231 డైనోసార్ గుడ్లు లభ్యం | 231 Dinosaur Eggs Seized From Home in China | Sakshi
Sakshi News home page

231 డైనోసార్ గుడ్లు లభ్యం

Published Fri, Aug 7 2015 9:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

231 డైనోసార్ గుడ్లు లభ్యం

231 డైనోసార్ గుడ్లు లభ్యం

బీజింగ్: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 231 రాక్షసబల్లి (డైనోసార్) గుడ్లను ఓ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు చైనా అధికారులు. గుడ్లతోపాటు ఒక డైనోసార్ అస్తిపంజరాన్ని కూడా దొరికింది. సంచలనం రేపిన ఈ సంఘటన గువాంగ్డోంగ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. జులై 29న స్వాధీనం చేసుకున్న డైనోసార్ గుడ్లకు సంబందించిన వివరాలను స్థానిక మీడియా గురువారం వెల్లడించింది.

గడిచిన జూన్ నుంచి జులై వరకు గువాంగ్డోంగ్ ప్రావిన్స్ రాజధాని హెయువాన్ నగరంలో ఓ ఇంటి నిర్మాణం కోసం జరిపిన పునాది తవ్వకాల్లో శిథిలావస్థలోఉన్న డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. వాటితోపాటు ఓ అస్తిపంజరం కూడా లభించింది. సదరు స్థల యజమాని వీటిని అట్టిపెట్టుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గురువారం అతడి ఇంటిపై దాడిచేసి గుడ్లు, అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నిజానికి హెయువాన్ నగరంలో డైనోసార్ గుడ్లు లభించడం కొత్తేమీకాదు. చైనాలో 'డైనోసార్ల స్వస్థలం' అని హెయివాన్ నగరానికి పేరుంది. ఇక్కడి మ్యూజియంలో ఇప్పటికే 10వేలకు పైగా రాక్షస బల్లుల గుడ్లున్నాయి. ఆ రకంగా ఈ నగరం గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. కాగా, 'తవ్వకాల్లో ఏదేనీ వస్తువు లేదా పదార్థం శిథిలావస్థలో దొరితే అది ప్రభుత్వ ఆస్థే' అని చైనాలో చట్టం ఉంది. దాని ప్రకారం ఎలాంటి శిధిలాలైనా కంటబడితే వెంటనే ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement