్‌కీకు హెయిర్ కట్ చేస్తానంటూ భార్య ఫ్లూయర్ కీ ముందుకు రావడంతో అతను ఒప్పుకున్నాడు. హెయిర్‌కట్‌లో భార్య ప్రతిభను చూద్దామని భావించాడు. కానీ కొత్త స్టైల్‌ను చూద్దామనుకున్న రాబర్ట్‌కీ భార్య చేసిన హెయిర్‌కట్‌తో పరేషాన్ అయ్యాడు. జట్టుకు సరికొత్త లుక్‌ను ఇవ్వాలనుకున్న భార్య.. భర్త త ల వెనుక భాగాన బొప్పడం చేసేసింది. ఇంకేముందు తన భార్య టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసేశాడు రాబర్ట్‌కీ. దానికి సంబంధించిన ఫోటోను ట్వీటర్‌లో పెట్టేశాడు. హెయిర్‌డ్రెసర్స్‌కు వేదన మిగిల్చిన నీకు అక్కడ వెళ్లడానికి ఎప్పుడూ అనుమతి ఉండదు’ అని కామెంట్ చేశాడు. దీనికి ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరాన్, సిమాన్ జోన్స్‌లు లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేయగా, భార్య ఫ్లూయర్ ఇక చేసేది లేక రాబర్ట్ కీకు క్షమాపణలు తెలియజేశారు. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!)
Well f*****g done @fleurkey u aren’t allowed to moan about hairdressers ever gain pic.twitter.com/ZAKG6fcgRg
— Rob Key (@robkey612) April 16, 2020
Comments
Please login to add a commentAdd a comment