Virat Kohli And Anushka Sharma Shares Pics Of Rishikesh Trekking Goes Viral - Sakshi
Sakshi News home page

Virushka With Vamika: ప్రకృతి ఒడిలో.. వామికాను ఆటలాడిస్తూ.. విరుష్క ఫొటోలు వైరల్‌

Published Wed, Feb 1 2023 1:13 PM | Last Updated on Wed, Feb 1 2023 4:37 PM

Virat Kohli Anushka Sharma shares Pics Of Rishikesh Trekking Goes Viral - Sakshi

రిషికేశ్‌లో ట్రెక్కింగ్‌ చేస్తున్న విరుష్క జోడీ(PC: Anushka Sharma Instagram)

Virat Kohli- Anushka Sharma: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో తనకు లభించిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి. భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి ఉత్తరాఖండ్‌ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా రిషికేశ్‌లో స్వామి దయానంద్‌ ఆశ్రమాన్ని సందర్శించిన విరుష్క జోడి.. తర్వాత ‘సాహసయాత్ర’కు బయల్దేరింది.


PC: Anushka Sharma Instagram

ప్రకృతిని ఆస్వాదిస్తూ
తమ గారాల పట్టి వామికాతో కలిసి విరాట్‌- అనుష్క రిషికేశ్‌ కొండల్లో ట్రెక్కింగ్‌ చేశారు. అడుగడుగునా తారసపడిన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. తేటతెల్లంగా ఉన్న నీటిలో వామికాను ఆటలాడిస్తూ మురిసిపోయారు. 


PC: Virat Kohli Instagram

దారిలో తమను రంజింపచేసిన ఆవులు, మేకలు.. పూర్వకాలం నాటి ఇళ్లతో కూడిన పల్లె వాతావరణాన్ని ఎంజాయ్‌ చేశారు. బిడ్డను భుజాన వేసుకుని కోహ్లి నడుస్తుండగా.. అనుష్క ఫొటోలు క్లిక్‌మనిపించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.


PC: Anushka Sharma Instagram

తదుపరి టెస్టు సిరీస్‌లో..
కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో 8, 11 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. మూడో వన్డేలో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ద్విశతకం, శతకంతో చెలరేగిన వేళ తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో ఈ రన్‌మెషీన్‌ విఫలమయ్యాడు.


PC: Anushka Sharma Instagram
ఇక టీ20 సిరీస్‌ నేపథ్యంలో సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌తో విరాట్‌ కోహ్లి మళ్లీ మైదానంలో దిగనున్నాడు.

చదవండి: Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్‌ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ 
Ind Vs NZ 3rd T20: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement