Anushka Sharma Says Katrina Kaif & Vicky Kaushal Will Be Her Neighbours - Sakshi
Sakshi News home page

Katrina Kaif- Vicky Kaushal: విరుష్క పొరుగింట్లోకి కత్రినా- విక్కీ.. హమ్మయ్య మీకు పెళ్లైంది.. ఇప్పటికైనా!

Published Fri, Dec 10 2021 4:38 PM | Last Updated on Fri, Dec 10 2021 7:50 PM

Virat Kohli Anushka Sharma Glad To Have Katrina Kaif Vicky Kaushal As Neighbours - Sakshi

Anushka Sharma Welcomes Neighbours Katrina Kaif and Vicky Kaushal: విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ.. విరుష్క జోడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా విజయవంతమైన సారథిగా కోహ్లి తనదైన ముద్ర వేస్తే.. బాలీవుడ్‌ హీరోయిన్‌, నిర్మాతగా అనుష్క విజయపథంలో దూసుకుపోతున్నారు. సంపాదనలోనూ తగ్గేదేలే అంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉందీ జంట. ఇక విరుష్కలు తమ కూతురు వామికతో కలిసి ముంబైలోని జుహులో గల విలాసవంతమైన అపార్టుమెంటులో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు వీరి పక్క బిల్డింగులోకి మరో సెలబ్రిటీ జంట రాబోతుందట. వాళ్లెవరో కాదు.. విక్ట్రినా.. అదేనండి.. బాలీవుడ్‌ కొత్త దంపతులు కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. రాజస్తాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్టులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరుష్క వీరికి శుభాభినందనలు తెలిపారు.  అంతేకాదు.. త్వరలోనే తమ పక్క అపార్టుమెంటులో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు.

చదవండి: Virat Kohli: అబ్బో ఇంత తొందరగా.. ఇప్పుడే తెల్లారిందా మీకు! తనే మాకు కింగ్‌!

ఈ మేరకు..‘‘అందమైన జంటకు శుభాభినందనలు! జీవితాంతం ఇలాగే ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ... ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి! హమ్మయ్య ఇప్పటికైనా మీ పెళ్లి జరిగింది... ఇక కొత్త ఇంటికి రావడమే తరువాయి! ఇప్పుడైనా.. పక్కింట్లో నుంచి వచ్చే శబ్దాలు(నిర్మాణంలో ఉన్నందున) తగ్గుతాయేమో’’ అంటూ తమ పొరిగింటి వారికి ఫన్నీగా స్వాగతం పలికారు.

కాగా పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత కత్రినా- విక్కీ పలు ఆలయాల సందర్శించడం సహా కొన్ని రోజుల పాటు విహార యాత్రలు చేసి.. ఆ తర్వాత జుహులోని అపార్టుమెంటులోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. సముద్ర ముఖంగా ఉండే ఈ ఫ్లాట్‌ను ఏరికోరి సెలక్ట్‌ చేసుకున్నారట ఈ అందమైన జంట.

చదవండి: Vicky Kaushal-Katrina Kaif Wedding: సమంత బాటలో కత్రినా.. సేమ్‌ సీన్‌ రిపీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement