
విరాట్ కోహ్లి- అనుష్క శర్మ (PC: Virat Kohli Instagram)
Virat Kohli- Anushka Sharma: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ముంబై ఈవెంట్‌లో సందడి చేశాడు. ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్-2023 ఫంక్షన్‌లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌లో పలువురు క్రీడా ప్రముఖులు సహా బాలీవుడ్ తారలు తళుక్కుమన్నారు. ఇక అందరిలో స్టార్ కపుల్ విరుష్క జోడీ హైలైట్‌గా నిలిచింది.
విరాట్- అనుష్క కలిసి రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు ఫోజులిచ్చారు. కోహ్లి బ్లాక్ సూట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించగా.. అనుష్క పర్పుల్ కలర్ హాఫ్ షోల్డర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ముంబైలో జరిగిన గురువారం నాటి ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను విరాట్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
(PC: Virat Kohli Instagram)
ఇంకా భయంగానే కోహ్లి!
‘‘అందమైన జంట.. ఎప్పుడూ ఇలాగే ఉండాలి. పెళ్లై ఇన్నేళ్లు అయినా.. విరాట్ భయ్యా నువ్వు ఇంకా వదినమ్మకు భయపడుతున్నట్లే కనిపిస్తున్నావు’’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లి పంచుకున్న విషయాలను గుర్తు చేస్తూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ ఈవెంట్‌లో విరుష్క జోడీకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
(PC: Virat Kohli Instagram)
యాడ్ కలిపింది ఇద్దరినీ
కమర్షియల్ యాడ్ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్కను తొలిసారి కలిసినపుడు నెర్వస్‌గా ఫీలయ్యానంటూ కోహ్లి పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపిన ఈ టీమిండియా స్టార్.. స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని.. ఆమెతో ఏడడుగులు వేసినట్లు తెలిపాడు. 2017 డిసెంబరు 11న ఇటలీలో విరాట్- అనుష్కల డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. వీరికి 2021 జనవరిలో కుమార్తె వామిక జన్మించింది.
(చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి!)
ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డులు?
వివిధ క్రీడల్లో రాణించిన భారత క్రీడాకారులను సత్కరించేందుకు గానూ 2017 నుంచి ఇండియన్ స్పోర్ట్స్ అవార్డులు అందజేస్తున్నారు. 2019లో సెకండ్ ఎడిషన్ జరుగగా.. కోవిడ్ కారణంగా 2021లో ఆన్‌లైన్‌లో మూడో ఎడిషన్ నిర్వహించారు. ఈసారి ముంబైలోని జుహులో గల జేడబ్ల్యూ మారియట్‌లో ఫంక్షన్ జరిగింది.
ఇందుకు సంబంధించిన కార్యక్రమం మార్చి 26న ప్రసారం కానుంది. కాగా ఇండియన్ బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, ఒలంపిక్ గోల్డ్‌మెడలిస్ట్ అభినవ్ బింద్రా, ఒలంపిక్ మెడల్ విన్నర్ విజేందర్ సింగ్, పరుగుల రాణి పీటీ ఉష, మాజీ షూటర్ అంజలీ భగవత్, డిస్నీ+హాట్‌స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా జ్యూరీ సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment