ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే? | Here's Why MS Dhoni Is Captain Cool And 'Thalaivar' For His Fans! | Sakshi
Sakshi News home page

ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?

Published Mon, Jul 4 2016 4:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?

ధోనిని రజనీకాంత్ తో ఎందుకు పోల్చారంటే?

రాంచి: టీమిండియా 'మిస్టర్ కూల్' ఎంఎస్ ధోనిని అభిమానులు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో పోలుస్తున్నారు. ధోని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన హెయిర్ కట్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కూల్గా ఉండడంలోనే కాదు నిరాడంబరతలోనూ తనను తానే సాటి ధోని నిరూపించుకున్నాడని కితాబిచ్చారు. బుద్ధిగా కూర్చుని 'బెస్ట్ ఫినిషర్' సదాసీదాగా జుత్తు కత్తిరించుకుంటున్న ఫొటోను తన ఫేస్బుక్ పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.

ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా ధోని హెయిర్ కట్ చేయించుకోవడం చూసి అభిమానులు అవాక్కయ్యారు. టీమిండియా కెప్టెన్ అంటే హై-ఫై సెలూన్ లో కటింగ్ చేయించుకుంటాడని భావించిన ఫ్యాన్స్ ధోని పెట్టిన ఫొటో చూసి అతడిపై ప్రశంసలు కురిపించారు. కింద నుంచి పైకి వచ్చాడు కాబట్టే అతడు నిరాడంబరంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ధోనికి ఈగో లేదని, చాలా సింపుల్ ఉంటాడని మరొకరు కామెంట్ చేశారు.

నిరాడంబరంగా ఉండేవాడే నిజమైన సూపర్ స్టార్, సూపర్ హీరో అని.. 'తలైవర్' రజనీకాంత్ తర్వాత ధోనిలో సింప్లిసిటీ చూశానని మరొక అభిమాని అన్నాడు. ధోని ఆటతో పాటు అతడి హెయిర్ స్టైల్ ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు హెయిర్ కట్ కూడా హాట్ టాఫిక్ గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement